బ్యాంకులు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. కస్టమర్లకు చెప్పకుండా డబ్బులు కట్ చేస్తున్నాయి. తీరా ఎందుకు డబ్బులు కట్ చేశారని ఆరా తీస్తే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాల కోసమని తేలింది. ఈ అంశంపై మనీకంట్రోల్ ఓ కథనం పబ్లిష్ చేసింది. ఆ కథనం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కెనెరా బ్యాంక్ లాంటి ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ల సమ్మతి తీసుకోకుండా ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ పథకాల కోసం డబ్బుల్ని డెబిట్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో కస్టమర్లు కంప్లైంట్ చేస్తున్నారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కోసం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కోసం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), పెన్షన్ కోసం అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాలను బ్యాంకులు అందిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ పథకాల్లో కస్టమర్లు చేరాలంటే బ్యాంకుల్ని సంప్రదించాలి. బ్యాంకులు ఈ పథకాలపై అవగాహన కల్పించేందుకు మెసేజెస్, ఇమెయిల్స్ పంపిస్తుంటాయి. కస్టమర్లు అంగీకరిస్తేనే ఈ స్కీమ్స్‌లో చేరుస్తాయి. కానీ ఇటీవల కస్టమర్ల సమ్మతి లేకుండానే బ్యాంకులు వారిని ఈ పథకాల్లో చేరుస్తున్నాయని, వారి అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో పలువురు కంప్లైంట్ చేస్తున్నారు.
SBI: త్వరపడండి... ఎస్‌బీఐ నుంచి 2023 జనవరి 31 వరకే ఈ ఆఫర్
@SBILifeCares Bank has deducted 342 rupees under #pmjjby scheme without even telling me. Now I've gave them a written application on Friday. How would I get update on this matter ? Whether they've closed the scheme or not ?#StateBankOfIndia #Sbi
— Sahil (@TheCyberSahil) December 3, 2022
@TheOfficialSBI sir,respectfully,my sister tilotama sahoo have been account in sbi indipur branch, and bank debited 342 rs for insurance scheem but not applie insurance sheem my sister,please sir take it action.
— Ajaya sahoo (@AJAYASAHOO1998) October 14, 2022
@TheOfficialSBI@RBIsays Hii sbi I have naver activated any insurance plan .but bank deducting PMJJBY and PMSBY Rs 342 and Rs 20 on 30/11/2022 without my consent.
— ankit maurya???? (@GOVINDG18641660) December 6, 2022
తాము ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అప్లై చేయలేదని, తమ సమ్మతి లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయన్నది ఆ కంప్లైంట్స్ సారాంశం. ఈ పథకాలకు తమ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలంటూ బ్యాంకుకు దరఖాస్తు కూడా ఇచ్చామంటున్నారు సదరు కస్టమర్లు. ఎస్‌బీఐ మాత్రమే కాదు, కెనెరా బ్యాంక్ కస్టమర్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
Bank Holidays 2023: వచ్చే ఏడాది బ్యాంకులకు 21 సెలవులు... తేదీలు ఇవే
ఈ కథనాన్ని పబ్లిష్ చేసిన మనీకంట్రోల్ ఎస్‌బీఐ, కెనెరా బ్యాంక్, ఆర్‌బీఐ , ఐఆర్‌డీఏఐ నుంచి వివరణ కోరింది. అయితే ఇంకా వివరణ రావాల్సి ఉంది. అయితే బ్యాంకులు నియమించిన థర్డ్ పార్టీ ఉద్యోగులు మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు, ఈ పథకాల గురించి వివరించకుండా ఎన్‌రోల్ చేస్తూ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయించడం ఈ ఉద్యోగుల పని. అయితే ఆ సమయంలో ఈ పథకాల గురించి వివరించకుండా ఇందులో చేరుస్తూ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఈ పథకాల వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం 2015 మేలో రెండు ఇన్స్యూరెన్స్ పథకాలను ప్రారంభించింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో ఏటా రూ.342 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల బీమా లభిస్తుంది. ఇక ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో రూ.20 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుంది. అటల్ పెన్షన్ యోజన పథకంలో ప్రతీ నెలా డబ్బులు జమ చేస్తే, వృద్ధాప్యంలో పెన్షన్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Personal Finance