April Bank Holidays 2021: ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు... ఎప్పుడంటే

April Bank Holidays: ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు... ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

April Bank Holidays 2021 | ఏప్రిల్‌లో 30 రోజులు ఉంటే అందులో 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏఏ తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    ఏప్రిల్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? అయితే అలర్ట్. ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే. ఇవే కాదు... మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య 10 రోజుల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉంటాయి. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కాబట్టి మీ లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఏఏ రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం అవసరం. ఏప్రిల్‌లో పండుగలు, ఇతర సెలవులు ఎక్కువగా వచ్చాయి. దీంతో బ్యాంకులు మూసేసి ఉంటాయి. గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామనవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి ఉన్నాయి. వీటితో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవే. ఇవన్నీ కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులు మూసేసి ఉంటాయి. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

    IRCTC Tour: విశాఖపట్నం నుంచి మేఘాలయాకు హనీమూన్ టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

    Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్‌లైన్‌లో అప్లై చేయండి ఇలా

    ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్
    ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే
    ఏప్రిల్ 4- ఆదివారం
    ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
    ఏప్రిల్ 10- రెండో శనివారం
    ఏప్రిల్ 11- ఆదివారం
    ఏప్రిల్ 13- ఉగాది
    ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
    ఏప్రిల్ 18- ఆదివారం
    ఏప్రిల్ 21- శ్రీరామనవమి
    ఏప్రిల్ 24- నాలుగో శనివారం
    ఏప్రిల్ 25- ఆదివారం

    Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలా? ఈ 10 ఐడియాలు మీకోసమే

    Gold Coins: గోల్డ్ కాయిన్స్ కొంటే లాభమా? నష్టమా? తెలుసుకోండి

    ఇవన్నీ హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సెలవులు. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: