Electric vs Petrol Scooters: ఎలక్ట్రిక్, పెట్రోల్ స్కూటర్లలో ఏవి బెస్ట్? రెండింటినీ ఇలా పోల్చి చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

Electric vs Petrol Scooters: పెరుగుతున్న ఇంధన ధరలు, మెయింటెనెన్స్ ఛార్జీల వల్ల సామాన్యుడు పెట్రోల్ వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడుతున్నాడు. ఫలితంగా ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాడు.

  • Share this:
పెరుగుతున్న ఇంధన ధరలు (Latest Telugu News), మెయింటెనెన్స్ ఛార్జీల వల్ల సామాన్యుడు పెట్రోల్ వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడుతున్నాడు. ఫలితంగా ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా ఆటోసంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. ప్రభుత్వ సబ్సిడీలతో పాటు పెరుగుతున్న ఇంధన ఛార్జీలు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రాధాన్యతను సూచిస్తున్నాయి. ఏడాది క్రితం వరకు అరుదుగా కనిపించిన విద్యుత్ స్కూటర్లను.. ఇప్పుడు చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఓలాఎస్1, ఎస్1 ప్రో లాంటి విద్యుత్ వాహనాల బుకింగ్స్ గంటల వ్యవధిలోనే పూర్తయ్యాయంటే, వీటికి డిమాండ్ ఎలా ఉందో ఆలోచించుకోవచ్చు. ప్రత్యేకించి ఈ-స్కూటర్లు పట్టణ వాసులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అసలు వీటిపై ఇంత డిమాండ్ ఎందుకు? పెట్రోల్ వాహనాలకంటే మెరుగ్గా పనిచేస్తాయా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ పోల్చి చూద్దాం.

* ధర..
2020తో పోలిస్తే 2021 ప్రథమార్థంలో ఈ-స్కూటర్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. హీరో ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ లాంటి సంస్థలు ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం FAME-2, రాష్ట్రాల అత్యధిక సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే ఓలా ఎస్-1 రూ.86,999లకు లభ్యమవుతుంది. అయితే పెట్రోల్ వేహికల్స్ ధరలు మాత్రం ఎప్పటికప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి.

* సాంకేతికత..
విద్యుత్ స్కూటర్లలో టెక్నాలజీ చాలా సులభతరమైంది. పవర్ ట్రెయిన్ పనితీరు, ఓవర్-ద-ఎయిర్ అప్‌డేట్లు, రివర్స్ బటన్ లాంటి సులభమైన సర్దుబాట్లను వీటిలో అందిస్తున్నారు. టూరింగ్ బైక్స్ లో కనిపించే HD రోడ్ గ్లైడ్, హోండా గోల్డ్ వింగ్ లాంటి ఫీచర్లు వీటిలో పొందుపరుస్తున్నారు. భారత్ లో అమ్మకానికి లేని బోనఫైడ్ మ్యాక్సిస్ స్కూటర్లు కూడా విద్యుత్ స్కూటర్లతో పోటీ పడలేకపోతున్నాయి. ఇక సంప్రదాయ పెట్రోల్ స్కూటర్లకు ఈ అవకాశమే లేదు.

* నిర్వహణ వ్యయం..
పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే.. విద్యుత్ స్కూటర్ల మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాల్లో మూవింగ్ పార్ట్స్ చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే మోటార్ బైక్స్‌లో ఏ పార్ట్‌ రీప్లేస్ చేయాలన్నా భారీగా ఖర్చవుతుంది. ఈ-స్కూటర్లతో ఈ సమస్య ఉండదు.

* పనితీరు..
పనితీరు విషయంలో కూడా ఈ-స్కూటర్‌కు వంక పెట్టలేం. ప్రతి ఐటిరేషన్ (iteration) లోనూ మెరుగైన పనితీరు కనబరుస్తుంది. ఏథర్, ఓలా లాంటి సంస్థలు తమ వాహనాలకు తక్షణ టార్క్ ను డెలివరీని అందిస్తున్నాయి. ఏథర్ 450ఎక్స్ విద్యుత్ స్కూటర్ 7,2 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 24 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే సమయంలో ఓలా ఎస్1 ప్రో 58 ఎన్ఎం టార్క్ తో పెద్ద సైజు స్పోర్ట్స్ బైక్ అందించేంత టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి : రంగంలోకి దాదా.. త్వరలోనే ఇంగ్లండ్ కు పయనం.. ఎందుకో తెలుసా..?

లీనియర్ పర్ఫార్మెన్స్ ద్విచక్రవాహన వినియోగానికి ముఖ్య కొలమానంగా ఉండదు. భారత్ లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లు, మోటార్ సైకిళ్లు ఇక్కడ వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఆధారంగా దీర్ఘకాలం పాటు ఉండేలా రూపొందించారు. విద్యుత్ స్కూటర్లు లిట్మస్ పరీక్షలో ఇంకా అర్హత సాధించలేదు. 4 నుంచి 5 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా పనిచేస్తాయి. విద్యుత్ స్కూటర్లలో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ.

* డబ్బు ఆదా చేసుకోవచ్చు..
ఐదు సంవత్సరాలు విద్యుత్ స్కూటర్ వాడితే.. మరో పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసేంత సొమ్ము ఆదా అవుతుంది. ఏటా బ్యాటరీ ఖర్చులు తగ్గుతుండటంతో ఈ-స్కూటర్లు, పెట్రోల్ స్కూటర్ల మధ్య ధర వ్యత్యాసం వారాల వ్యవధిలోనే తగ్గే అవకాశముంది. విద్యుత్ స్కూటర్ల కొనుగోళ్లు మరింత పెరగనున్నాయి.

* రీఫ్యూయలింగ్, రీఛార్జింగ్..
ప్రస్తుతం పెట్రోల్ ధర ఎంతలా పెరిగిందో అందరికి తెలిసిందే. దీంతో స్కూటర్ల ఓనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే వీటి రీఛార్జింగ్ కోసం రెసిడెన్షియల్ కాంప్లెక్సులో ఛార్జింగ్ స్టేషన్లను ఇన్ స్టాల్ చేయడం సవాలుగా అనిపించవచ్చు. డెలివరీ ప్రక్రియలో భాగంగా బ్రాండ్లు ఛార్జింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నప్పుడు హౌసింగ్ అసోసియేషన్ల నుంచి అనుమతి పొందడం లాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సమస్యలను అధిగమించగలిగితే ఈ-స్కూటర్‌ను ఎంచుకోవడమే ముఖ్యమైన ఆప్షన్.
Published by:Sridhar Reddy
First published: