ఉద్యోగుల జీతంపై యాన్యువల్ ఇంక్రిమెంట్ కారణంగా వారి బేసిక్ (Basic)పే, అలాగే ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్(Contribution) కూడా పెరుగుతుంది. గత రెండు నెలలుగా చాలా కంపెనీలు తమ సిబ్బందికి యాన్యువల్ ఇంక్రిమెంట్ లెటర్లను ఇస్తున్నాయి. మొత్తం జీతంలో పెరుగుదలతో పాటు, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(EPF) ఖాతాకు జమ చేయాల్సిన మొత్తంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. EPF కాంట్రిబ్యూషన్ ఎంత పెరిగిందనేది తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే EPF అకౌంట్ కాంట్రిబ్యూషన్ నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే, అదనపు కాంట్రిబ్యూషన్ నుంచి వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
2021 ఏప్రిల్ 1 నుంచి, ఒక ఆర్థిక సంవత్సరంలో EPF, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(VPF)కి ఒక ఉద్యోగి సొంత కాంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే, అదనపు కాంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. ఆదాయానికి వర్తించే ఆదాయ పన్ను రేట్ల ప్రకారం అదనపు కాంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2021-22 కోసం నోటిఫై చేసిన తాజా ఆదాయపన్ను రిటర్న్ ఫారమ్‌లు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులను అదనపు EPF, VPF కాంట్రిబ్యూషన్లపై సంపాదించిన వడ్డీని నివేదించి, పన్ను చెల్లించమని పేర్కొంటోంది.
కాబట్టి, ఐటీఆర్(ITR)లో తప్పనిసరిగా పేర్కొనాల్సిన పన్ను చెల్లించాల్సిన వడ్డీ ఉందో? లేదో? తనిఖీ చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మాత్రమే కాకుండా, మునుపటి సంవత్సరం 2021-22 వివరాలను కూడా పరిశీలించాలి.
EPF వడ్డీపై పన్ను విధిస్తారా, లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు?
శాలరీ స్లిప్‌లను తనిఖీ చేయడం ద్వారా ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన EPF వడ్డీపై పన్ను విధిస్తారా? లేదా? అనేది తెలుసుకోవడానికి సులువైన మార్గం. ప్రతి నెలా యజమాని చెల్లించిన జీతం నుంచి EPF కాంట్రిబ్యూషన్ తీసివేస్తారు. ఇంకా, VPF కాంట్రిబ్యూషన్‌ను కూడా ఎంచుకుంటే, అటువంటి మినహాయింపు శాలరీ స్లిప్‌లో కూడా ప్రతిబింబిస్తుంది. శాలరీ స్లిప్‌లో ప్రతిబింబించే EPF, VPF కాంట్రిబ్యూషన్ తప్పనిసరిగా 12తో గుణించాలి.
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో
ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా యజమాని EPF ఖాతాకు కాంట్రిబ్యూట్ చేయని ఉద్యోగి అయితే, ట్యాక్స్ ఎగ్జమ్షన్ పొందే EPF, VPF కాంట్రిబ్యూషన్ లిమిట్ రూ.5 లక్షలు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి సొంత కాంట్రిబ్యూషన్ రూ.5 లక్షలకు మించకపోతే EPF, VPFపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుందని అర్థం. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి సొంత EPF, VPF కాంట్రిబ్యూషన్ రూ.5 లక్షలు దాటితే, అదనపు కాంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారు.
పన్ను పరిధిలోకి ఈపీఎఫ్ వడ్డీ
ఉద్యోగి సొంత EPF, VPF కాంట్రిబ్యూషన్ పేర్కొన్న లిమిట్ రూ.2.5 లక్షలు లేదా రూ.5 లక్షలు మించి ఉంటే అదనపు కంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారు. అదనపు EPF, VPF కాంట్రిబ్యూషన్‌పై పొందిన వడ్డీని క్రెడిట్ చేయడానికి మరొక EPF ఖాతా ఓపెన్ అవుతుంది. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 2021 ఆగస్టు 31 నాటి నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Epf, EPFO, Tax deduction