హోమ్ /వార్తలు /బిజినెస్ /

Paytm Loan: పేటీఎం నుంచి అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్

Paytm Loan: పేటీఎం నుంచి అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్

Paytm Loan: పేటీఎం నుంచి అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్
(ప్రతీకాత్మక చిత్రం)

Paytm Loan: పేటీఎం నుంచి అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్ (ప్రతీకాత్మక చిత్రం)

Paytm Instant Personal Loan | బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవాలంటే కనీసం నాలుగైదు రోజులైనా పడుతుంది. కానీ పేటీఎం తమ యూజర్లకు కేవలం రెండు నిమిషాల్లో రూ.2 లక్షల వరకు లోన్ ఇస్తోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

మీరు పేటీఎం యాప్ ఉపయోగిస్తున్నారా? అర్జెంట్‌గా అప్పు కావాలా? మీరు అప్పు కోసం అక్కడా, ఇక్కడా తిరగాల్సిన అవసరం లేదు. మీ పేటీఎం యాప్ ఓపెన్ చేసి వెంటనే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఎంత వేగంగా అంటే కేవలం 2 నిమిషాల్లో రూ.2,00,000 వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. యూజర్లకు ఇంత వేగంగా అప్పులు ఇచ్చేందుకు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సర్వీస్‌ను పేటీఎం లాంఛ్ చేసింది. 10 లక్షల మంది కస్టమర్లకు ఈ పర్సనల్ లోన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్థిక సేవలు అందించడంలో భారతదేశంలో పేటీఎం ముందు ఉందన్న సంగతి తెలిసిందే. ఏడాదిలో 365 రోజులు, రోజులో 24 గంటలు ఈ సేవలు లభిస్తాయి. పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా ఈ సర్వీస్ పొందొచ్చు. అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పేటీఎంలో లోన్‌కు అప్లై చేస్తే కేవలం 2 నిమిషాల్లో లోన్ మంజూరవుతుంది. కస్టమర్లు రూ.2,00,000 వరకు సులువుగా లోన్ తీసుకోవచ్చు.

Jio 28 days plans: జియో ప్లాన్ బెనిఫిట్స్ మారాయి... 28 రోజుల వేలిడిటితో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

SBI Home Loan 2021: ఎస్‌బీఐలో హోమ్ లోన్‌కు అప్లై చేస్తే అదిరిపోయే ఆఫర్

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా సేవలు అందిస్తోంది పేటీఎం. ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృత్తులు చేస్తున్నవారు పేటీఎం యాప్ ద్వారా ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాలను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు-NBFCs, బ్యాంకులు కస్టమర్లకు అందిస్తాయి. బ్యాంకులు అందుబాటులో లేని ప్రాంతాల్లోని కస్టమర్లు కూడా సులువుగా రుణాలు తీసుకోవచ్చు. మొత్తం లోన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. లోన్ దరఖాస్తు నుంచి రుణం మంజూరు చేయడం వరకు ఎక్కడా ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఈ ప్రాసెస్ మొత్తం కేవలం 2 నిమిషాల్లో పూర్తి కావడం మరో విశేషం. పేటీఎం ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ స్కీమ్ ద్వారా రూ.2,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. 18 నుంచి 36 నెలల మధ్య ఈఎంఐ ద్వారా రీపేమెంట్ చేయొచ్చు.

NPS Scheme: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? ఈ స్కీమ్ మీకోసమే

LIC New Jeevan Anand Plan: ఇన్స్యూరెన్స్ పాలసీపై ఎక్కువ లాభాలు కావాలా? ఈ ప్లాన్ మీకోసమే

పేటీఎంలో ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్‌లో Personal Loan ట్యాబ్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి. లోన్ అకౌంట్ వివరాలను కూడా ఇక్కడే చూసుకోవచ్చు. బీటా దశలో 400 మంది సెలెక్టెడ్ కస్టమర్లకు రుణాలు మంజూరు చేసింది పేటీఎం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 10 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది పేటీఎం.

First published:

Tags: Bank, Bank loans, Banking, Banks, Paytm, Personal Finance, Personal Loan

ఉత్తమ కథలు