బైడెన్‌ను గుర్తించని Apple Siri...అభిమానుల ఆగ్రహం...

సుదీర్ఘ నిరీక్షణ తరువాత అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అనంతరం గత శనివారమే జో బైడెన్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా ప్రకటించారు. కానీ యాపిల్ యూజర్లు సిరిని అమెరికా అధ్యక్షుడి వయసు ఎంత అని అడిగినప్పుడు, అది కమలా హారిస్ పేరు చెబుతోంది.

news18-telugu
Updated: November 11, 2020, 5:47 PM IST
బైడెన్‌ను గుర్తించని Apple Siri...అభిమానుల ఆగ్రహం...
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్
  • Share this:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇది కొత్త విషయమేం కాదు. గత వారమే వారి ఎన్నికపై ఒక స్పష్టత వచ్చింది. కానీ యాపిల్ సంస్థకు చెందిన వర్చువల్ అసిస్టెంట్ సిరి మాత్రం ఈ విషయాన్ని గుర్తించలేదు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అనంతరం గత శనివారమే జో బైడెన్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా ప్రకటించారు. కానీ యాపిల్ యూజర్లు సిరిని అమెరికా అధ్యక్షుడి వయసు ఎంత అని అడిగినప్పుడు, అది కమలా హారిస్ పేరు చెబుతోంది.
దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంటనే అది వైరల్‌గా మారింది. యాపిల్ వినియోగదారులు సిరిని ‘అమెరికా అధ్యక్షుడి వయపెంత?’ అని అడిగినప్పుడు.. ‘కమలా హారిస్ 56 సంవత్సరాల క్రితం అక్టోబర్ 20, 1964న మంగళవారం రోజున జన్మించారు’ అని సమాధానం ఇస్తోంది. జో బైడెన్ గురించి కానీ, ఇంకా అధ్యక్షుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ గురించి కానీ సిరి ప్రస్తావించకపోవడం విశేషం.

లోపాన్ని సరిచేసిన యాపిల్
సిరిలో లోపాన్ని గుర్తించిన కొందరు వినియోగదారులు దాని గురించి ట్విట్టర్లో పంచుకున్నారు. దీంతో చాలామంది యాపిల్ యూజర్లు సిరిని అదే ప్రశ్న అడుగుతూ, అది ఇచ్చే సమాధానాన్ని రికార్డు చేసి ట్విట్టర్లో పెట్టారు. అమెరికా అధ్యక్షుడి వివరాలు కూడా సిరి గుర్తించకపోవడమేంటని చాలామంది అభిమానులు యాపిల్‌పై నిరసన వ్యక్తం చేశారు. సిరిలో బయటపడ్డ ఈ లోపాన్ని యాపిల్ సరిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సిరి సరైన సమాధానం ఇస్తోంది.

https://twitter.com/aubrey_huff/status/1325641914868092928?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1325641914868092928%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fnews%2Fbuzz%2Fapples-siri-thinks-kamala-harris-is-the-new-us-president-fixes-glitch-after-videos-go-viral-3068606.html

https://twitter.com/malachiobrien/status/1325637540993523713?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1325637540993523713%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fnews%2Fbuzz%2Fapples-siri-thinks-kamala-harris-is-the-new-us-president-fixes-glitch-after-videos-go-viral-3068606.html

https://twitter.com/Joy_Villa/status/1325640909762031622?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1325640909762031622%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fnews%2Fbuzz%2Fapples-siri-thinks-kamala-harris-is-the-new-us-president-fixes-glitch-after-videos-go-viral-3068606.html

https://twitter.com/vrad__/status/1325644376022933509?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1325644376022933509%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fnews%2Fbuzz%2Fapples-siri-thinks-kamala-harris-is-the-new-us-president-fixes-glitch-after-videos-go-viral-3068606.html

ఆకట్టుకున్న కమలా విక్టరీ స్పీచ్
అమెరికా చరిత్రలో మొదటిసారి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మహిళగా కమలా హారిస్ రికార్డు సాధించింది. గత శనివారం ఆమె ఇచ్చిన విక్టరీ స్పీచ్ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆమె అమెరికాకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. ఒక మహిళను ఉపాధ్యక్ష స్థానానికి ఎంపిక చేసినందుకు ఆమె బిడెన్‌ను ప్రశంసించారు. "నేను ఈ స్థానానికి ఎన్నికైన మొదటి మహిళను. కానీ చివరి మహిళను మాత్రం కాబోను. ఎందుకంటే ఈ రాత్రి మా స్పీచ్ చూసే ప్రతి చిన్న అమ్మాయి ఇది అవకాశాల దేశం అని గుర్తిస్తుంది" అని చెప్పిన మాటలు అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Published by: Krishna Adithya
First published: November 11, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading