హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold: ఇంపోర్ట్‌ డ్యూటీని తప్పించుకోవడానికి దుబాయ్‌లో బంగారం కొంటున్నారా? అయితే మరోసారి ఆలోచిస్తే బెటర్‌..

Gold: ఇంపోర్ట్‌ డ్యూటీని తప్పించుకోవడానికి దుబాయ్‌లో బంగారం కొంటున్నారా? అయితే మరోసారి ఆలోచిస్తే బెటర్‌..

Gold

Gold

Gold: చాలా మంది ఇండియా కంటే దుబాయ్‌ లో బంగారం రేట్లు తక్కువని భావిస్తారు. అక్కడి కొనుగోలు చేసి ఇండియాకు తీసుకు రావడం మేలనే యోచనలోనూ ఉంటారు. వాస్తవానికి అక్కడి బంగారం ప్రైస్‌ ట్యాగ్‌లపై కనిపించే రేటును చూస్తే ఇండియా కంటే తక్కువ ధరే ఉంటుంది. కానీ,

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియాలో పండుగల సీజన్‌ (Festival Season )మొదలైంది. దసరా, ధన త్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. చాలా మంది ఇండియా కంటే దుబాయ్‌ (Dubai) లో బంగారం (Gold) రేట్లు తక్కువని భావిస్తారు. అక్కడి కొనుగోలు చేసి ఇండియాకు తీసుకు రావడం మేలనే యోచనలోనూ ఉంటారు. వాస్తవానికి అక్కడి బంగారం ప్రైస్‌ ట్యాగ్‌లపై కనిపించే రేటును చూస్తే ఇండియా కంటే తక్కువ ధరే ఉంటుంది. కానీ అక్కడ కొని ఇండియాకు తీసుకొచ్చే ముందు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఎమిరేట్‌లో బంగారాన్ని కొనుగోలు చేసి తిరిగి భారతదేశానికి తీసుకురావడం గురించి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

* బంగారంపై ఇంపోర్ట్‌ డ్యూటీ పెంపు

సెప్టెంబర్ 19న దుబాయ్ మార్కెట్‌లో 1 గ్రాము 22K బంగారం ధర రూ.4,252గా ఉంది. అదే సమయంలో గ్రాము 22k బంగారం ధర ఇండియన్‌ మార్కెట్‌(ముంబై)లో రూ.4,656గా ఉంది. 2022 జులైకు ముందు బంగారంపై ఇంపోర్ట్‌ డ్యూటీ 10.75 శాతంగా ఉంది. దీన్ని భారత ప్రభుత్వం 15 శాతానికి (3% సెస్ మినహాయింపు) పెంచడం వల్ల ధరల్లో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంది.

బంగారం ఇంపోర్ట్స్‌ విపరీతంగా పెరుగుతుండటంతో రూపాయి విలువ పడిపోయింది. మే ఇంపోర్ట్స్‌ 790 శాతం పెరిగాయి. ఏడాది క్రితం 670 మిలియన్ల డాలర్లగా ఉన్న ఇంపోర్ట్స్‌ 6 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఇంపోర్ట్‌ డ్యూటీని పెంచాల్సి వచ్చింది.

* దుబాయ్‌లో మేకింగ్‌ ఛార్జీలు ఎక్కువ

ఈ పండుగ సీజన్‌లో, భారతదేశంలోని నగల వ్యాపారులకు దుబాయ్ నుంచి గట్టి పోటీ ఉంటుంది. ఇంపోర్ట్‌ డ్యూటీ దుబాయ్‌లో కొనుగోలుదారులకు గణనీయమైన కాస్ట్‌ అడ్వాంటేజ్‌ అందిస్తుంది. కానీ దుబాయ్‌లో బంగారాన్ని కొనుగోలు చేయడం సరైన ఆలోచన కాదు. ఎందుకంటే దుబాయ్‌ నుంచి భారత్‌లోకి బంగారాన్ని తీసుకువస్తే డ్యూటీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు దుబాయ్‌లో మేకింగ్ ఛార్జీలు కూడా ఎక్కువ.

* ఇండియాలో కొనుగోలు చేయడమే ఎందుకు మేలు?

దుబాయ్‌లో బంగారం చౌకగా ఉంటుందని, దాని స్వచ్ఛత ఎక్కువగా ఉంటుందని ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం. స్వచ్ఛత సమస్యలను పరిష్కరించే హాల్‌మార్కింగ్ నిబంధనలు భారతదేశంలో బంగారంపై మరింత విశ్వాసాన్ని తీసుకువచ్చాయి. భారతదేశంలోని 282 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి.

* ఇతర రూల్స్

కస్టమ్స్ నిబంధనల ప్రకారం దుబాయ్‌ నుంచి పురుషులు రూ.50,000కు మించకుండా, 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. మహిళా ప్రయాణికులు రెట్టింపు మొత్తాన్ని తీసుకొచ్చేందుకు అనుమతి ఉంది. అయితే అక్కడ కొనుగోలు చేసిన ఆభరణాలను భారతదేశంలోకి తీసుకురావాలంటే కనీసం ఒక సంవత్సరం పాటు దుబాయ్‌లో నివసించాలి.

ఇది కూడా చదవండి : పడిపోతున్న స్టాక్ మార్కెట్లు.. కుదేలవుతున్న కరెన్సీ.. బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చా ?.. నిపుణులు ఏమంటున్నారు ?

ఒక సంవత్సరం వ్యవధి తర్వాత బ్యాగ్‌లలో 1 కిలో వరకు బంగారాన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. హాలిడే కోసం దుబాయ్ వెళ్లి ఆభరణాలు కొనుగోలు చేసి తిరిగి రాలేరు. పట్టుబడితే 36.05 శాతం కస్టమ్స్ డ్యూటీ, 15 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.

* నిజంగా సేవ్‌ చేస్తున్నారా?

దుబాయ్‌లో 5 శాతం వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ పాస్‌పోర్ట్ డిక్లరేషన్ తర్వాత పర్యాటకులకు రీఫండ్ చేస్తారు. భారతీయ వినియోగదారులు బంగారం విలువపై 3 GST, మేకింగ్ ఛార్జీలపై 5 శాతం GST నుండి తప్పించుకోలేరు. పర్యటనకు వెళ్లి బంగారు ఆభరణాలు తీసుకునే వారికి, కరెన్సీ మార్పిడి ఛార్జీలు కూడా వర్తిస్తాయి.

ఫారెక్స్ చెల్లింపు విధానం ఆధారంగా రూపాయిని దిర్హామ్‌లకు మార్చడానికి 2.8- 3.5 శాతం ఖర్చు అవుతుంది. అంతేకాక భారతదేశంలో మేకింగ్ ఛార్జీలు ఆభరణాల మొత్తం ధరలో 7 శాతం ఉంటుంది. దుబాయ్‌లో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అధిక మేకింగ్ ఛార్జీలు, కరెన్సీ మార్పిడి ఫీజు, అదనపు ఖర్చుల కారణంగా కస్టమర్లకు డబ్బు ఏమాత్రం ఆదా కాదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Dubai, Gold, Gold price, Personal Finance

ఉత్తమ కథలు