Apple iPhone: ఐఫోన్ విక్రయాలు ఢమాల్...యాపిల్ పరేషాన్...

2018లో క్యూ1లో ఐఫోన్ ఎక్స్ లాంచ్ చేసిన తర్వాత కాస్త సేల్స్ పుంజుకున్నప్పటికీ గత క్వార్టర్ లో మాత్రం ఐఫోన్ సేల్స్ రూ.2.04 లక్షల కోట్ల నుంచి రూ.1.80 లక్షల కోట్లకు పతనమైంది.

news18-telugu
Updated: August 2, 2019, 3:10 PM IST
Apple iPhone: ఐఫోన్ విక్రయాలు ఢమాల్...యాపిల్ పరేషాన్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Apple iPhone: ఐఫోన్ సేల్స్ ఢమాల్ అంటున్నాయి. ముఖ్యంగా గడిచిన గత మూడేళ్లుగా యాపిల్ సంస్థ నుంచి వస్తున్న ఐఫోన్ రెవెన్యూ వరుసగా పడిపోతూ వస్తోంది. గత ఐదేళ్ల నికర సేల్స్ పరిశీలిస్తే దాదాపు 60 శాతం పడిపోయాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నరాు. 2018లో క్యూ1లో ఐఫోన్ ఎక్స్ లాంచ్ చేసిన తర్వాత కాస్త సేల్స్ పుంజుకున్నప్పటికీ గత క్వార్టర్ లో మాత్రం ఐఫోన్ సేల్స్ రూ.2.04 లక్షల కోట్ల నుంచి రూ.1.80 లక్షల కోట్లకు పతనమైంది. అయితే యాపిల్ కు చెందిన ఇతర ఉపకరణాలు మాత్రం అమ్మకాల్లో జోరుందుకున్నాయి. ఇదిలా ఉంటే 2012 నుంచి ఐఫోన్ సేల్స్ ద్వారా రెవెన్యూ దాదాపు 50 శాతం పతనమైంది. కాగా తాజాగా గురవారం నాస్డాక్ లో ట్రేడింగ్ ముగిసే సమయానికి యాపిల్ షేరు ధర రెండు శాతం పతనమైంది. మరోవైపు చైనాలో ఐఫోన్ సేల్స్ పతనం కూడా యాపిల్ రెవెన్యూ కోతకు కారణంగా కనిపిస్తోంది. ఫలితంగా యాపిల్ ప్రతీ త్రైమాసికంలో దెబ్బతింటూ వస్తోంది. అయితే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...