news18-telugu
Updated: November 10, 2020, 7:26 PM IST
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశంలో ప్రజలు నిర్వహించుకునే పండుగల్లో దీపావళి ప్రత్యేకమైంది. ఇతర ప్రధాన పండుగల మాదిరిగానే, దీపావళి నాడు ప్రజలు బహుమతులు (gifts) ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రేమ, వేడుకలకు గుర్తుగా బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. నగదు, బంగారం ఇతర విలువైన వస్తువులను గిఫ్ట్‌గా ఇస్తారు. వీటిపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 1998లోనే బహుమతులపై ట్యాక్స్ విధించే చట్టమైన ‘గిఫ్ట్ ట్యాక్స్’ను రద్దు చేశారు. కానీ ఆదాయం కిందకి వచ్చే కొన్ని రకాల బహుమతులు ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి అందుకున్న బహుమతులను, వారి ఆదాయంగానే పరిగణించాలి. అందువల్ల Income Tax Actలోని సెక్షన్ 56(2) ప్రకారం కొన్ని బహుమతులు ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. మరికొన్ని గిఫ్ట్స్కు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
ఎలాంటి వాటిపై ట్యాక్స్ ఉంటుంది?బహుమతిగా వచ్చే నగదు, ఆస్తి, షేర్లు, సెక్యూరిటీలు, ఆభరణాలు, పురాతన వస్తువులు, డ్రాయింగ్లు, పెయింటింగ్‌లు, శిల్పాలు, ఇతర కళాకృతులు, బులియన్, ఇతర విలువైన వస్తువులను "Income from Other Sources" విభాగంలో వ్యక్తి ఆర్జించిన ఆదాయంగా పరిగణిస్తారు. దీనిపై చట్ట ప్రకారం ట్యాక్స్ విధిస్తారు.
ఆ బహుమతులపై ట్యాక్స్ ఉండదు..
బంధువుల నుంచి అందుకునే బహుమతులు ట్యాక్స్ పరిధిలోకి రావు. బంధువులు అనే పదాన్ని చట్ట ప్రకారం నిర్వచించారు. ఈ జాబితాలో ఒక వ్యక్తి జీవిత భాగస్వామి, సోదరుడు లేదా సోదరి, జీవిత భాగస్వామి సోదరుడు లేదా సోదరి, తల్లిదండ్రులలో ఒకరి సోదరుడు లేదా సోదరి, ఆ వ్యక్తికి వారసుడిగా ప్రకటించిన వ్యక్తి, జీవిత భాగస్వామికి వారసుడుగా గుర్తింపు ఉన్న వ్యక్తి... ఉన్నారు. వీరి నుంచి స్వీకరించే గిఫ్ట్స్‌పై ట్యాక్స్ ఉండదు.
స్నేహితులు, ఇతరుల నుంచి వచ్చే బహుమతులపై..
బంధువుల నుంచి అందుకునే బహుమతులపై పరిమితితో సంబంధం లేకుండా ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. కానీ స్నేహితులు, ఇతరుల నుంచి వచ్చే బహుమతులను "ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం" (income from other sources)గా పరిగణిస్తారు. చట్ట ప్రకారం దీనికి పన్ను విధిస్తారు. కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో పెళ్లి, ఏదైనా ఫౌండేషన్ లేదా సంస్థల ప్రారంభోత్సవాల్లో అందుకున్న బహుమతుల్లో రూ.50,000 వరకు విలువ చేసే వస్తువులపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. మన దేశంలో ఇలాంటి బహుమతులపై విధించే ట్యాక్స్‌ను Income Tax Act ప్రకారమే నిర్ణయిస్తారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 10, 2020, 7:26 PM IST