Sputnik V Vaccine: ఇండియా నుంచి రష్యాకు టూర్ ప్యాకేజీ... రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ గ్యారెంటీ

Sputnik V Vaccine Tour: రష్యాలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇండియా నుంచి టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

Sputnik V Vaccine Tourism | వ్యాక్సిన్ టూరిజంకు డిమాండ్ పెరుగుతోంది. రష్యాకు తీసుకెళ్లి, రెండు డోసుల వ్యాక్సిన్ ఇప్పించడమే కాదు, రష్యాలో పర్యాటక ప్రాంతాలను చూపిస్తామంటూ ఓ ట్రావెల్ ఏజెన్సీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

  • Share this:
    ఇండియాలో వ్యాక్సిన్ తీసుకోవడానికి స్లాట్స్ దొరకట్లేదా? అయితే రష్యా వెళ్లి, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని, రష్యాలోని పర్యాటక ప్రాంతాలు చూసి, ఇండియాకు తిరిగొచ్చే టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఓ ట్రావెల్ ఏజెన్సీ. ఇది అక్షరాలా నిజం. దుబాయికి చెందిన అరేబియన్ నైట్స్ టూర్స్ ట్రావెల్ ఏజెన్సీ ఈ టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఢిల్లీ నుంచి మాస్కోకు ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. మొత్తం 23 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఏ ట్రిప్ టు వ్యాక్సినేషన్ అండ్ హ్యాపీనెస్ రష్యా పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇండియాలో వ్యాక్సిన్ కొరత గురించి తెలిసిందే. కానీ ఎలాగైనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్నవాళ్లున్నారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నారు. అలాంటివారి కోసం అరేబియన్ నైట్స్ టూర్స్ ట్రావెల్ ఏజెన్సీ ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మాత్రమే కాదు, సైట్ సీయింగ్, హోటల్‌లో బస, భోజనం లాంటివన్నీ కవర్ అవుతాయి.

    Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? 14 గంటలు ఆ సేవలు బంద్

    EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా

    Sputnik V Vaccine Tour: టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే...


    రూ.1,30,000 చెల్లించి ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునే వారికి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రెండు డోసులు గ్యారెంటీ. రష్యా చేరుకున్న మొదటి రోజే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. మరుసటి రోజు మొదటి డోసు వ్యాక్సిన్ ఇస్తారు. మళ్లీ 21వ రోజు రెండో డోసు ఇస్తారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో ఢిల్లీ నుంచి మాస్కోకు, మాస్కో నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. దీంతో పాటు పీటర్స్‌బర్గ్‌లో 3 స్టార్ హోటల్‌లో 4 రోజులు బస, మాస్కోలో 3 స్టార్ హోటల్‌లో 20 రోజుల బస ఏర్పాట్లు ఉంటాయి. ఇక మాస్కో నుంచి పీటర్స్‌బర్గ్‌కు, పీటర్స్‌బర్గ్‌ నుంచి మాస్కోకు రైలు టికెట్లు కవర్ అవుతాయి. 24 రోజులు బ్రేక్‌ఫాస్ట్, 24 రోజులు ఇండియన్ డిన్నర్ ఉంటాయి. వీటితో పాటు ప్రైవేట్ వాహనాల్లో సైట్ సీయింగ్ ఉంటుంది. మాస్కోలో మూడు రోజులు, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మూడు రోజులు సైట్‌సీయింగ్ ఉంటుంది. రష్యా టూరిస్ట్ వీసా సపోర్ట్ కూడా ఉంటుంది. సైట్ సీయింగ్ కోసం వాహనాలు, గైడ్, ఎంట్రెన్స్ ఫీజులన్నీ ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి.

    Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

    SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా

    Sputnik V Vaccine Tour, Vaccine Tour to russia, Arabian Nights Tours, how to get sputnik v vaccine, Vaccine Tourism, Sputnik V Vaccine Tourism, sputnik v vaccine india, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ టూర్, వ్యాక్సిన్ టూరిజం, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తీసుకోవడం ఎలా, అరేబియన్ నైట్స్ టూర్స్

    రెండు డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌తో పాటు రష్యాలో 24 రోజుల బస, 6 రోజుల సైట్ సీయింగ్ లాంటివన్నీ కవర్ అవుతున్నాయంటే ఈ టూర్ ప్యాకేజీ ధర భారీగానే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నిజమే. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.1,30,000. ఇది ఒకరికి మాత్రమే. ఇంత ఖర్చు పెట్టుకొని ఎవరు వెళ్తారని అనుకుంటున్నారా? ఈ టూర్ ప్యాకేజీకి ఫుల్ డిమాండ్ ఉందట.
    Published by:Santhosh Kumar S
    First published: