ఫెస్టివల్ సీజన్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కార్ల కొనుగోళ్లు (Car Sales) ఊపందుకున్నాయి. ఈసారి దసరాతో పాటు దీపావళి సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీకి బాగా కలిసివచ్చింది. ఫెస్టివల్ సీజన్లో వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లోన్ ఆఫర్లను అందించడంతో, కస్టమర్లు వీటిని ఉపయోగించుకొని కార్లను కొనుగోలు చేశారు. ఇప్పటికీ వివిధ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి లోన్ ఆఫర్లను అందిస్తున్నాయి.
బ్యాంక్‌బజార్ డేటా ప్రకారం.. ప్రస్తుతం ఏడు సంవత్సరాల లోన్ రీపేమెంట్ పీరియడ్‌తో ఇచ్చే రూ. 10 లక్షల కొత్త కార్ లోన్‌పై చౌకైన లోన్లు అందించే టాప్ 10 బ్యాంకులను మనీకంట్రోల్ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. బీఎస్ఈలో లిస్ట్ అయిన పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులు అందించే కార్ లోన్ వడ్డీ రేట్లను (2022 అక్టోబర్ 21నాటికి) బ్యాంక్ బజార్ సేకరించింది. ఆ వివరాలు చూద్దాం.
Jio Offers: జియో నుంచి రూ.6,500 వరకు బెనిఫిట్స్ పొందడానికి 3 రోజులే గడువు
ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏడు సంవత్సరాల రీపేమెంట్ టెన్యూర్‌తో ఇచ్చే రూ. 10 లక్షల కార్ లోన్‌పై 8.45 శాతం వడ్డీ విధిస్తుంది.
ఈ బ్యాంకు 8.45 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్లను ఆఫర్ చేస్తుంది. ఈ సందర్భంలో రుణ గ్రహీత రూ. 15,811 ఈఎంఐ చెల్లించాలి.
ఈ ప్రైవేట్ రంగ రుణదాత 8.4 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్లను అందిస్తుంది. అంటే రుణ గ్రహీత రూ. 15,786 ఈఎంఐ చెల్లించాలి.
ఈ బ్యాంకు ఏడేళ్ల లోన్ టెన్యూర్‌తో ఇచ్చే రూ. 10 లక్షల కార్ లోన్‌పై 8.4 శాతం వడ్డీ విధిస్తుంది. అంటే కస్టమర్లు రూ. 15,786 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Dhanteras Gold Sales: ధంతేరాస్ రోజు కిలోలు కాదు... టన్నుల్లో బంగారు కొనేశారు... మొత్తం ఎంతంటే
PNB కార్ లోన్‌పై 8.35 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. అంటే కస్టమర్లు రూ. 15,761 EMI చెల్లించాలి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.3 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్లను అందిస్తోంది. కస్టమర్లు EMIగా రూ. 15,736 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ బ్యాంక్ ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో అందించే రూ. 10 లక్షల కార్ లోన్‌పై 8.25 శాతం వడ్డీ రేటును విధిస్తోంది. అంటే రుణగ్రహీత ప్రతి నెలా రూ.15,711 ఈఎంఐ చెల్లించాలి.
భారతదేశపు అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కార్ లోన్లపై 8.05 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ఈ సందర్భంలో EMI రూ. 15,611 అవుతుంది.
Bank Holidays: పండుగలు అయిపోయాయి... నవంబర్‌లో బ్యాంకులకు ఎన్ని సెలవులంటే
ప్రైవేట్ రంగ దిగ్గజం HDFC బ్యాంక్ ఏడేళ్ల కాల వ్యవధితో అందించే రూ. 10 లక్షల కొత్త కార్ లోన్‌పై అతి తక్కువగా 7.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
ప్రభుత్వ రంగ రుణదాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.9 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్లను అందిస్తోంది. రూ. 15,536 ఈఎంఐతో ఈ విభాగంలో ఈ బ్యాంకు కూడా అతి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Bank loan, Car loans, Cheapest Car Loan, Personal Finance