PAN Card: పాన్ కార్డుకు అప్లై చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి

PAN Card | వ్యక్తిగతంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ప్రూఫ్స్ జతచేయాలి.

news18-telugu
Updated: September 25, 2019, 3:21 PM IST
PAN Card: పాన్ కార్డుకు అప్లై చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
PAN Card: పాన్ కార్డుకు అప్లై చేస్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 25, 2019, 3:21 PM IST
పాన్ కార్డ్... పెద్దపెద్ద ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరైన డాక్యుమెంట్. మీ అన్ని ఆర్థిక లావాదేవీలకు ఓ గుర్తింపు ఇవ్వడానికి పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. పన్ను ఎగవేతదారులకు అడ్డుకట్ట వేయడంలో పాన్ నెంబర్‌ది కీలక పాత్ర. అందుకే పెద్ద లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు చెబుతున్నాయి. పాన్ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. పాన్ నెంబర్ ద్వారా ఆ నెంబర్‌పై జరిగిన ఆర్థిక లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ సులువుగా గుర్తించగలదు. అందుకే తరచూ ఆర్థిక లావాదేవీలు జరిపేవాళ్లు పాన్ కార్డ్ తీసుకోవాలి. వ్యక్తులు మాత్రమే కాదు కంపెనీలు, సంస్థలు కూడా పాన్ నెంబర్ తీసుకోవచ్చు. మరి పాన్ కార్డుకు దరఖాస్తు చేస్తే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవో తెలుసుకోండి.

పాన్ కార్డుకు దరఖాస్తు చేసే భారత పౌరులు 49A ఫామ్ పూర్తి చేయాలి. వ్యక్తులు, కంపెనీలు, సంస్థలకు ఇదే ఫామ్ వర్తిస్తుంది. ఒకవేళ విదేశీయులు, విదేశీ సంస్థలు పాన్ కార్డ్ కావాలంటే 49AA ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ దరఖాస్తు చేయడానికి అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరి. వ్యక్తిగతంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ప్రూఫ్స్ జతచేయాలి. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. సంస్థలు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ఫర్మ్స్ / లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్ రిజిస్ట్రార్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ట్రస్టులు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ట్రస్ట్ డీడ్ కాపీ లేదా ఛారిటీ కమిషనర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీ ఉండాలి. సొసైటీ అయితే ఛారిటీ కమిషనర్ లేదా కోఆపరేటీవ్ సొసైటీ రిజిస్ట్రార్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జత చేయాలి.

ఎన్ఆర్‌ఐలు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తే భారత ప్రభుత్వం జారీ చేసిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్-PIO లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా-OCI కార్డ్ కాపీ జతచేయాలి. వాటితో పాటు ప్రస్తుతం నివాసం ఉంటున్న దేశంలోని బ్యాంక్ స్టేట్‌మెంట్, ఇండియాలోని ఎన్ఆర్ఈ బ్యాంక్ స్టేట్‌మెంట్ జత చేయాలి. మైనర్లు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే పేరెంట్స్, గార్డియన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ జత చేయాల్సి ఉంటుంది.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Smartphone: మీ ఫోన్ పోయిందా? బ్లాక్ చేయడానికి ఓ కాల్ చాలు...
Loading...
PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈజీ స్టెప్స్‌తో తెలుసుకోండి ఇలా...

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...
First published: September 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...