Home /News /business /

APPLE TALKS WITH HYUNDAI KIA ON ELECTRIC CAR PAUSED RECENTLY MK

Apple Car: యాపిల్ కారు కథ కంచికి...హ్యుందాయ్ నుంచి కీలక ప్రకటన ఇదే...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్మించడం గురించి ఆపిల్ సంస్థ హ్యుందాయ్, కియా మోటార్స్ కార్పొరేషన్‌తో చర్చలు జరిపుతుండగా, ఆ చర్చలు అర్థాంతరంగా ఆగిపోయినట్లు హ్యుందాయ్ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని చర్యలు ఇంకా చర్చదశలోనే నిలిచిపోయాయని హ్యుందాయ్ సంస్థ తెలిపింది.

ఇంకా చదవండి ...
    ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్మించడం గురించి ఆపిల్ సంస్థ హ్యుందాయ్, కియా మోటార్స్ కార్పొరేషన్‌తో చర్చలు జరిపుతుండగా, ఆ చర్చలు అర్థాంతరంగా ఆగిపోయినట్లు హ్యుందాయ్ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి అన్ని చర్యలు ఇంకా చర్చదశలోనే నిలిచిపోయాయని హ్యుందాయ్ సంస్థ తెలిపింది. ఆపిల్ ఇతర ఆటో తయారీదారులతో కూడా ఇలాంటి ప్రణాళికలను చర్చిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి చర్చల విషయంలో ఎలాంటి గోప్యతా పాటించడం లేదని హ్యుందాయ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ రహస్య ప్రాజెక్ట్ గురించి మీడియాలో ఇటీవలి నెలల్లో చర్చ బాగా నడిచింది. ఇది ఆటోమోటివ్ పరిశ్రమలో ఒక విప్లవంగా మారుతుందని అంతా భావించారు. అయితే ఈ అంశంపై ఆపిల్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. జనవరిలో, కియాలో నియంత్రణ వాటాను కలిగి ఉన్న హ్యుందాయ్, ఆపిల్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రకటన ఇచ్చి, ఇఫ్పుడు దాని నుంచి తప్పుకుంది.

    నిజానికి ఎలక్ట్రిక్ కారు గురించి చర్చల నివేదికలు ఆపిల్‌ను కలవరపరిచాయి, యాపిల్ సంస్థ తన అభివృద్ధి ప్రాజెక్టులను సంవత్సరాలుగా రహస్యంగా ఉంచుతుంది. అయితే ఆపిల్, హ్యుందాయ్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అయితే వాహనాల తయారీ సామర్థ్యం కలిగిన గ్లోబల్ వాహన తయారీదారులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారిలో ఎంతమంది ఆపిల్‌తో సహకరించడానికి ఆసక్తి చూపుతారో అస్పష్టంగా ఉంది.

    అయితే అటు హ్యుందాయ్ గ్రూపులో దాని రెండు బ్రాండ్లలో హ్యుందాయ్, అలాగే కియా రెండింట్లో ఎవరు ఆపిల్ కోసం కారు తయారు చేయవచ్చనే దానిపై వివాదం ఉంది.  అయితే చర్చలు తిరిగి ప్రారంభమైతే, యాపిల్ కారు తయారీ చేసేందుకు కియాకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనబడుతున్నాయి. జార్జియాలోని తన ప్లాంట్లో ఆపిల్ కారును నిర్మించటానికి ప్రయత్నిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి.

    టెస్లా ఇంక్., జనరల్ మోటార్స్ కో మరియు ఇతర ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ఆపిల్ ఎంత తీవ్రంగా తీసుకుంటుందనేది పరిశ్రమకు ఒక ముఖ్యమైన ప్రశ్న.  కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో సంస్థ డ్రైవ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసే ఇంజనీర్లతో పాటు డిజైనర్లను కలిగి ఉంది. ఇరు సంస్థలు అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నందున, ఏదైనా రోల్ అవుట్ బహుశా మరో ఐదేళ్లపాటు ఉత్పత్తి బయటకు రాదు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Apple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు