Home /News /business /

APPLE EVENT 2021 EVERYTHING ANNOUNCED AT SPRING LOADED HERE FULL DETAILS NS GH

Apple Event 2021: వర్చువల్​ విధానంలో యాపిల్ ఈవెంట్ 2021.. ఈసారి కొత్తగా విడుదలైన పరికరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్ 2021 ఈవెంట్​ ఏప్రిల్​ 20న కనుల పండువగా జరిగింది. ఈ సారి ‘స్ప్రింగ్ లోడెడ్’ పేరుతో జరిగిన ఈ ఈవెంట్​లో అందరూ ఊహించినట్లుగానే ఎన్నో కొత్త డివైజ్‌లను ఆవిష్కరించింది యాపిల్​ సంస్థ.

యాపిల్​ లవర్స్​ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన యాపిల్ 2021 ఈవెంట్​ నిన్న (ఏప్రిల్​ 20) జరిగింది. కరోనా నేపథ్యంలో వర్చువల్​ విధానంలో జరిగిన ఈ ఈవెంట్​ను అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న కుపెర్టినో యాపిల్ క్యాంపస్​లో నిర్వహించారు. ఈ సారి ‘స్ప్రింగ్ లోడెడ్’ పేరుతో జరిగిన ఈ ఈవెంట్​లో అందరూ ఊహించినట్లుగానే ఎన్నో కొత్త డివైజ్‌లను ఆవిష్కరించింది యాపిల్​ సంస్థ. యాపిల్​ 2021 ఈవెంట్​లో కొత్తగా ఆవిష్కరించిన డివైజ్‌లపై ఒక లుక్కేయండి.

1. కాలిఫోర్నియాలోని లా హబ్రాలో విడుదల చేసిన ఫోటోల ప్రకారం, యాపిల్ వర్చువల్ ఈవెంట్​లో ఎయిర్‌ట్యాగ్ ట్రాకింగ్ డివైజ్​ను ఆవిష్కరించింది.

2. యాపిల్​ వర్చువల్ ఈవెంట్​ 2021లో కొత్త ఐమాక్ కంప్యూటర్​ను ఆవిష్కరించింది.

3. యాపిల్ వర్చువల్ ఈవెంట్ 2021లో సిరి రిమోట్‌ సపోర్ట్​ కలిగిన కొత్త యాపిల్ 4 కె టీవీని ఆవిష్కరించింది.

4. యాపిల్​ ఈవెంట్​లో ఉదా రంగులో ఉన్న కొత్త ఐఫోన్ 12 మోడళ్లను పరిచయం చేసింది.

5. యాపిల్​ ఈవెంట్​లో కొత్త ఐప్యాడ్ ప్రోని ఆవిష్కరించింది.

6. యాపిల్​ ఈవెంట్​లో కొత్త ఐమాక్ కంప్యూటర్లను ఆవిష్కరించింది.

7. యాపిల్ ఈవెంట్​లో కొత్త ఐప్యాడ్ ప్రో డివైజ్​ను ప్రవేశపెట్టింది. ఇందులో బ్రేక్​ థ్రూ M1 చిప్, అల్ట్రా-ఫాస్ట్ 5 జి, అద్భుతమైన 12.9 -అంగుళాల లిక్విడ్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్​ప్లేని అందించింది.

8. యాపిల్​ ఈవెంట్​లో వివిధ రంగుల్లో ఉన్న కొత్త ఐమాక్ కంప్యూటర్​ను సంస్థ ఆవిష్కరించింది. ఈ కంప్యూటర్లు​ అద్భుతమైన డిజైన్, బ్రేక్​ థ్రూ M1 చిప్, 4.5 కె రెటినా డిస్​ప్లేలను కలిగి ఉంటాయి. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ వర్చువల్ ఈవెంట్​లో కొత్త ఉత్పత్తులను ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సంస్త విడుదల చేసింది.

9. యాపిల్​ ఈవెంట్​లో యాపిల్ నెక్స్ట్​ జనరేషన్​ టీవీ 4 కెను కూడా ఆవిష్కరించింది. టీవీ షోలు, సినిమాలు చూసే సమయంలో ఇది అద్భుతమైన ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుంది.

10. యాపిల్ ఈవెంట్​లో ఎయిర్‌ట్యాగ్‌ను కూడా పరిచయం చేసింది. ఈ చిన్న పరికరం ద్వారా ఐఫోన్ యూజర్లు తమ ఫోన్​లోని ‘ఫైండ్ మై యాప్​’ను ఉపయోగించి వారి విలువైన వస్తువులను గుర్తించవచ్చు. అంతేకాక, వాటిని సులభంగా ట్రాక్ చేయవచ్చు.

11. యాపిల్​ ఈవెంట్​లో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీలను ఉదా రంగుల్లో కూడా ఆవిష్కరించింది.

12. యాపిల్ కార్డ్ ఫ్యామిలీని పరిచయం చేసింది. ఈ యాపిల్ కార్డ్‌ ద్వారా ప్రజలు తమ క్రెడిట్‌ను నిర్మించడానికి వీలు కలుగుతుంది.

13. యాపిల్ పోడ్​ కాస్టింగ్​ను ఆవిష్కరించింది. ఇది ఐఫోన్​ యూజర్స్​కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, California

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు