ARE YOU APPLYING FOR HOME LOAN KNOW WHICH BANK OFFERING LOWER INTEREST RATES SS
Home Loan: తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే
Home Loan: తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
Home Loan Interest Rates | గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత కాలంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. త్వరలో ఈ వడ్డీ రేట్లు (Interest Rates) పెరిగే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం తక్కువ వడ్డీకే గృహ రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఏవో తెలుసుకోండి.
మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలనుకుంటున్నారా? సొంతింటి కల నెరవేర్చుకోవడానికి గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? బ్యాంకులు తక్కువ వడ్డీకే గృహ రుణాలు (Home Loan) అందిస్తున్నాయి. త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెరిగితే హోమ్ లోన్ వడ్డీ రేట్లు (Home Loan Interest Rates) పెరుగుతాయి. కాబట్టి అంతలోపే హోమ్ లోన్‌కు దరఖాస్తు చేస్తే పాత వడ్డీ రేట్లే అమల్లో ఉంటాయి. మరి ఏ బ్యాంకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తుందో తెలుసుకోండి.
ప్రభుత్వానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.4 శాతం వడ్డీతో హోమ్ లోన్ ఆఫర్ చేస్తుంది. 20 ఏళ్లకు రూ.75 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే రూ.55,477 ఈఎంఐ చెల్లించాలి.
ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 శాతం వడ్డీతో గృహ రుణాలు ఇస్తున్నాయి. 20 ఏళ్లకు రూ.75 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే రూ.55,918 ఈఎంఐ చెల్లించాలి.
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.55 శాతం వడ్డీతో హోమ్ లోన్ ఆఫర్ చేస్తుంది. 20 ఏళ్లకు రూ.75 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే రూ.56,139 ఈఎంఐ చెల్లించాలి.
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.60 శాతం వడ్డీతో హోమ్ లోన్ ఆఫర్ చేస్తుంది. 20 ఏళ్లకు రూ.75 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే రూ.56,360 ఈఎంఐ చెల్లించాలి.
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనెరా బ్యాంక్ 6.65 శాతం వడ్డీతో హోమ్ లోన్ ఇస్తోంది. 20 ఏళ్లకు రూ.75 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే రూ.56,582 ఈఎంఐ చెల్లించాలి.
పైన చెప్పిన ఈఎంఐ లెక్కలన్నీ రూ.75 లక్షల రుణానికి సంబంధించినవి. 20 ఏళ్ల కాలవ్యవధితో రుణాలు తీసుకుంటే ఎంత ఈఎంఐ చెల్లించాలో తెలుసుకున్నాం. వడ్డీ రేటు తక్కువగా ఉంటే ఈఎంఐ కూడా తగ్గుతుంది. అయితే టెన్యూర్ పెంచుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. 30 ఏళ్ల వరకు టెన్యూర్ పెంచుకోవచ్చు.
బ్యాంకులు నిర్ణయించే వడ్డీ రేట్లు కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ హిస్టరీపైన ఆధారపడి ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే గృహ రుణాలు లభిస్తాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ లభిస్తోంది. త్వరలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న చర్చ జరుగుతోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.