Home /News /business /

Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ గురించి తాజా అప్​డేట్​.. టచ్ ఐడి అన్​లాక్ ఫీచర్ ఉండదట!

Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ గురించి తాజా అప్​డేట్​.. టచ్ ఐడి అన్​లాక్ ఫీచర్ ఉండదట!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా యాపిల్​ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. యాపిల్​ ఐఫోన్లకు మార్కెట్​లో విపరీతమైన క్రేజ్​ ఉంటుంది. అందుకే ఐఫోన్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోతాయి. ఇప్పటివరకు యాపిల్ 12 సిరీస్ వరకు ఐఫోన్లను విడుదల చేయగా.. ఇక, ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్​ కూడా రానుంది.

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా యాపిల్​ కంపెనీ ఉత్పత్తులకు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. యాపిల్​ ఐఫోన్లకు మార్కెట్​లో విపరీతమైన క్రేజ్​ ఉంటుంది. అందుకే ఐఫోన్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోతాయి. ఇప్పటివరకు యాపిల్ 12 సిరీస్ వరకు ఐఫోన్లను విడుదల చేయగా.. ఇక, ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్​ కూడా రానుంది. విడుదలకు సిద్ధమవుతున్న ఐఫోన్ 13కు సంబంధించిన కొన్ని ఫీచర్లు గతంలో ఆన్​లైన్​లో లీకయ్యాయి. దీనిలో- ఫేస్ ఐడి, టచ్ ఐడి వంటి బయోమెట్రిక్ ఆప్షన్లను ఇచ్చినట్లు నివేదికలు చెబుతూ వచ్చాయి. అంతేకాదు, ఈ సిరీస్​లో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 13లో టచ్ ఐడి ఫింగర్​ప్రింట్​ స్కానర్ ఉండదని, కేవలం ఫేస్​ అన్​లాక్​ ఫీచర్​ మాత్రమే ఉంటుందని తాజా నివేదిక పేర్కొంది.

సెప్టెంబర్​లో ఐఫోన్​ 13 సిరీస్​..

టచ్​ ఐడి ఫీచర్​పై ప్రముఖ టిప్​స్టర్​ బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ మాట్లాడుతూ ‘‘యాపిల్ ఐఫోన్‌లో టచ్ ఐడిని ఇంత త్వరగా తిరిగి తీసుకురాకపోవచ్చని భావిస్తున్నా. అయితే, రాబోయే సిరీస్​లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది” అని అన్నారు. కాగా, యాపిల్​ ఈ ఏడాది తమ ఐఫోన్ల కోసం అండర్-డిస్​ప్లే, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌ వంటివి టెస్ట్​ చేసింది. వీటిని ఐఫోన్​ 13లోనే అందిస్తారని అంతా భావించారు. కానీ, ఈ ఫీచర్లు ఐఫోన్​ 13 సిరీస్​లో కనిపించకపోవచ్చని తెలుస్తోంది.

ఇక, ఐఫోన్​ 13 సిరీస్​ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 120 హెర్ట్జ్ డిస్​ప్లేతో వస్తుంది. దీనిలో అద్భుతమైన బ్యాటరీని అందించనున్నారు. ఐఫోన్ 13 సిరీస్ డిజైన్​ దాదాపు ఐఫోన్ 12 సిరీస్‌కు సమానంగా ఉంటుంది. దీని కెమెరా మాడ్యూల్​ డిజైన్​లో తప్ప పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ మెరుగైన అల్ట్రా-వైడ్ కెమెరాలతో వస్తాయి. ఐఫోన్ 13 సిరీస్‌ సెప్టెంబర్‌లో విడులయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో కొత్త మాక్‌బుక్ ప్రో మోడల్​ కూడా విడుదల కానుంది. కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లు సెప్టెంబర్, నవంబర్ మధ్య మార్కెట్​లోకి రానున్నాయి.
Published by:Krishna Adithya
First published:

Tags: Iphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు