హోమ్ /వార్తలు /బిజినెస్ /

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌ ఎన్ని రకాలు..? వీటిలో రిస్క్, రాబడి ఎలా ఉంటాయి..? తెలుసుకోండి..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌ ఎన్ని రకాలు..? వీటిలో రిస్క్, రాబడి ఎలా ఉంటాయి..? తెలుసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Mutual Funds: మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ ప్రధానంగా ఐదు రకాలుగా ఉన్నాయి. వీటి ప్రయోజనాలు, రాబడి, రిస్క్‌, లాక్‌ ఇన్‌ పీరియడ్‌ వంటి వివరాలు మీకోసం..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం చాలామంది సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ (Invest) చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నా.. ఎక్కువ మంది మ్యూచువల్‌ ఫండ్స్‌ (Mutual Funds)లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తం, సమయం, లక్ష్యం ఆధారంగా స్కీమ్స్‌ ఎంచుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ ప్రధానంగా ఐదు రకాలుగా ఉన్నాయి. వీటి ప్రయోజనాలు, రాబడి, రిస్క్‌, లాక్‌ ఇన్‌ పీరియడ్‌ వంటి వివరాలు మీకోసం..

* డెట్ స్కీమ్స్‌

డెట్ ఫండ్ అనేది కార్పొరేట్, గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ డెట్ సెక్యూరిటీస్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ వంటి ఫిక్స్‌డ్‌ ఇన్‌కం అందించే వాటిల్లో పెట్టుబడి పెడుతుంది. డెట్ ఫండ్స్‌ను ఇన్‌కమ్ ఫండ్స్ లేదా బాండ్ ఫండ్స్ అని కూడా అంటారు. డెట్ స్కీమ్స్‌ షార్ట్‌ టర్మ్‌ ప్లాన్స్‌, లాంగ్‌ టర్మ్‌ ప్లాన్స్‌, బాండ్స్‌, మంత్లీ ఇన్‌కం ప్లాన్స్‌, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లు (FMPలు), గిల్ట్ ఫండ్స్‌, లిక్విడ్ ఫండ్స్‌ వంటి వివిధ ఫిక్స్‌డ్‌ ఇన్‌కం ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెడతాయి.

* ఈక్విటీ స్కీమ్స్‌

ఈక్విటీ ఫండ్స్ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్. రిస్క్‌ను అదుపులో ఉంచుకుంటూ పెట్టుబడుల నుంచి గరిష్ట రాబడిని అందించడానికి ప్రయత్నించే నిపుణుల బృందం స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంది. ఈక్విటీ ఫండ్స్‌ విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను అందిస్తాయి.

చాలా ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో 40-50 స్టాక్స్ ఉంటాయి. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. ఈక్విటీ ఫండ్స షార్ట్‌ టర్మ్‌లో కొన్ని హెచ్చు తగ్గులను ఎదుర్కోవచ్చు. లాంగ్‌ టర్మ్‌లో లాభాలను అందిస్తాయి. ఈక్విటీ స్కీమ్స్‌ కేటగిరీ కింద లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి.

* హైబ్రిడ్ స్కీమ్స్‌

హైబ్రిడ్ స్కీమ్ ఫండ్స్ పెట్టుబడి లక్ష్యాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ అసెట్ క్లాస్‌లు.. ఈక్విటీ, డెట్, ఇతర అసెట్ క్లాస్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్క్‌ను తగ్గించే లక్ష్యంతో పోర్ట్‌ఫోలియోను డైవెర్సిఫై చేయడానికి ఈ ఫండ్స్ వివిధ అసెట్ క్లాస్‌లలో పెట్టుబడి పెడతాయి. హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కంటే తక్కువ రిస్క్, డెట్ ఫండ్స్ కంటే సాపేక్షంగా మెరుగైన రాబడిని అందిస్తాయి.

SEBI హైబ్రిడ్ ఫండ్స్‌ను 7 ఉప వర్గాలుగా వర్గీకరించింది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ ఫండ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, డైనమిక్ అసెట్ అలోకేషన్ లేదా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్, ఆర్బిట్రేజ్ ఫండ్, ఈక్విటీ సేవింగ్స్ .. వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

* ఇండెక్స్ ఫండ్స్‌, ఈటీఎఫ్‌, ఫండ్ ఆఫ్ ఫండ్స్

ఇండెక్స్ ఫండ్స్.. మార్కెట్ ఇండెక్స్‌ను ప్రతిబింబించే పోర్ట్‌ఫోలియోను సృష్టిస్తాయి. పోర్ట్‌ఫోలియోలో చేర్చిన సెక్యూరిటీలు, వాటి వెయిట్స్‌ ఇండెక్స్‌లో ఉన్నట్లే ఉంటాయి. ఫండ్ మేనేజర్ మార్కెట్ లేదా సెక్టార్‌పై వారి వీక్షణ ఆధారంగా పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయరు. ఫండ్ మేనేజర్ ఇండెక్స్‌కు అనుగుణంగా ఫండ్‌ను ఉంచడానికి చిన్న, కాలానుగుణ సర్దుబాట్లు మాత్రమే చేస్తారు. ఇండెక్స్ ఫండ్ వసూలు చేయగల రుసుము 1.5%కి పరిమితం చేశారు.

ఇది కూడా చదవండి : రాయల్‌ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 రివ్యూ.. బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్, స్పెసిఫికేషన్స్ మీకోసం..

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF) అనేది మ్యూచువల్ ఫండ్ లాగా పనిచేసే ఒక రకమైన పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌ సెక్యూరిటీ. సాధారణంగా ETFలు ఒక నిర్దిష్ట ఇండెక్స్, సెక్టార్, ఇతర అసెట్స్‌ను ట్రాక్ చేస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్‌ల మాదిరిగా కాకుండా, ETFలను ఒక సాధారణ స్టాక్ తరహాలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.

ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF) అనేవి.. అదే మ్యూచువల్ ఫండ్ లేదా ఇతర మ్యూచువల్ ఫండ్స్‌కి చెందిన ఇతర స్కీమ్స్‌ యూనిట్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌. ఈ స్కీమ్స్‌ పెట్టుబడిదారుడికి మల్టిపుల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను విస్తరించడం ద్వారా రిస్క్‌ని డైవెర్సిఫై చేసే అవకాశాన్ని అందిస్తాయి.

* సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్- రిటైర్మెంట్‌, చిల్డ్రెన్‌

సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్ అనేవి రిటైర్మెంట్ ప్లానింగ్, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ వంటి నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి పోర్ట్‌ఫోలియోని డిజైన్ చేసే మ్యూచువల్ ఫండ్స్. రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ మ్యూచువల్ ఫండ్స్‌ పెట్టుబడి పెట్టడానికి క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలను అందిస్తాయి.

ఇందులో పెట్టుబడిదారుల రిస్క్ ప్రకారం.. ఈక్విటీ లేదా డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లను సెలక్ట్‌ చేసుకోవచ్చు. ఇవి ఐదు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో వస్తాయి. చిల్డ్రెన్‌ మ్యూచువల్ ఫండ్స్‌ కూడా ఐదేళ్ల లాక్‌ ఇన్‌ వ్యవధితో వస్తాయి. ఈ స్కీమ్‌ల ద్వారా వచ్చే రిటర్న్‌లు పిల్లల ఉన్నత విద్య ఖర్చులు, వివాహ ఖర్చులు లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.

First published:

Tags: Investments, Mutual Funds, Personal Finance

ఉత్తమ కథలు