ఈ రోజుల్లో కారును కొనుగోలు చేయడంతోపాటు మంచి వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ (Vehicle Insurance plan) కూడా తీసుకోవడం అవసరం. అనుకోని ప్రమాదాల నుంచి పాలసీలు రక్షణ కల్పిస్తాయి. ఏదైనా ప్రమాదంలో కారు బాగా దెబ్బతింటే, కార్ ఇన్సూరెన్స్ రక్షిస్తుంది. ఆర్థికంగా ఆదుకుంటుంది. కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో (Comprehensive Car Insurance Policy) వాహనం దొంగతనం, మానవ నిర్మిత, ప్రకృతి వైపరీత్యాలకు కవరేజీ లభిస్తుంది. అదే సమయంలో థర్డ్ పార్టీ కవర్ను కూడా అందిస్తుంది. అయితే కారుకు ఏ చిన్న ప్రమాదం జరిగినా క్లెయిమ్ చేయవచ్చా? దీని వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వాహన యజమాని సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనే కఠినమైన నియమం ఏదీ లేదు. అయినా ప్రతి సందర్భంలోనూ ఇన్సూరెన్స్ కంపెనీ వద్దకు పరుగెత్తడం, కవరేజీ కోసం అడగడం అవసరం లేదు. తరచుగా క్లెయిమ్లు చేయడం వల్ల నో క్లెయిమ్ బోనస్ తగ్గింపును తీసివేయడం మాత్రమే కాదు, జేబు ఖర్చులు పెరగడానికి కూడా అవకాశం ఉంది.
Gold Buying Tips: ధంతేరాస్ రోజు నగలు కొనడానికి టిప్స్... ఇలా చేస్తే మోసపోరు
నో క్లెయిమ్ బోనస్ అనేది 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. వరుసగా ఐదు సంవత్సరాలు ఎటువంటి క్లెయిమ్లు చేయని పాలసీదారుకు ఈ ఆఫర్ దక్కుతుంది. ఫ్రీ ఇయర్లో మొదటి క్లెయిమ్ 20 శాతం డిస్కౌంట్ నుంచి ప్రారంభమవుతుంది. చిన్న క్లెయిమ్లు చేయడం ద్వారా నో క్లెయిమ్ బోనస్ సున్నాకి చేరుకుంటుంది. దీంతో ప్రీమియంపై డిస్కౌంట్ పొందలేరు. అందుకే రిపేర్ ఖర్చు కంటే నో క్లెయిమ్ బోనస్ ఎక్కువగా ఉంటే, జేబు నుంచి డబ్బు చెల్లించడం మేలు. ఇలాంటి సందర్భాల్లో క్లెయిమ్ చేస్తే.. నో క్లెయిమ్ బోనస్ దెబ్బతింటుంది.
థర్డ్ పార్టీ కారణంగా కార్ పాడైపోవచ్చు. మరొక డ్రైవర్ పొరపాటు కారణంగా కార్ దెబ్బతినవచ్చు. ఈ సమయంలో థర్డ్ పార్టీ నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరిస్తే, సొంత పాలసీపై క్లెయిమ్ చేయకపోవడం ఉత్తమం.
Health Insurance: శుభవార్త... మరిన్ని ఆధునిక చికిత్సలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ
కార్ ఇన్సూరెన్స్ వాలంటరీ, కంపల్సరీ అనే రెండు రకాల డిస్కౌంట్లతో వస్తుంది. క్లెయిమ్ సమయంలో మీరు కంపల్సరీ డిడక్టబుల్ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. IRDA ప్రకారం.. 1500cc మించని కార్లకు, కంపల్సరీ డిడక్టబుల్ రూ.1,500, 1500cc కంటే ఎక్కువ ఉన్న కార్లకు రూ. 2,000 ఉంటుంది. అదే విధంగా వాలంటరీ డిడక్టబుల్ అనేది క్లెయిమ్ సమయంలో మీరు చెల్లించడానికి ఎంచుకున్న మొత్తం. ఇది మీ ప్రీమియంపై కూడా ప్రభావం చూపుతుంది. వాలంటరీ డిడక్టబుల్ మొత్తం ఎంత ఎక్కువగా ఉంటే, ప్రీమియం అంత తగ్గుతుంది. ఒకవేళ క్లెయిమ్ మొత్తం డిడక్టబుల్ అమౌంట్ కంటే తక్కువగా ఉంటే క్లెయిమ్ చేయడంలో అర్థం లేదు.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కార్కు చిన్న చిన్న డెంట్లు, గీతలు పడటం, అద్దాలు పగలడం వంటివి జరుగుతాయి. అటువంటి చిన్న మరమ్మతుల కోసం క్లెయిమ్ చేయడం వల్ల క్లెయిమ్ హిస్టరీ ప్రభావితమవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ప్రమాదకర డ్రైవర్గా పరిగణించవచ్చు. దీంతో పాలసీ రెన్యూవల్ చేసుకొనే సమయంలో ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. కార్ ఇన్సూరెన్స్ ఆర్థిక భద్రత కోసం అయినా.. కొన్ని సందర్భాల్లో క్లెయిమ్ చేయకపోవడమే మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Cars, Insurance, Personal Finance