ట్రేడ్ వార్ ఎఫెక్ట్... చైనాలో ఐఫోన్ అమ్మకాలు ఫట్

హువాయ్ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు... యాపిల్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలను దెబ్బతీయడం కూడా చైనా కంపెనీల లక్ష్యం. తమ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు యాపిల్ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదని ఇప్పటికే పలు సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి.

news18-telugu
Updated: December 25, 2018, 7:51 PM IST
ట్రేడ్ వార్ ఎఫెక్ట్... చైనాలో ఐఫోన్ అమ్మకాలు ఫట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికా చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్ ఇప్పుడు ఆ రెండు దేశాలకు చెందిన పలు దిగ్గజ కంపెనీలపై పడుతోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా పన్నులు వేయడం... ఇందుకు ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరింది. అయితే రెండు దేశాల మధ్య మొదలైన ట్రేడ్ వార్‌ను... ఆయా దేశాల్లోని కంపెనీలు కూడా పర్సనల్‌గా తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తమ దేశానికి చెందిన ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ హువాయ్ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం... కెనెడాలోని కంపెనీ సీఎఫ్‌వో మెంగ్ వాంగ్‌జూనే అమెరికా అరెస్ట్ చేయించడంపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సైబర్ సెక్యూరిటీ అంశాలకు సంబంధించిన వ్యవహారంలోనే సీఎఫ్‌వో మెంగ్ వాంగ్‌జూని అమెరికా అరెస్ట్ చేయించిందని చెబుతున్నా... ఇది కచ్చితంగా తమపై కక్ష సాధింపు చర్యే అని చైనా ప్రభుత్వం, చైనా కంపెనీలు రగిలిపోతున్నాయి.

trade war effect on economic output
ప్రతీకాత్మక చిత్రం


చైనాకు చెందిన హువాయ్ కంపెనీ ఉత్పత్తులను అమెరికా నిషేధించడంతో... ఇది కాస్తా జాతీయ అంశంగా మారిపోయింది. హువాయ్ కంపెనీ ఫోన్లను కొనేందుకు చైనాలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని కంపెనీ 10 నుంచి 20 శాతం డిస్కౌంట్లు ఇస్తుండగా... మరికొన్ని ఇందుకోసం పూర్తిస్థాయి డబ్బు ఇచ్చేందుకు కూడా ముందుకొస్తున్నాయి. హువాయ్ కంపెనీకి మద్దతుగానే చైనాకు చెందిన అనేక కంపెనీలు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని సంస్థలైతే హువాయ్ ఫోన్‌ల మొత్తంలోని 30 శాతం మద్యాన్ని ఉచితంగా అందించేందుకు కూడా ముందుకొచ్చాయి.

హువాయ్ కంపెనీ లోగో


హువాయ్ అనేది పేరుకు ప్రైవేటు కంపెనీ అయినా... ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే కంపెనీ కావడంతో చైనాలోని చాలా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం హువాయ్ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు... అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలను దెబ్బతీయడం కూడా చైనా కంపెనీల లక్ష్యం. తమ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు యాపిల్ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదని ఇప్పటికే పలు సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి.

మెన్‌పాడ్ అనే సంస్థ ఐఫోన్ కొనుగోలు చేస్తే అందుకు శిక్ష ఖాయమని బహిరంగంగానే ప్రకటించింది. మరికొన్ని కంపెనీలు ఐఫోన్ కొనుగోలు చేసే ఉద్యోగుల బోనస్‌లను పెండింగ్‌లో పెడతామని వార్నింగ్ ఇచ్చాయి. ఐఫోన్ మాత్రమే కాదు... అమెరికాకు చెందిన మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నాయి చైనా కంపెనీలు. ఇప్పటికే పలు ఐఫోన్ మోడల్స్‌లో క్వాల్‌కామ్‌కు పేటెంట్ గొడవల కారణంగా పలు మోడల్స్‌పై చైనా కోర్టు నిషేధం విధించింది.
Published by: Kishore Akkaladevi
First published: December 25, 2018, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading