ఐఫోన్ లవర్స్ కు శుభవార్త.. కొద్ది గంటల్లో Apple iPhone 12 Mini, iPhone 12 Pro Max బుకింగ్స్ ప్రారంభం

news18-telugu
Updated: November 6, 2020, 2:24 PM IST
ఐఫోన్ లవర్స్ కు శుభవార్త.. కొద్ది గంటల్లో Apple iPhone 12 Mini, iPhone 12 Pro Max బుకింగ్స్ ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐఫోన్ లవర్స్ కు ఆపిల్ కంపెనీ శుభవార్త చెప్పింది. Apple 12 mini, Apple 12 Pro Max ఫోన్లను త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి ఆపిల్ ఆన్లైన్ స్టోర్స్, ఆపిల్ అధికారిక రిటైల్ షాపుల్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అధికారిక ఆన్ లైన్ స్టోర్ లో ఆపిల్ ఇతర స్మార్ట్ ఫోన్ల ఎక్సేంజ్ పై రూ. 22 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఐఫోన్ మాక్స్ పై రూ. 34 వేల వరకు ఈ డిస్కైంట్ ఉండనుంది. ఈ రెండు ఫోన్లలో ఒకటి ఈ ఏడాదిలో విడుదల కానున్న అత్యంత చౌకన ఐఫోన్ కాగా, మరొకటి అత్యంత ఖరీదైన ఫోన్ అని తెలుస్తోంది. ఐఫోన్ 12 మినీ ఐదు వేర్వేరు కలర్లలో అందుబాటులోకి రానుంది. రెండ్, వైట్, గ్రీన్, బ్లూ, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ ఉండనుంది. ఐఫోన్ 12 ప్రో మాక్స్ నాలుగు వేర్వేరు కలర్లలో రానుంది. గ్రాఫైట్, సిల్వర్, గోల్డ్, పసిఫిక్ బ్లూ రంగుల్లో విడుదల కానుంది.

ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ.69 వేలు. ఈ ఫోన్ మెమోరీ 64జీబీ. 128 మెమోరీ కలిగిన ఫోన్ ధర రూ. 74 వేలు. 256 జీబీ ఫోన్ ధర రూ. 84 వేలు. ఇక ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఐఫోన్ విషయానికి వస్తే.. 128 జీబీ మెమోరీ కలిగిన ఫోన్ ధర రూ.1, 29,000, 256 జీబీ మెమోరీ కలిగిన ఫోన్ ధర రూ. 1,39,000. ఇక 512 జీబీ ఫోన్ ధర రూ.1,59,900. ఈ ధరల ఆధారంగా ఐఫోన్ 12 ఈ ఏడాది అతి తక్కువ ధరలో అందుబాటులోకి రానున్న ఐఫోన్ కాగా.. ఐఫోన్ 12 ప్రో మాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్ అని స్పష్టంగా చెప్పవచ్చు.

హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి ఆపిల్ ఆథరైజ్డ్ రిటైల్ షాపుల్లో ధరలో డిస్కౌంట్ రానుంది. ఐఫోన్ 12 మినీపై రూ. 6 వేలు, ఐఫోన్ 12 ప్రో మాక్స్ పై రూ. 5 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి సైతం పలు ఆఫర్లు ఉన్నాయి. ఈ ఐఫోన్లనుహెచ్డీఎఫ్సీ డెబిడ్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. ఈ ఐఫోన్ల కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ సైతం అందించనున్నారు. జీరో డౌన్ పేమెంట్ తో ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Published by: Nikhil Kumar S
First published: November 6, 2020, 2:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading