దాదాపు నెల క్రితం నుంచే చలి తీవ్రత పెరిగింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కూడా కురుస్తోంది. చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో చలి తీవ్రత ఎక్కువైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రహదారులను పొగమంచు (Fog) కమ్మేస్తోంది. ఉదయం పూట వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గతవారం ఖరగ్‌పూర్ జాతీయరహదారిపై ఏకంగా 15 వాహనాలు ఢీకొన్నాయి. దీన్ని బట్టి పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. శీతాకాలంలో (Winter) వీలైనంత వరకు ప్రయాణాలను తగ్గించుకోవడం బెటర్. అత్యవసరం అనుకుంటే వాతావరణ పరిస్థితులు తగట్టు ప్లాన్ చేసుకోవడం మంచిది. పొగమంచు సమయంలో వాహనాలను నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు పరిశీలిద్దాం.
పొగమంచు కారణంగా రోడ్డుపై పరిసరాలు స్పష్టంగా కనిపించవు. విజిబులిటీ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. వాహనాల హెడ్ లైట్స్‌ను లో- బీమ్‌లో ఉంచడం వల్ల విజిబులిటీ చక్కగా ఉంటుంది. హెడ్‌లైట్స్‌ను హై-బీమ్‌పై ఉంచడం వల్ల ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పొగమంచు ఈ కాంతిని తిరిగి ప్రతిబింబిస్తుంది. దీంతో డ్రైవర్‌కు ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగా కనిపించవు.
Pension News: పెన్షన్ రూ.7,500 చేయండి... లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిక
దట్టమైన పొగమంచు సమయంలో వాహనాన్ని రోడ్డుకు ఒకవైపు మాత్రమే నడిపాలి. ఇతర వాహనాలను టేక్ ఓవర్ చేయకుండా నిదానంగా వెళ్లాలి. స్పీడ్‌గా వెళ్లి టేక్ ఓవర్ చేసే సమయంలో ఇతర వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉంది. దీంతో రహదారిపై ఒకే లేన్‌కు కట్టుబడి వాహనాన్ని డ్రైవ్ చేయడం ఉత్తమం.
డ్రైవింగ్ సమయంలో విజన్ క్లియర్‌గా ఉండాలి. ఇందు కోసం ఎప్పటికప్పుడు వాహనాల విండ్ స్క్రీన్‌ను లోపల, వెలుపల క్లీన్ చేస్తుండాలి.
పొగమంచు కారణంగా రోడ్డు సక్రమంగా కనిపించదు.. అందుకే స్లోగా డ్రైవ్ చేయాలి. అంతేకాకుండా ముందు వెళ్లే వాహనానికి తగిన దూరం పాటిస్తూ వెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఏదైనా అవాంతరం ఏర్పడితే వెంటనే ప్రతిస్పందించడానికి, వేగాన్ని తగ్గించుకోవడానికి, అవసరమైతే వాహనాన్ని ఆపడానికి ఆస్కారం ఉంటుంది. తగిన గ్యాప్ లేకుండా వాహనాలు ఒకదానికొకటి అనుసరిస్తున్నప్పుడు తరచుగా ఢీకొనే ఆస్కారం ఉంది.
OTP Scam: ఓటీపీ చెప్తే ఉన్నదంతా ఊడ్చేస్తారు... ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే?
పొగమంచు సమయంలో డ్రైవ్ చేస్తుంటే పరిసరాలను అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో స్పీడ్‌గా వెళ్తే.. అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు హఠాత్తుగా వాహనం ఆపడం కష్టమవుతుంది. వేగంగా వాహనాన్ని కంట్రోల్ చేయలేరు. చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాహాన్ని నియంత్రిత స్పీడ్‌లో నడపడం బెటర్. దీంతో ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, WINTER, Winter Tips