Home /News /business /

ARE PARENTS INCLUDED IN CORPORATE HEALTH INSURANCE PROFIT OR LOSS TAKE A LOOK UMG GH

Health Insurance: కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పేరెంట్స్ ను చేర్చుతున్నారా.. లాభమా.. నష్టమా ? లుక్కేయండి

 కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పేరెంట్స్ ను చేర్చుతున్నారా.. లాభమా.. నష్టమా ? లుక్కేయండి

కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పేరెంట్స్ ను చేర్చుతున్నారా.. లాభమా.. నష్టమా ? లుక్కేయండి

తల్లిదండ్రులు(Parents) వృద్ధాప్య వయసులో ఉంటారు కాబట్టి వారిని కార్పొరేట్(Corporate) గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌(Health Insurance) పాలసీలో యాడ్ చేయడం ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే దీనివల్ల చాలా ప్రయోజనాలతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ఈ రోజుల్లో పేలవమైన జీవనశైలి వల్ల చాలామంది రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే పెరిగిన వైద్య ఖర్చుల వల్ల ఏదైనా వ్యాధికి చికిత్స చేయించుకోవాలంటే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఆరోగ్య(Health) బీమా ఉండటం అందరికీ తప్పనిసరిగా మారింది. అయితే కొన్ని కంపెనీలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు కార్పొరేట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ (Corporate Health Insurance)ను ఉచితంగా అందిస్తున్నాయి. ఈ ఆరోగ్య బీమా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ(Policy)లు ఉద్యోగుల జీవిత భాగస్వామితో పాటు పిల్లలు, తల్లిదండ్రులను కూడా కవర్ చేస్తాయి.

తల్లిదండ్రులు వృద్ధాప్య వయసులో ఉంటారు కాబట్టి వారిని కార్పొరేట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌ పాలసీలో యాడ్ చేయడం ఉద్యోగుల(Employee)కు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే దీనివల్ల చాలా ప్రయోజనాలతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కొన్ని కంపెనీలు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో తల్లిదండ్రులకు కవరేజీని అందిస్తే... మరికొన్ని కంపెనీలు ఉద్యోగి భరించగలిగే అడిషనల్ ప్రీమియంతో కవరేజీని ఆఫర్ చేస్తారు. వృద్ధాప్య తల్లిదండ్రులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న చికిత్స ఖర్చుల నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్లాన్‌కు తల్లిదండ్రులను జోడించడం సరైనదని ఇన్సూరెన్సు నిపుణులు కూడా చెబుతున్నారు. కార్పొరేట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో తల్లిదండ్రులను యాడ్ చేస్తే తక్కువ ప్రీమియం, ముందుగా ఉన్న వ్యాధులపై కవరేజీ వంటి మెరుగైన ప్రయోజనాలు పొందచ్చు.

గమనించాల్సిన విషయాలు
గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో తల్లిదండ్రులను యాడ్ చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయి కానీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు, వాటికి పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇదీ చదవండి:  Jio Games Watch: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ .. జియో కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌.. చూస్తే వదలరు !


సాధారణంగా, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించే కవరేజీ మొత్తం ఒక కుటుంబానికి రూ.3-5 లక్షలలోపే ఉంటుంది. ఈ కవరేజ్ అమౌంట్ తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు ఏమాత్రం సరిపోకపోవచ్చు. అందుకే ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం ఒక సూపర్ టాప్-అప్‌ను కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల సరసమైన ప్రీమియంతో అధిక పరిమితి కవరేజీని పొందడం సాధ్యమవుతుంది. ఈ పాలసీ కోసం మీరు చెల్లించిన ప్రీమియంను సెక్షన్ 80D కింద పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం, 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న తల్లిదండ్రులకు సంవత్సరానికి రూ.25,000 వరకు మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు.



గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ కింద తల్లిదండ్రులకు హెల్త్ కవరేజీ సరైన సమయంలో కచ్చితంగా అందుతుందని చెప్పలేం. ఒక కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఆ కంపెనీలో ఉద్యోగం మానేస్తే తల్లిదండ్రులకు హెల్త్ కవరేజ్ అందదు. అలాగే మీరు చేరే కొత్త కంపెనీ పాలసీలో తల్లిదండ్రులకు కవరేజ్ ఉండకపోవచ్చు. ఏదైనా కారణం వల్ల మిమ్మల్ని కంపెనీలు ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తీసేసినా పేరెంట్స్‌కి హెల్త్ కవరేజీ అందదు. ఈ కారణాల వల్ల కార్పొరేట్ పాలసీలపై ఆధారపడకుండా, కవరేజీ ఎప్పుడూ అందేలా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం కొనుగోలు చేయడం మంచిది.
Published by:Mahesh
First published:

Tags: Health Insurance, Health Tips, Life Insurance, Parents

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు