Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు

Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు (ప్రతీకాత్మక చిత్రం)

Train Ticket Cancellation | మీరు ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? మరి ఇండియన్ రైల్వేస్ టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీల (Ticket Cancellation Charges) గురించి అవగాహన ఉందా? టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకోండి.

  • Share this:
    ఎక్కడికైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నప్పుడు రిజర్వేషన్ లభిస్తుందో లేదోనని ముందుగానే ట్రైన్ టికెట్స్ బుక్ (Train Ticket Booking) చేయడం రైల్వే ప్రయాణికులకు అలవాటు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, పండుగ సీజన్లలో రైలు టికెట్లు దొరకడం చాలా కష్టం. అందుకే చాలా అడ్వాన్స్‌డ్‌గా రిజర్వేషన్ చేస్తుంటారు. ఆ తర్వాత ప్రయాణంలో ఏవైనా మార్పులు ఉంటే ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తారు. అయితే రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు (Train Ticket Cancellation Charges) ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్యాన్సలేషన్ ఛార్జీల గురించి అవగాహన లేక ప్రయాణికులు భారీగా నష్టపోతుంటారు. ట్రైన్ టికెట్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత ఛార్జీ చెల్లించాలో అవగాహన ఉండదు. భారతీయ రైల్వే (Indian Railways), ఐఆర్‌సీటీసీ (IRCTC) క్యాన్సలేషన్ పాలసీ, రీఫండ్ ప్రాసెస్ లాంటి వివరాలను తమ వెబ్‌సైట్స్‌లో వెల్లడించాయి.

    IRCTC Ticket Booking: రైలు ప్రయాణికులకు అలర్ట్... టికెట్ బుక్ చేయాలంటే ఈ వివరాలు ఇవ్వాల్సిందే

    రైలు టికెట్ క్యాన్సలేషన్ ఛార్జీలు ఎంత?


    ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత రీఫండ్ వస్తుందన్న విషయం రైలు టికెట్ క్యాన్సిల్ చేసే సమయంపై ఆధారపడి ఉంటుంది. అంటే రైలు బయల్దేరడానికి ఎంత ముందుగా టికెట్ క్యాన్సిల్ చేస్తే అంత ఎక్కువ రీఫండ్ వస్తుంది. షెడ్యూల్ ప్రకారం రైలు బయల్దేరడానికి 30 నిమిషాల్లో ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఏమీ రాదు.

    రైలు బయల్దేరడానికి రైలు బయల్దేరడానికి 12 గంటల నుంచి 48 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 25 శాతం లేదా రూ.60 వీటిలో ఏది ఎక్కువ అయితే అది ఛార్జీగా చెల్లించాలి. రైలు బయల్దేరడానికి 12 గంటల నుంచి 4 గంటల మధ్య లేదా ఛార్ట్ ప్రిపేర్ చేసే సమయం లోపల టికెట్ క్యాన్సిల్ చేస్తే టికెట్ ధరలో 50 శాతం ఛార్జీలు చెల్లించాలి.

    New Rules in September: సెప్టెంబర్‌లో గుర్తుంచుకోవాల్సిన 7 కొత్త రూల్స్ ఇవే

    రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. సెకండ్ క్లాస్ టికెట్‌కు రూ.60, సెకండ్ స్లీపర్ క్లాస్‌కు రూ.120, ఏసీ త్రీ టైర్ టికెట్‌కు రూ.180, టూ టైర్ టికెట్‌కు రూ.200, ఫస్ట్ ఏసీ ఎగ్జిక్యూటీవ్ క్లాస్ టికెట్‌కు రూ.240 క్యాన్సలేషన్ ఛార్జీగా చెల్లించాలి.

    తత్కాల్ టికెట్లకు రీఫండ్ వస్తుందా?


    తత్కాల్ కేటగిరీలో బుక్ చేసిన కన్ఫామ్డ్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ రాదు. మరి రైళ్లు రద్దైతే ఈ ఛార్జీలు వర్తిస్తాయా అన్న అనుమానాలు ప్రయాణికుల్లో ఉండటం సహజం. వరదలు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు లాంటి కారణాలతో రైళ్లు రద్దవుతుంటాయి. రైళ్లు రద్దైతే ఆ రైళ్లల్లో అప్పటికే టికెట్లు బుక్ చేసి ప్రయాణికులకు ఫుల్ రీఫండ్ వస్తుంది. ఈ రీఫండ్ మూడు రోజుల్లో క్రెడిట్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: