హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax Returns: ఐటీ రిటర్న్స్ చేస్తున్నారా ..? ఈ జాగ్రతలు పాటిస్తే చాలు.. తప్పుల నుంచి బయటపడొచ్చు..!

Income Tax Returns: ఐటీ రిటర్న్స్ చేస్తున్నారా ..? ఈ జాగ్రతలు పాటిస్తే చాలు.. తప్పుల నుంచి బయటపడొచ్చు..!

ఐటీ రిటన్స్ చేస్తున్నారా ..! ఈ జాగ్రతలు పాటిస్తే చాలు.. తప్పుల నుంచి బయటపడొచ్చు..?

ఐటీ రిటన్స్ చేస్తున్నారా ..! ఈ జాగ్రతలు పాటిస్తే చాలు.. తప్పుల నుంచి బయటపడొచ్చు..?

ఐటీ రిటర్న్స్(It Returns') ముందుగానే దాఖలు చేసుకుంటే చాలా మంచిది. లేదంటే లేట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ముందస్తుగానే దాఖలు చేస్తే తప్పులు (Mistakes) దొర్లే అవకాశాలు తగ్గుతాయి.

2021-22 ఆర్థిక సంవత్సరం(Financial), 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను (Income Tax) రిటర్న్‌లను దాఖలు చేయాల్సిన గడువు తేదీ ఆసన్నమవుతోంది. డబ్బు సంపాదించే ఇండివిడ్యువల్స్‌ (Employees), వేతన జీవులందరికీ ఐటీ ఫైలింగ్‌కు చివరి తేదీ (Late Date) జూలై 31గా ఐటీ శాఖ నిర్ణయించింది. అంటే ఇంకా కొద్ది రోజుల సమయమే మిగిలి ఉన్నందున చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా ఐటీ రిటర్న్స్ ముందుగానే దాఖలు చేసుకుంటే చాలా మంచిది. లేదంటే లేట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే ముందస్తుగానే దాఖలు చేస్తే తప్పులు (Mistakes) దొర్లే అవకాశాలు తగ్గుతాయి. ట్యాక్స్ రీఫండ్‌ల ప్రాసెసింగ్‌ వేగవంతమవుతుంది. అలానే, ట్యాక్స్ అసెస్‌మెంట్ డాక్యుమెంట్స్ అడ్రస్ ప్రూఫ్‌గా కూడా పనిచేస్తాయి. ఇంకా ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయని వారు అన్ని ఆదాయాలు, పెట్టుబడి సంబంధిత డాక్యుమెంట్స్‌ సిద్ధం చేసుకోవడం మంచిది. అయితే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ సమయంలో చాలామంది కొన్ని తప్పులు (Common Mistakes) చేస్తుంటారు. ఆ తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐటీ రిటర్నులు దాఖలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు

ట్యాక్స్ పేయర్లు పన్ను శ్లాబ్‌లలో ఉన్న మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి. అలాగే, రిటర్న్‌లను ఫైల్ చేయడానికి ముందు కొత్త లేదా పాత విధానాల్లో ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. కొత్త విధానం తక్కువ స్లాబ్ రేటు (Lower Slab Rate)తో ట్యాక్స్‌ను లెక్కిస్తుంది. కొత్త విధానం సెలెక్ట్ చేసుకుంటే పాత పాలనలో అందుబాటులో ఉన్న వివిధ తగ్గింపులు, మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఏది మీకు బాగా సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోవాలి.

ఇదీ చదవండి:  Russia-Ukraine War: యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నా రష్యా గెలవలేకపోతోంది ఎందుకు..? ఇవిగో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?


ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్‌ ఫైల్ చేసేటప్పుడు చేసే తప్పులు

1. ట్యాక్స్ పేయర్లు తమకు ఉన్న అన్ని ఆదాయ వనరులను రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది కొన్ని ఇన్‌కమ్ సోర్సస్ నివేదించడం మర్చిపోతుంటారు. ఇలాంటి తప్పు చేస్తే భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల అన్ని ఆదాయ వనరులు పేర్కొన్నారో లేదో ఒకట్రెండు సార్లు చెక్ చేసుకోవాలి.

2. ఐటీఆర్ ఫైల్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫారం 16, ఫారం 26AS వంటి వాటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఫారం 16 అనేది ఏడాదిలో మీరు సంపాదించిన జీతంతో పాటు డెడక్ట్ చేసిన TDS వివరాలతో మీ యజమాని జారీ చేసే ఒక సర్టిఫికేట్. ఫారం 26AS అనేది మీరు డెడక్ట్ చేసే ట్యాక్స్‌లు, ఆర్థిక సంవత్సరంలో మీరు చెల్లించిన పన్నుల స్టేట్‌మెంట్.

3. వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఐటీ రిటర్న్‌లను ఫైల్ చేస్తున్నప్పుడు ఫారం 16, 26AS రెండింటిలోనూ పన్ను మినహాయింపులను (ట్యాక్స్ డెడక్టెడ్) సరిపోల్చాలి. అప్పుడు ఫారం 16, ఫారం 26ASలో TDS మొత్తం ఒకేలా లేనట్లు గుర్తిస్తే, యజమానిని సంప్రదించి దాన్ని సరిదిద్దుకోవడం మంచిది. లేకపోతే, సరైన వివరాలతో సవరించిన TDS రిటర్న్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది.

4. కొందరు పన్ను చెల్లింపుదారులు యజమానికి తమ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ (Tax Saving Investment)ని లేదా అద్దె రుజువును ప్రకటించడం మరచిపోతుంటారు. అయితే ట్యాక్స్ అమౌంట్ డిడక్ట్ అయ్యాక ఈ విషయాన్ని గుర్తిస్తారు. ఇలాంటి పరిస్థితి మీకూ ఎదురైతే, మీరు అన్ని వ్యాలీడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ద్వారా పాత పన్ను విధానంలో వాపసులను క్లెయిమ్ చేయవచ్చు.

5. ఐటీఆర్‌ని వెరిఫై చేసే వరకు ప్రాసెస్ పూర్తి అవ్వదు కాబట్టి, మీ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు ఫైల్ చేసిన తర్వాత రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయడం మర్చిపోకూడదు. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా పోస్ట్ ద్వారా సరిగ్గా సంతకం చేసిన ITR-V మెయిల్ ద్వారా చేయవచ్చు.

First published:

Tags: Income tax, IT Rules, Mistakes, Tax free

ఉత్తమ కథలు