Apple Tv, News App : త్వరలోనే యాపిల్ టీవీ ఛానల్స్ లాంచ్..

టెక్ దిగ్గజం యాపిలో మరో సంచలనం సృష్టించబోతోందింది. త్వరలోనే యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ని లాంచ్ చేయనుంది.

Amala Ravula | news18-telugu
Updated: March 27, 2019, 6:56 PM IST
Apple Tv, News App : త్వరలోనే యాపిల్ టీవీ ఛానల్స్ లాంచ్..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 27, 2019, 6:56 PM IST
యాపిల్ సంస్థ మరో రికార్డు క్రియేట్చేయబోతోంది. తన సర్వీస్ పోర్టిఫోలియోను విస్తరించుకుని వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు టీవీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛాన్సల్స్‌ని ఆవిష్కరించింది. అంతేకాదు.. ఆ దారిలోనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకురానుంది. దీంతో బిజినెస్ రంగంలో తిరుగులేని సంస్థగా చక్రం తిప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది యాపిల్.
యాపిల్ టీవీ ప్లస్
స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వీడియో సర్వీస్ అయిన యాపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా సేవలందిస్తుంది. కంపెనీకి సంబంధించిన వర్జినల్ కంటెంట్ ఉంటుంది.

యాపిల్ న్యూస్
యాప్ యాపిల్ న్యూస్ ప్లస్ అనేది న్యూస్ యాప్.. వివిధ మేగజైన్ల కంటెంట్ ఇందులో ఉంటుంది. వైల్డ్, పాపులర్ సైన్స్, నేషనల్ జాగ్రఫీ అండ్ ఎసెన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈ కంటెంట్ ఉంటుంది.
యాపిల్ క్రెడిట్ కార్డు


గోల్డ్‌మన్ శాక్స్‌ భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది ఆపిల్. ఈ కార్డ్స్ మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేస్తుంది.
First published: March 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...