హోమ్ /వార్తలు /బిజినెస్ /

IIFL Finance: వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు... ఐదు నిమిషాల్లో రూ.10 లక్షల వరకు లోన్

IIFL Finance: వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు... ఐదు నిమిషాల్లో రూ.10 లక్షల వరకు లోన్

IIFL Finance: వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు... ఐదు నిమిషాల్లో రూ.10 లక్షల వరకు లోన్
(ప్రతీకాత్మక చిత్రం)

IIFL Finance: వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు... ఐదు నిమిషాల్లో రూ.10 లక్షల వరకు లోన్ (ప్రతీకాత్మక చిత్రం)

IIFL Finance | వాట్సప్‌లో కేవలం ఐదు నిమిషాల్లో రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్ (Business Loan) ఇస్తామని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రకటించింది. వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ బిజినెస్ లోన్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ (IIFL Finance) రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్ (Business Loan) ఇస్తోంది. అది కూడా వాట్సప్‌లో అప్లై చేస్తే చాలు. కాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే బిజినెస్ లోన్ తీసుకోవడం అంత సులభం అయ్యేది కాదు. అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు బిజినెస్ లోన్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒక్కోసారి కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కేవైసీ అప్‌డేట్, వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా సులువైపోయింది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వ్యాపారులకు సులభంగా బిజినెస్ లోన్స్ ఇస్తోంది. కేవలం వాట్సప్ ద్వారా అప్లై చేస్తే చాలు... లోన్ మంజూరు చేస్తోంది. వాట్సప్ ద్వారా వ్యాపారులు రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్ తీసుకోవచ్చు.

  Aadhaar Card Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయాలా? తెలుగులో సింపుల్‌గా చేయండి ఇలా

  వ్యాపారులు బిజినెస్ లోన్ తీసుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాట్సప్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ.10 లక్షల వరకు వ్యాపార రుణాలు పొందొచ్చు. వాట్సప్ ద్వారా ఛాటింగ్ చేయడాన్ని భారతీయులు ఇష్టపడతారని, అందుకే వాట్సప్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో తక్కువ డాక్యుమెంటేషన్‌తో రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని, భారతదేశంలో వాట్సప్ ద్వారా బిజినెస్ లోన్ ఇస్తున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీ తమదేనని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రకటించింది.

  భారతదేశంలో 45 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారు. వాట్సప్ ద్వారా ఛాటింగ్ చేయడం మాత్రమే కాదు... వ్యాపారులు బిజినెస్ కూడా చేస్తున్నారు. అందుకే వాట్సప్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రంగంలోకి దిగింది. ఈ కంపెనీకి చెందిన ఏఐ బాట్ యూజర్లు ఇచ్చిన వివరాలను విశ్లేషించి లోన్ ఆఫర్స్ అందిస్తాయి. కేవైసీ, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్, మ్యాండేట్ లాంటివన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతాయి.

  LPG Subsidy: మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాకపోతే కంప్లైంట్ చేయండి ఇలా

  వాట్సప్ ద్వారా బిజినెస్ లోన్ ఎలా పొందాలి?


  వాట్సప్ ద్వారా బిజినెస్ లోన్ పొందడానికి ముందుగా రుణగ్రహీతలు తమ స్మార్ట్‌ఫోన్‌లో 9019702184 నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత Hi అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కేవైసీ ప్రాసెస్, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్, మ్యాండేట్ రిజిస్ట్రేషన్ లాంటివన్నీ వాట్సప్‌లోనే జరుగుతాయి. ఆ తర్వాత రుణం మంజూరు అవుతుంది. డబ్బులు నేరుగా రుణగ్రహీతల అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank loan, Bank loans, Business, BUSINESS NEWS, Personal Loan, Small business, Whatsapp

  ఉత్తమ కథలు