I phone 13 సిరీస్​లో Reverse Wireless Charging సపోర్ట్​.. ఎలా పనిచేస్తుందంటే ?

ప్రతకాత్మకచిత్రం

యాపిల్​ తన రాబోయే ఐఫోన్​ 13 మోడల్​లో ఈ సరికొత్త ఛార్జింగ్​ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఐఫోన్​ 13 సిరీస్​లో రివర్స్​ వైర్​లెస్​ ఛార్జింగ్​ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

  • Share this:
స్మార్ట్​ఫోన్ల వినియోగం నానాటికీ పెరిగిపోతుంది. అందులోనూ తాజా మోడళ్లను వాడేందుకే యూజర్లు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్​లో ఏ కొత్త ఫోన్​ వచ్చినా దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని మొబైల్​ తయారీ సంస్థలు యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ బ్యాకప్​ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. తక్కువ సమయంలోనే ఫుల్​ ఛార్జ్​ అయ్యేలా బ్యాటరీని రూపొందిస్తున్నాయి. యూజర్ల నుంచి ఇటువంటి ఫోన్లకు మంచి డిమాండ్​ ఉంటోంది. దీంతో ప్రీమియం మొబైల్​ తయారీ సంస్థ యాపిల్​ తన రాబోయే ఐఫోన్​ 13 మోడల్​లో ఈ సరికొత్త ఛార్జింగ్​ టెక్నాలజీని ఉపయోగించనుంది. ఐఫోన్​ 13 సిరీస్​లో రివర్స్​ వైర్​లెస్​ ఛార్జింగ్​ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీని ద్వారా యూజర్లు తమ ఎయిర్‌పాడ్‌లను ఐఫోన్‌తో ఛార్జ్ చేయడానికి వీలు కలుగుతుంది.

2017లో సంస్థ ప్రవేశపెట్టిన ఐఫోన్ X, ఐఫోన్ 8, 8 ప్లస్ మోడళ్లలో వైర్‌లెస్ ఛార్జింగ్‌ టెక్నాలజీని అందించింది. అప్పటి నుంచి యాపిల్ అన్ని ఐఫోన్ మోడళ్లలో వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్​ను అందిస్తూ వస్తోంది. అయితే రివర్స్​ ఛార్జింగ్​ టెక్నాలజీపై పనిచేయడం మాత్రం ఇదే ప్రథమం. ఐఫోన్ 12 సిరీస్‌లోనే ఈ రివర్స్​ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని తొలుత పుకార్లు వచ్చినప్పటికీ అవన్నీ ఊహాగానాలేనని తేలింది. అయితే, రాబోయే ఐఫోన్ 13 మోడళ్లలో మాత్రం ఈ టెక్నాలజీని కచ్చితంగా అందించే అవకాశం ఉంది.

రివర్స్ ఛార్జింగ్ అనేది వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను చార్జ్​ చేసే విధంగానే పనిచేస్తుంది. 9to5Mac నివేదిక ప్రకారం, ఈ టెక్నాలజీని శామ్‌సంగ్ వంటి ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలోనూ ఉపయోగించనున్నారు. కాగా వీన్‌బాచ్ నివేదిక ప్రకారం, రాబోయే ఐఫోన్ 13 మోడళ్లు వైర్‌లెస్ ఛార్జింగ్ కాయిల్‌తో రానున్నాయి. ఈ మాగ్‌సేఫ్ ఐఫోన్ 11 కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 15W ఛార్జింగ్ స్పీడ్​ను అందిస్తుంది. ఇదిలా ఉంటే, ఐఫోన్ 12 సిరీస్‌లో మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు.

ఐఫోన్​తో పాటే ఎయిర్​పాడ్​ ఛార్జింగ్​..
కాగా, ఐఫోన్ వెనుక భాగంలో రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చేందుకుపెద్ద కాయిల్​ని అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్​ ఎరా విడుదల చేసిన తాజా వీడియోలో పేర్కొంది. ఐఫోన్ 12 సిరీస్ ఎఫ్‌సిసి ఫైలింగ్స్ ఆధారంగా రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుందని వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, రాబోయే ఐఫోన్ 13 సిరీస్​లో యాపిల్ iOS 15 టెక్నాలజీ ఉపయోగించనున్నారు. కొత్త తరం స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌లు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యాలు, అధిక రిఫ్రెష్ రేట్లు, స్పీకర్ గ్రిల్‌ వంటి ఫీచర్లతో ఐఫోన్ 13 సిరీస్​ మోడళ్లను కంపెనీ విడుదల చేయనుంది. ఏదేమైనా, యాపిల్​కు చెందిన నెక్ట్స్​ జనరేషన్ ఐఫోన్​ మోడళ్లలో ఈ రివర్స్​ ఛార్జింగ్​ టెక్నాలజీని చేర్చనుంది. ఐఫోన్​ 13 సిరీస్​ సెప్టెంబర్​లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇది చూడండి..

ఇది చూడండి..
Published by:Krishna Adithya
First published: