ఐఫోన్ లాభాల్లో కోత...చైనా దెబ్బకు లబోదిబోమంటున్న యాపిల్...

అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ యాపిల్ ఆర్థిక ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చైనాలో సేల్స్ పతనం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: July 31, 2019, 11:24 AM IST
ఐఫోన్ లాభాల్లో కోత...చైనా దెబ్బకు లబోదిబోమంటున్న యాపిల్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 31, 2019, 11:24 AM IST
యాపిల్ సంస్థ ప్రకటించిన మూడో క్వార్టర్ ఫలితాల్లో సంస్థ నికర లాభం 13 శాతానికి పతనమైంది. అంటే దాదాపు రూ.70 వేల కోట్లు నష్టాన్ని ప్రకటించింది. ప్రధానంగా అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ యాపిల్ ఆర్థిక ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా చైనాలో సేల్స్ పతనం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉపకరణాల సేల్స్ విషయంలో మాత్రం ఒక శాతం పెరుగుదల నమోదయ్యింది. 2012 తర్వాత ఐఫోన్ సేల్స్ ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక చైనాలో ఐఫోన్ సేల్స్ దాదాపు 4 శాతం పతనమయ్యాయి. అంటే దాదాపు రూ.50 వేల కోట్లు నష్టపోయింది. గత క్వార్టర్ లో ఈ సంఖ్య 22 శాతంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఐఫోన్ ధరలు చైనా మార్కెట్లో ఒక్కసారిగా పెరిగిపోవడం కూడా దీనికి ఒక కారణమని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే ఐఫోన్ సేల్స్ తగ్గినప్పటికీ, యాపిల్ ఇతర ఉపకరణాలు యాపిల్ వాచ్, యాపిల్ ఎయిర్ పాడ్స్, యాపిల్ స్టోర్, యాపిల్ పే, యాపిల్ టీవీ, యాపిల్ మ్యూజిక్ లో మాత్రం సేల్స్ పెరుగుదల కనిపంచింది. యాపిల్ ప్లే సబ్ స్క్రిప్షన్ దాదాపు 55 శాతం పెరగడం విశేషం.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...