కాస్త మంచి జీతం వస్తున్న వాళ్లుంటే చాలు... వారికి క్రెడిట్ కార్డులు (Credit Cards) ఇచ్చేందుకు బ్యాంకులు పోటీపడుతుంటాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నవారి సంఖ్య చాలా తక్కువ. తరచూ షాపింగ్ చేసేవారు లేదా ట్రావెలింగ్ చేసేవారు ఆఫర్ల కోసం క్రెడిట్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. బ్యాంకులు కూడా రివార్డ్స్, క్యాష్‌బ్యాక్స్, ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) బెనిఫిట్స్‌తో క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తుంటాయి. క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునేవారు ఈ ఆఫర్స్‌ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువగా క్రెడిట్ కార్డ్ ఎందుకోసం ఉపయోగిస్తారో అలాంటి ఆఫర్స్ వచ్చే కార్డులనే ఎంచుకోవాలి. మరి ప్రస్తుతం ఉన్న క్రెడిట్ కార్డుల్లో మంచి క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్న 5 క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోండి.
Amazon Pay ICICI Credit Card: అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో ప్రైమ్ మెంబర్స్ అమెజాన్‌లో షాపింగ్ చేసి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. నాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 3 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక అమెజాన్ పార్ట్‌నర్ మర్చంట్స్ దగ్గర ట్రాన్సాక్షన్స్ చేస్తే 2 శాతం, ఇతర ట్రాన్సాక్షన్స్‌కు 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్.
Cash Withdrawal: మరిణించినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేస్తే జైలుకే... రూల్స్ తెలుసుకోండి
Axis Bank Ace Credit Card: యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డుతో గూగుల్ పేలో రీఛార్జులు, బిల్ పేమెంట్స్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌లో షాపింగ్ చేస్తే 5 శాతం, స్విగ్గీ, జొమాటో, ఓలాలో ట్రాన్సాక్షన్స్‌కి 4 శాతం, ఇతర లావాదేవీలపై 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.499.
Flipkart Axis Bank Credit Card: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్, మింత్రా, 2GUD లో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎంపిక చేసిన వ్యాపారుల దగ్గర లావాదేవీలు జరిపితే 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర లావాదేవీలకు 1.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.500.
SBI: నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రూ.1,60,000 రిటర్న్స్... ఎస్‌బీఐలో పొందండి ఇలా
HSBC Cashback Credit Card: హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే 1.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర లావాదేవీలకు 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ లావాదేవీలపైనా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.750.
HDFC Millenia Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డుతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. PayZapp, SmartBuy లో ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వ్యాలెడ్ రీలోడ్, ఆఫ్‌లైన్ లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.1,000.
క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని మీ ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అప్పుల పాలవ్వాల్సి వస్తుంది. క్రెడిట్ కారులో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా వడ్డీ రేట్లు భారీగా ఉంటాయి. క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు 49 శాతం వరకు ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే క్రమశిక్షణతో వాడుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.