క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు(Apply) చేసుకునే అర్హత మీకు వచ్చినప్పుడు, ఏ కార్డు ఎంచుకోవాలనేది పెద్ద సమస్య. మొదటి క్రెడిట్ కార్డు ఎంపిక చేసుకునేటప్పుడు ముందు మీ ఖర్చు విధానం, పొందాలనుకునే ప్రయోజనాలు(Benefits) తెలుసుకోవడం ముఖ్యం. ఒకవేళ మీరు మొదటిసారి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. మీకు సెట్ అయ్యే బెస్ట్ ఎంట్రీ లెవల్ క్రెడిట్ కార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
1. Amazon Pay ICICI క్రెడిట్ కార్డు
ప్రైమ్ మెంబర్స్‌కు 5 పర్సెంట్ క్యాష్ అందిస్తుంది ఈ కార్డు. ప్రైమ్ మెంబర్స్ కాని వారికి 3 శాతం క్యాష్ బ్యాక్, ఫ్లైట్ బుకింగ్స్, రీఛార్జ్, బిల్లు చెల్లింపులు, గిఫ్ట్ కార్డులు, అమెజాన్ పే పార్టనర్ వ్యాపారులకు జరిపే చెల్లింపులపై 2 శాతం క్యాష్ బ్యాక్, ఇతర ట్రాన్సక్షన్స్‌పై 1 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు.
2. AXIS Bank Ace Credit Card
Google Pay ద్వారా యూటిలిటీస్ చెల్లింపులపై 5% క్యాష్ బ్యాక్ అందిస్తుంది ఈ కార్డు. Swiggy, Zomato, Olaపై 4%, ఇతర అన్ని ఖర్చులపై ఫ్లాట్ 2 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. క్యాష్ బ్యాక్‌తో పాటు కార్డుదారుకు విమానాశ్రయాల్లో 4 సార్లు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అలాగే భారతదేశంలో 4000+ పార్టనర్ రెస్టారెంట్స్‌లో 20 శాతం వరకు తగ్గింపును ఇది అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ.499.
3. SBI Simply Click క్రెడిట్ కార్డు
ఈ కార్డులో జాయిన్ అయినప్పుడు రూ.500 అమెజాన్ గిఫ్ఠ్ కార్డు పొందవచ్చు. అమెజాన్, Cleartrip, BookMyShow, Lenskart, వంటి వాటిల్లో కొనుగోళ్లపై 10X రివార్డులు, ఇతర అన్ని ఆన్లైన్ చెల్లింపులపై 5X రివార్డులు ఈ కార్డు అందిస్తుంది. ఫ్యూయల్ సర్ఛార్జ్ 1 శాతం వరకు ఉండదు. ఈ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ.499.
4. Flipkart Axis Bank Credit Card
Flipkart, Myntraలో షాపింగ్ చేస్తే ఈ కార్డు ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. Cleartrip, Cure.fit, PVR, Swiggy, Uber వంటి వాటిల్లో 4 శాతం క్యాష్ బ్యాక్, మిగిలిన ఇతర ఖర్చులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అంతే కాదు ఒక సంవత్సరం పాటు 4 సార్లు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఇది కల్పిస్తుంది. అలాగే భారతదేశంలో 4000+ పార్టనర్ రెస్టారెంట్స్‌లో 20 శాతం వరకు తగ్గింపును ఇది అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ.500.
5. HSBC Cashback Credit Card
అన్ని ఆన్లైన్ చెల్లింపులపై ( వ్యాలెట్ రీలోడ్స్ మినహా) 1.5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది ఈ కార్డు. ఇతర చెల్లింపుల 1 శాతం క్యాష్ బ్యాక్ దీని ద్వారా పొందవచ్చు. క్యాష్ బ్యాక్ కాకుండా సంవత్సరంలో 3 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ దీని ద్వారా అందుకోవచ్చు. ప్రధాన నగరాల్లోని పార్టనర్ రెస్టారెంట్లలో ఈ కార్డు ఉపయోగించి 15 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ. 750/-
క్రమశిక్షణాయుతమైన క్రెడిట్ బిహేవియర్ కలిగి ఉండి బలమైన క్రెడిట్ ప్రొఫైల్ నిర్మించుకోండి. మీకు మొదటిసారి క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత దాన్ని తెలివిగా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. వడ్డీ రహిత సమయం కార్డులో ఉంటుంది కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి తలెత్తుంది. రివార్డు పాయింట్లు పొందేందుకు, క్యాష్‌బ్యాక్ పొందేందుకు, వార్షిక రెన్యూవల్ ఫీజు నుంచి మినహాయింపు పొందేందుకు అధికంగా ఖర్చు చేయకండి. మీ చెల్లించే స్థోమత కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే 28 నుంచి 49 శాతం లెక్కన వార్షిక వడ్డీతో పాటు లేట్ పేమెంట్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.