Home /News /business /

ARE YOU DOING ITR ONLINE IF YOU FOLLOW THESE TIPS AND FILE MISTAKES WILL NOT GO AWAY AT ALL UMG GH

ITR Filing Online: ఆన్ లైన్ లో ఐటీఆర్ చేస్తున్నారా ? ఈ టిప్స్ చూసి ఫైల్ చేశారంటే తప్పులు అస్సలు పోవు!

ఆన్ లైన్ లో ఐటీఆర్ చేస్తున్నారా ? ఈ టిప్స్  చూసి ఫైల్ చేశారంటే తప్పులు అస్సలు పోవు!

ఆన్ లైన్ లో ఐటీఆర్ చేస్తున్నారా ? ఈ టిప్స్ చూసి ఫైల్ చేశారంటే తప్పులు అస్సలు పోవు!

ఆదాయ పన్ను రిటర్న్( ITR Filing) ఫైలింగ్‌కు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో రిటర్న్(Return) ఫైలింగ్‌లో తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన విషయాల గురించి తెలుసుకోవడం మంచిది.

ఆదాయ పన్ను(Income Tax) రిటర్న్ ఫైల్ చేయడంలో ఏదైనా చిన్న తప్పిదం జరిగినా ఐటీఆర్‌ రీఫండ్‌ నిలిచిపోయే అవకాశం ఉంది. జరిమానా చెల్లించాల్సి కూడా వస్తుంది. ఇలాంటి సమస్యలను దూరం చేయడానికి ఐటీఆర్‌ను వీలైనంత త్వరగా ఫైల్‌ చేయాలి. అవసరమైన వివరాలు, డాక్యుమెంట్స్(Documents) అన్నీ ముందే సిద్ధం చేసుకుంటే ఎలాంటి తప్పులు లేకుండా ఐటీఆర్‌ ఫైల్‌ చేయవచ్చు. ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్‌కు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఈ నేపథ్యంలో రిటర్న్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన విషయాల గురించి తెలుసుకోవడం మంచిది.

ట్యాక్స్‌ సీజన్‌లో ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. అన్ని పత్రాలను సిద్ధం ఉంచడం, అవసరమైతే సులభంగా యాక్సెస్ చేయడానికి అనుకూలంగా ఉంచుకోవాలి. పన్ను రిటర్న్‌లను ఫైల్ చేస్తున్నప్పుడు కొన్ని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యాపారవేత్త లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ ప్రక్రియ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. మొత్తం ప్రక్రియను సులభతరం చేయడానికి, అన్ని పాత పన్ను రసీదులు, పెట్టుబడి రికార్డులు, ఆదాయ రసీదులు, ఇతర పన్ను(taxes) పత్రాలు, ఒకే చోట ఉంచుకోవాలి.

సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోండి
పొందే ఆదాయాన్ని బట్టి ఏ ఐటీఆర్ ఫారమ్‌ను ఫైల్ చేయాలో తెలుసుకోవాలి. ఆదాయ రకానికి ఏ ఫారమ్ వర్తిస్తుందో గుర్తించడాన్ని సులభతరం చేసే కండిషన్స్‌ ఉన్నాయి. ఏ ITR ఫారమ్ వర్తిస్తుందో తెలిసిన తర్వాత, పన్ను రిటర్న్‌లను సులభంగా ఫైల్ చేయవచ్చు.

లెక్కలను మళ్లీ పరిశీలించాలి
వివరాలను నమోదు చేసిన తర్వాత ITR ఫారమ్‌ను మళ్లీ పూర్తిగా పరిశీలించడం మంచి పద్ధతి. ఇది ఫారమ్‌ను సమీక్షించడానికి, ఫారమ్ 16లో చూపిన సంఖ్యల ప్రకారం అన్ని సంఖ్యలు సరైనవని నిర్ధారించుకోవడానికి సమయం ఇస్తుంది.

అన్ని ఆదాయాలను రిపోర్ట్‌ చేయాలి
ఇతర సోర్సెస్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని విస్మరించడం ప్రజలు తరచుగా చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి. 'ఇన్‌కం ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’ అనే విభాగం కిందకు వచ్చే కొన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి. 26ASలో రిపోర్ట్‌ చేయనప్పటికీ, పన్ను రిటర్న్ ఫారమ్‌లో దీన్ని రిపోర్ట్‌ చేయడం అవసరం.

TDS, చెల్లించిన పన్నులను తెలుసుకోవాలి
ఆదాయం(Income)లో ఎక్కువ భాగం TDSకి లోబడి ఉండవచ్చు. డిడక్టర్ చేసిన పొరపాటు కారణంగా కొన్నిసార్లు ఈ TDS 26ASలో సరిగ్గా ప్రతిబింబించకపోవచ్చు. 26AS కేవలం రీకన్సిలియేషన్‌ కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి, దానిపై ఆధారపడవద్దు. టీడీఎస్‌ మినహాయించిన రుజువు ఉంటే, అది 26ASలో కనిపించకపోయినా క్రెడిట్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్ లేదా సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూపంలో పన్నులు చెల్లిస్తే, పన్ను రిటర్న్‌లో దాని వివరాలను తప్పక నమోదు చేయాలి. లేకుంటే పన్ను శాఖ దానిని గుర్తించదు.

ఇ-ఫైలింగ్ తర్వాత ITR వెరిఫై చేయాలి
ఆదాయ పన్ను రిటర్న్‌ను విజయవంతంగా ఇ-ఫైల్ చేయడం ముఖ్యం, కానీ అక్కడితో పని పూర్తి కాలేదు. పన్ను రిటర్న్‌ను ఇ-ఫైలింగ్ చేసిన 120 రోజులలోపు సాధారణ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే ITR-Vని CPC బెంగళూరుకు సంతకం చేసి పంపాలి. ప్రత్యామ్నాయంగా, నెట్‌బ్యాంకింగ్, ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్, ఇమెయిల్‌లో EVCని ఉపయోగించడం ద్వారా కూడా ITR-Vని ఇ-ధృవీకరించవచ్చు. I-T శాఖ ITR-Vని స్వీకరించిన తర్వాత మాత్రమే పన్ను రిటర్న్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది.

చేయకూడనివి

అన్ని వివరాలు చెక్ చేయకపోవడం
బ్యాంక్ వివరాలలో పొరపాటు చేయడం (పేరు, IFSC కోడ్, రీఫండ్ కోరుకునే అకౌంట్‌ నంబర్) రీఫండ్‌పై ప్రభావం చూపుతుంది. తప్పుడు TAN నంబర్‌ను కోట్ చేయడం వల్ల TDS క్రెడిట్ రిజక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. తక్కువ రీఫండ్‌ కావడం లేదా పన్ను చెల్లించాల్సి రావచ్చు. అలాగే పోస్టల్ అడ్రస్‌ లేదా ఇమెయిల్‌లో పొరపాటు చేస్తే, పన్ను శాఖ నుంచి నోటీసులు, రీఫండ్ చెక్కు మొదలైనవాటిని స్వీకరించక పోవచ్చు. రాంగ్‌ మొబైల్ నంబర్‌ ఇస్తే రిటర్న్, రీఫండ్ ప్రాసెసింగ్‌పై ముఖ్యమైన సమాచారం అందదు. వివరాలను నమోదు చేసిన తర్వాత మరోసారి చెక్ చేస్తే ఇలాంటి తప్పులను కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

డిడక్షన్స్‌ క్లెయిమ్‌ చేయడం మరిచిపోకూడదు
ట్యాక్స్‌ లయబిలిటీని తగ్గించుకోవాలంటే డిడక్షన్స్‌ ముఖ్యమైనవి. ప్రభుత్వం I-T చట్టంలోని u/s 80 ప్రకారం చాలా డిడక్షన్స్‌ తీసుకొచ్చింది. యజమానికి రుజువులను సమర్పించ లేకపోయినా, పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయాలి. ITR ఫైల్ చేస్తున్నప్పుడు డిడక్షన్స్‌ క్లెయిమ్ చేయకుంటే, డిపార్ట్‌మెంట్ అనుమతించదు.

మినహాయింపు పొందిన ఆదాయం రిపోర్ట్‌ చేయాలి
పన్నుల నుంచి మినహాయించిన ఆదాయాన్ని నివేదించకుండా చాలా మంది తప్పు చేస్తారు. డివిడెండ్‌లు, PPF వడ్డీ, దీర్ఘకాలిక మూలధన లాభాలు వంటి పన్నుల నుంచి మినహాయించబడిన ఆదాయాన్ని నివేదించడం మంచిది. ITR ప్రాసెసింగ్‌లో సంక్లిష్టతలను నివారించడానికి అటువంటి ఆదాయాలను పేర్కొనాలి.



చివరి నిమిషం వరకు ఆగకూడదు
ITR ఫైల్ చేసే చివరి తేదీకి కొన్ని రోజుల ముందు పన్ను రిటర్న్‌లపై పని చేయడం ప్రారంభించకూడదు. తక్కువ సమయం ఉండటంతో తప్పులు చేసే అవకాశం ఉంది. లేదా వాయిదా వేయడం ద్వారా ముఖ్యమైన వాటిని పేర్కొనడం మర్చిపోవచ్చు, ఉదాహరణకు పన్ను క్రెడిట్‌లు.

గత సంవత్సరం సంఖ్యను ఉపయోగించవద్దు
అనేక సార్లు పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం, అసెస్‌మెంట్ ఇయర్ మధ్య గందరగోళానికి గురవుతారు. ఒక ఆర్థిక సంవత్సరం వివరాలను మరొక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్‌కు నమోదు చేస్తారు. ఇది అనేక సమస్యలు దారితీయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Investment Plans, ITR Filing, PPF, Tds

తదుపరి వార్తలు