Home /News /business /

APPLES SHARE IN THE SMARTPHONE MARKET IN INDIA DOUBLED IN THE DECEMBER QUARTER NS GH

iPhone Sales: సేల్స్ లో దుమ్ములేపుతున్న ఆపిల్ ఫోన్.. కష్టకాలంలోనూ ఇదే హాట్ కేక్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అతిపెద్ద హాట్ కేక్ గా అవతరించింది ఆపిల్ (Apple). అత్యధిక జనాభా కలిగిన మన భారతదేశంలో ఆపిల్ ఫోన్ అంటే క్రేజు చూపనివారుండరు . అందుకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ లో ఆపిల్ ఏకంగా డబుల్ షేర్ ను సంపాదించుకుంది.

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అతిపెద్ద హాట్ కేక్ గా అవతరించింది ఆపిల్ (Apple). అత్యధిక జనాభా కలిగిన మన భారతదేశంలో ఆపిల్ ఫోన్ అంటే క్రేజు చూపనివారుండరు . అందుకే స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ లో ఆపిల్ ఏకంగా డబుల్ షేర్ ను సంపాదించుకుంది. డిసెంబర్ క్వార్టర్ కల్లా ముగిసిన సేల్స్ ను చూస్తే ఆపిల్ షేర్ గణనీయంగా పెరగటం విశేషం. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూస్తే ఆపిల్ సేల్స్ హాట్ కేక్స్ ను తలపిస్తున్నాయి. iphone 11, iphone 12, XR మోడల్స్ అత్యధికంగా అమ్ముడుపోవటంతోనే ఇదంతా సాధ్యమైంది. మార్కెట్ ఇంటెలిజన్స్ ఫర్మ్ సైబర్ మీడియా రీసర్చ్ (CMR) విశ్లేషిస్తున్నదాని ప్రకారం Q4లో ఆపిల్ కంపెనీ మన మార్కెట్లో బ్రహ్మాండంగా పుంజుకుంది. మన మార్కెట్లో iphone 12 ఆలస్యంగా లాంచ్ అయినప్పటికీ కనివినీ ఎరుగని రేంజ్ లో అమ్ముడుబోయాయి. 1.5 మిలియన్ల ఫోన్లను యాపిల్ మనదేశంలోకి ఎగుమతి చేయగా ఫెస్టివ్ సీజన్ సేల్స్ లో ఇవి మన కస్టమర్లను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ టెక్ జెయింట్ బిజినెస్ 2020లో 60శాతానికి ఎగబాకింది. 2020లో మొత్తం 3.2 మిలియన్ల iphoneలను కంపెనీ షిప్ చేసింది.

ఐపాడ్లు కూడా..
కేవలం ఐఫోన్లు మాత్రమే కాదు ఆపిల్ ఇతర ప్రాడక్ట్స్ అయిన ఐప్యాడ్లు కూడా బాగా అమ్ముడుపోయాయి. Q4 25శాతం ఎక్కువ iPads అమ్ముడయ్యాయి. 2020 మొత్తం ఏడాదిలో అయిన సేల్స్ కంటే ఇది 17శాతం ఎక్కువ. ఇక గతేడాదితో పోల్చితే ఇది మరింత ఎక్కువ. 2020లో Q4 లో 42శాతం ipadసేల్స్ పెరిగాయి. 2020ఇయర్లీ సేల్స్ విషయానికి వస్తే ఇది 135శాతం ఉండటం మరో హైలైట్ అని CMR సంస్థ వెల్లడిస్తోంది.

Apple Store Onlineలో భారత్ లోకి అందుబాటులోకి రావటం కూడా ఇందుకు ఒక కారణంగా ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ (Tim Cook) వెల్లడించారు. సరికొత్త 5G- కేపబుల్ iphone ఫోర్త్ క్వార్టర్ లో అద్భుతమైన సేల్స్ నమోదు చేసుకోవటం తమ సంస్థకు సరికొత్త జోష్ తెచ్చిందని టిమ్ కుక్ సంతోషం వ్యక్తంచేశారు. ఫ్లాగ్షిప్ రీటైల్ స్టోర్సు భారత్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సేల్స్ మరింత పుంజుకుంటాయని కుక్ అంచనా వేస్తున్నారు.

మరింత పుంజుకుంటాయి..
చైనా నుంచి మనదేశానికి మానుఫాక్చరింగ్ యూనిట్లను తరలించటంతో పాటు వియత్నాంలోని ప్లాంట్ల ద్వారా యాపిల్ ఉత్పత్తులు అతిత్వరలో మార్కెట్ కు చేరనున్నాయి. బెంగళూరు, చెన్నై సమీపంలో మనదేశంలో యాపిల్ యూనిట్లను ఇప్పటికే ప్రారంభించారు. స్మార్ట్ స్పీకర్లు, ఇయర్ ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఇతర పరికరాలు కూడా చైనా వెలుపల తయారు చేసేందుకు కసరత్తులు జోరుగా సాగుతున్నాయి.

ఇక 5G ఫోన్లలో యాపిల్ కు ధీటుగా ఏ ఇతర సంస్థలు పెద్దగా కస్టమర్లను ఆకట్టుకోలేక పోవటం, ఆవిష్కరణల విషయానికి వస్తే యాపిల్ అత్యుత్తమంగా ఉండటం వంటివి ఈ కంపెనీకి కలిసి వస్తున్న అంశాలుగా మారాయి. యాపిల్ ప్రాడక్ట్స్ స్టేటస్ సింబల్ గా భావిస్తున్న యువత వీటిని సొంతం చేసుకునేందుకు అత్యుత్సాహం కనబరుస్తుండటంతో ఆపిల్ సేల్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుబోతున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, India, Iphone, Mobile, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు