Credit Card: మీ క్రెడిట్ కార్డుపై ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు తెలుసా?

Credit Card | క్రెడిట్ కార్డులకు లాస్ ఆఫ్ బ్యాకేజీ, పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్ లాంటి ఇన్స్యూరెన్స్ పొందొచ్చు. క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇచ్చే ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకుంటే అనేక లాభాలుంటాయి.

news18-telugu
Updated: September 17, 2019, 5:07 PM IST
Credit Card: మీ క్రెడిట్ కార్డుపై ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు తెలుసా?
Credit Card: మీ క్రెడిట్ కార్డుపై ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
క్రెడిట్ కార్డ్... ఇప్పుడు అందరికీ ఓ అవసరం. క్రెడిట్ కార్డ్ జేబులో ఉంటే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని ధీమా. భారతదేశంలో సుమారు 5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉంటాయని అంచనా. క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నవారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. క్రెడిట్ కార్డును అవసరానికి, అత్యవసరానికి వాడుకుని బిల్లులు చెల్లిస్తే ఇబ్బంది లేదు కానీ... నిర్లక్ష్యంగా వాడితే మాత్రం అప్పుల పాలవడం ఖాయం. క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్, బిల్లు చెల్లింపులు మాత్రమే కాదు... లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, క్యాష్ విత్‌డ్రాయల్, ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌ను ఈఎంఐలుగా కన్వర్ట్ చేయడం లాంటి అనేక సదుపాయాలుంటాయి. వీటితో పాటు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్న విషయం చాలామందికి తెలియదు. క్రెడిట్ కార్డులకు లాస్ ఆఫ్ బ్యాకేజీ, పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్ లాంటి ఇన్స్యూరెన్స్ పొందొచ్చు.

క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇచ్చే ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకుంటే అనేక లాభాలుంటాయి. ఒకవేళ మీ క్రెడిట్ కార్డును ఎవరైనా దొంగిలిస్తే వెంటనే బ్యాంకుకు, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత కార్డుపై ఏవైనా లావాదేవీలు జరిగితే మీకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ మీరు లాస్ ఆఫ్ బ్యాగేజీ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే మీ బ్యాగేజీ పోయినా, అందులో వస్తువులు ఎవరైనా దొంగిలించినా ఇన్స్యూరెన్స్ పొందొచ్చు. ఇది చెక్డ్ ఇన్ బ్యాగేజీకి మాత్రమే వర్తిస్తుంది. కొన్ని కంపెనీలు హ్యాండ్ బ్యాగేజీకి కూడా ఇన్స్యూరెన్స్ ఇస్తుంటాయి. ఇక మీ బ్యాగేజీ ఆలస్యమైతే బ్యాగేజీ డిలే ఇన్స్యూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేయొచ్చు. బ్యాగేజీ రావడం ఆలస్యమైతే ఎయిర్‌లైన్ ప్రతినిధితో మాట్లాడి రాతపూర్వకంగా కన్ఫర్మేషన్ తీసుకొని క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు.

వాతావరణ పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మీరు రీఇంబర్స్ చేసుకోవచ్చు. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ముందు ఏఏ కారణాలకు బీమా కవర్ ఉందో తెలుసుకోవాలి. అయితే క్రెడిట్ కార్డులతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తేనే రీఇంబర్స్‌మెంట్ పొందొచ్చు. క్రెడిట్ కార్డ్ హోల్డర్ ప్రమాదవశాత్తు మరణిస్తే ఔట్‌స్టాండింగ్ బిల్లులో రూ.50,000 వరకు బీమా వర్తిస్తుంది. కంపెనీని బట్టి ఈ అమౌంట్ మారుతుంది. అయితే క్రెడిట్ కార్డులపై ఏఏ ఇన్స్యూరెన్స్‌లు ఉంటాయి? వాటిని ఎలా పొందాలి? అన్న వివరాలను క్రెడిట్ కార్డు తీసుకునే ముందే బ్యాంకును అడిగి తెలుసుకోవాలి.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలేCredit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? ఈ 5 ఫీచర్లు తెలుసుకోండి

Credit Card: మీరు వాడని క్రెడిట్ కార్డును ఇలా క్యాన్సిల్ చేయొచ్చు
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>