కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరగడంతో ట్యాబ్లెట్ల కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ (Apple iPad) ప్రో 2 ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది.
కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరగడంతో ట్యాబ్లెట్ల కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ (Apple iPad) ప్రో 2 ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. దీనిలో కళ్లు చెదిరే ఫీచర్లను అందించింది. అయితే ఎక్కువ ధర కారణంగా ఈ ట్యాబ్లెట్ కొనలేకపోయిన వారికి యాపిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో పండుగ సీజన్ సందర్భంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival Sale) దీనిపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు యాపిల్ ఐప్యాడ్ ప్రో 2 ట్యాబ్లెట్ కొనుగోలుపై దాదాపు రూ. 15 వేల డిస్కౌంట్ పొందవచ్చు.
యాపిల్ 2021 ఐప్యాడ్ ప్రో అసలు ధర రూ.1,84,990 వద్ద ఉండగా.. అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో దీన్ని రూ. 1,69,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ వైఫై, సెల్యులార్ నెట్‌వర్క్‌తో పనిచేస్తుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ టాబ్లెట్లలో యాపిల్ ఐప్యాడ్ ప్రో 2 ఒకటి. ఇది హై పర్ఫార్మెన్స్, పోర్టబిలిటీ ఆప్షన్లతో వస్తుంది. ఈ ప్రీమియం ఐప్యాడ్ ప్రో ట్యాబ్లెట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇది 2 విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. స్పేస్ గ్రే, సిల్వర్ అనే కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
మొత్తం రెండు కలర్ వేరియంట్లలో లభ్యం..
యాపిల్ ఐప్యాడ్ ప్రో 11 అంగుళాల పెద్ద లిక్విడ్ రెటినా డిస్ప్లేతో వస్తుంది. ఇది స్పష్టమైన దృశ్యాలను అందిస్తుంది. మరోవైపు, దీని డిస్ప్లే యాపిల్ పెన్సిల్‌తో ఆపరేట్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు నోట్స్ రాసుకోవడానికి, పిక్చర్ గీయడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిలోని స్మార్ట్ కీబోర్డ్‌తో ఈజీ టైపింగ్ చేయవచ్చు. ఐప్యాడ్ ప్రో ట్యాబ్లెట్లో 2TB ఇంటర్నల్ మెమరీని అందించింది. ఇది M1 చిప్సెట్తో వస్తుంది. ఈ చిప్సెట్ అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది.
ఇందులో ఇన్ బిల్ట్ 12- మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 10 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలను అందించింది. ఈ ట్యాబ్లెట్‌కి 1080p హెచ్డీ క్వాలిటీ గల వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉంటుంది. దీనిలో అధిక సామర్థ్యం గల బ్యాటరీని అందించింది. సాధారణ వినియోగంపై 10 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. వీటికి అదనంగా, ఐప్యాడ్ ప్రోలో నాలుగు ఆడియో స్పీకర్లు, 5 హై క్వాలిటీ మైక్రోఫోన్లను అందించింది. సెక్యూర్ అథెంటికేషన్ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను చేర్చింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.