• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • ARE YOU CLAIMING THESE COSTS IN A HEALTH INSURANCE POLICY OTHERWISE YOU WILL LOSE YOURSELF MK GH

Health insurance policy: ఆరోగ్య బీమా పాలసీలో ఈ ఖర్చులు క్లెయిం చేసుకుంటున్నారా.. లేకపోతే మీరే నష్టపోతారు..

(ప్రతీకాత్మక చిత్రం)

కోవిడ్ రోగులైతే 14 రోజుల క్వారంటైన్ కాలంతో పాటు మెడికల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో రెగ్యులర్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ మీ ఆసుపత్రికయ్యే ఖర్చులను భరిస్తుంది. అయితే రోగి ఆసుపత్రిలో జాయిన్ అవ్వడానికి కంటే ముందు, డిశ్చార్జి తర్వాత కూడా బీమాను క్లెయిమ్ చేయొచ్చనే సంగతి మీకు తెలుసా?

  • Share this:
కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా రోజుకు లక్షకు పైగా కేసులు రావడంతో పరిస్థితి ఆందోళకరంగా మారింది. ముఖ్యంగా ముంబయి లాంటి నగారాల్లో మొదటి వేవ్ కంటే తీవ్రంగా కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో నిండుతున్నాయి. ఫలితంగా చాలా మంది రోగనిర్ధారణ పరీక్షల కోసం బిల్లులు భరిస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కోవిడ్ కాకుండా ఇతర పెద్ద రోగాల బారిన పడిన వారు కూడా ఆసుపత్రుల్లో చేరి జేబు ఖాళీ చేసుకుంటున్నారు. కోవిడ్ రోగులైతే 14 రోజుల క్వారంటైన్ కాలంతో పాటు మెడికల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో రెగ్యులర్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ మీ ఆసుపత్రికయ్యే ఖర్చులను భరిస్తుంది. అయితే రోగి ఆసుపత్రిలో జాయిన్ అవ్వడానికి కంటే ముందు, డిశ్చార్జి తర్వాత కూడా బీమాను క్లెయిమ్ చేయొచ్చనే సంగతి మీకు తెలుసా?అయితే ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. దీనిలో అన్ని ఖర్చులు క్లెయిమ్ చేసుకోలేరు. కొన్ని క్యాష్ లెస్(నగదు రహితంగా) రూపంలో ఉండకపోవచ్చు.

RT-PCR ఖర్చులకు ఆరోగ్య బీమా పాలసీ వర్తిస్తుందా?
ఈ ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. ఎందకుంటే ఆరోగ్య బీమా పాలసీ అనేది ఆసుపత్రి పాలవ్వడంతో పాటు రోగనిర్ధారణ పరీక్షలతోనూ లింక్ అయి ఉంటుంది. RT-PCR లాంటి వైద్య పరీక్షలు, పరిశోధనలతో సహా అనుమతించదగిన ఆసుపత్రుల్లో చేరే, డిశ్చార్చి సమయంలోని ఖర్చులన్నీ ఇందులో భాగంగా ఉంటాయి అని బీమా కొనుగోలు దారుల ప్లాట్ ఫాం బేషక్. ఆర్గ్ ఛైర్మన్ మహావీర్ చోప్రా చెప్పారు. మన శరీరంలోని కరోనా వైరస్ జాడలను గుర్తించడానికి RT-PCR పరీక్ష చేస్తారు. దీని ధర రూ.1200.

కోవిడ్ చికిత్స కోసం మీరు ఆసుపత్రిలో చేరాల్సి వస్తే RT-PCR పరీక్షలకయ్యే ఖర్చులు, రక్త పరీక్షలు, సీటీ స్కాన్ ఖర్చులు ఆసుపత్రి చేరడానికి ముందు 30 రోజుల్లో అయిన ఖర్చులు పాలసీలో ఉంటాయి. ఈ ఖర్చులను బీమా భరిస్తుంది. అయితే ఇక్కడ ఓ షరతు ఉంది. ఇవన్నీ ఆసుపత్రిలైజేషన్ కు లింక్ చేసి ఉండాలి. ఆసుపత్రిలో చేరడానికంటే ముందే RT-PCR పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వస్తే ఆ పరీక్షలకయ్యే ఖర్చును బీమా భరిస్తుందని బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సురెన్స్ హెల్త్ క్లెయిమ్స్ అధినేత భాస్కర్ నెరుర్కర్ చెప్పారు. పరీక్షా ఫలితాలు ప్రతికూలంగా వస్తే మీ బీమా పాలసీలో ఓపీడీ ఛార్జీలను మాత్రమే రీయంబర్స్ చేస్తుంది.

డిశ్చార్జి తర్వాత కూడా బీమా పాలసీ వర్తిస్తుందా?
బీమా పాలసీలు చాలా వరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కూడా ఖర్చులు భరిస్తాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 60 రోజుల వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఇందుకు వైద్యుల సలహాలు, పరీక్షల వివరాలు ధ్రువీకరించాలని భాస్కర్ నేరుర్కర్ అన్నారు. మీ ఆరోగ్యం పెంపొందించుకోవడానికి మీరు ఇంట్లో సహాయం తీసుకుంటే అది కూడా పాలసీలో కవర్ చేయబడుతుంది. వెన్నెముక శస్త్రచికిత్స విషయంలో ఫిజియోథెరపీ సెషన్లు కూడా ఇందులో ఉంటాయి. ఇది మీ బీమా పరిమితిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రీమియం ఉత్పత్తులు కవరేజీని 90 రోజుల వరకు పొడిగిస్తాయి. కరోనా కవచ్ పాలసీలయితే 30 రోజుల కవరేజీని అందిస్తాయి.

క్లెయిమ్ చేసుకోవడానికి ఏయే పత్రాలు సమర్పించాలి?
మెడికల్ టెస్టుల రసీదులు, ఆసుపత్రిలో చేరడానికి కంటే ముందు మీ వద్ద ఉన్న కీలక పత్రాలు, రశీదులు, బిల్లులు అన్నింటిని భద్రపరచుకోవాలి. డయాగ్నస్టిక్స్ సెంటర్ల నుంచి మీకు మెయిల్ చేయమని, దాచుకోవాలి. యాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యముంటే మరీ మంచిది. ఇలాంటి ఒత్తిడి సమయాల్లో పత్రాలను భౌతికంగా సమర్పించుకోవడం కంటే డిజిటల్ యాక్సెస్ చేయడం సులభతరంగా ఉంటుంది.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జి సమ్మరీ కీలకమైన పత్రం. ఎందుకంటే ఇందులో మందులు, ఫాలో అప్స్ వివరాలు ఉంటాయి. దీన్ని రీయంబర్స్ మెంట్ క్లెయిమ్ గా దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ముందు మీరు చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అనంతరం బీమా సంస్థ ఆ ఖర్చులను తిరిగి చెల్లిస్తుందని గుర్తుంచుకోండి. ఇది రెగ్యులర్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ కు అదనంగా ఉంటుంది. 60 నుంచి 90 రోజుల వ్యవధిలో ఫాలో అప్ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని విడిగా దాఖలు చేయవచ్చు. ఇది మీ హాస్పిటలైజేషన్ బిల్లు వలే కాకుండా నగదు రహిత క్లెయిమ్ గా పరిష్కరించబడదు. అయితే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి పత్రాలన్నింటినీ సమర్పించాలి. బీమా సంస్థలు ఈ క్లెయిమ్ పరిష్కరించడానికి 7 నుంచి 15 రోజుల సమయాన్ని తీసుకుంటాయి.
Published by:Krishna Adithya
First published: