Kia Cars | కియా కంపెనీ దూసుకుపోతుంది. ఎలక్ట్రిక్ కారుతో దుమ్మురేపుతోంది. ఇండియన్ మార్కెట్‌లో తనదైన శైలితో ప్రత్యర్థులకు ఝలక్ ఇస్తోంది. ఈ కంపెనీ అటు పెట్రోల్ (Petrol), డీజిల్ కార్లతో పాటుగా ఎలక్ట్రిక్ కార్లను కూడా కస్టమర్లకు అందిస్తోంది. కంపెనీ ఈవీ6 పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ కారులో అదిరే ఫీచర్లు ఉన్నాయి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ప్రకారం చూస్తే.. కియా (Kia) ఈవీ6 మోడల్ రేంజ్ ఏకంగా 708 కిలోమీటర్లు ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లిపోవచ్చు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 60 లక్షల నుంచి ఉంది.
కియా ఈవీ6 అనేది లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అని చెప్పుకోవచ్చు. కంపెనీ కేవలం 100 మోడళ్లను మాత్రమే భారత్‌లో విక్రయించాలని భావించింది. అంటే ఎవరైనా ముందుగా కారు బుక్ చేసుకుంటారో వారికే ఈ కారు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కంపెనీ మరిన్ని కార్లను కస్టమర్లకు అందించాలని యోచిస్తోంది. ఈ ఏడాది జూన్ నెలలో కంపెనీ ఈ మోడల్‌ను తీసుకువచ్చింది. కారు డెలివరీ అక్టోబర్ నుంచి ప్రారంభం అయ్యింది. ఇది రెండే వేరియంట్ల రూపంలో ఉంది. జీటీ లైన్ ఆర్‌డబ్ల్యూడీ, జీటీ లైన్ ఏడబ్ల్యూడీ అనేవి ఇవి.
ఎస్‌బీఐ కొత్త సర్వీసులు.. కస్టమర్లు ఇక ఆ సేవలకు బ్యాంక్‌కు వెళ్లక్కర్లేదు!
మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలని భావిస్తే.. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ప్రిబుక్ చేసుకుంటే కారు పొందొచ్చు. ఆన్‌లైన్‌లో లేదంటే నేరుగా కియా డీలర్‌షిప్ వద్దకు వెళ్లి కారు బుక్ చేసుకోవచ్చు. ఈ కారు దేశంలో 77.4 కేడబ్ల్యూహెచ్ సింగిల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో లభిస్తోంది. కేవలం 73 నిమిషాల్లోనే ఈ కారు బ్యాటరీ 10 నుంచి 80 శాతం నిండుతుంది. ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ఇంజిన్ కెపాసిటీ విషయానికి వస్తే.. 229 బీహెచ్‌పీ, 350 ఎన్ఎం టార్క్ ఉంటుంది. అలాగే ఏడబ్ల్యూడీ వేరియంట్ విషయానికి వస్తే.. 325 బీహెచ్‌పీ, 605 ఎన్ఎం ఉంటుంది.
కనక వర్షం కురిపిస్తున్న రూ.2 షేరు.. ఏడాదిలోనే రూ.2 లక్షలకు రూ.10 లక్షలు!
కియా ఈవీ6 మోడల్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్ స్ట్రిప్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సింగిల్ స్లేట్ గ్రాస్ బ్లాక్ గ్రిల్, వైడ్ ఎయిర్‌డ్రమ్, డ్యూయెల్ టోన్ అలాయ్ వీల్స్, టెయిల్ లైట్స్, డ్యూయెల్ టోన్ బంపర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టు స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, టచ్ కంట్రోల్ ఫర్ ఏసీ, రొటరీ డయల్ ఫర్ ట్రాన్స్‌మిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా నెక్సన్, హ్యుందాయ్ కోన, ఎంజీ జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, Electric Car, Electric Vehicles, Kia cars