ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతన ప్యాకేజీ@ రూ.111 కోట్లు

ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ వార్షిక జీతభత్యాలు 2018లో గణనీయంగా పెరిగాయి. జీతం, బోనస్, ఇతర వసతుల కోసం ఆపిల్ సంస్థ టిమ్ కుక్‌కు ఏకంగా రూ.111 కోట్లు చెల్లించింది.

news18-telugu
Updated: January 10, 2019, 11:49 AM IST
ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతన ప్యాకేజీ@ రూ.111 కోట్లు
ఆపిల్ సీఈవో టిమ్ కుక్
news18-telugu
Updated: January 10, 2019, 11:49 AM IST
ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ వార్షిక జీతభత్యాలు 2018లో గణనీయంగా పెరిగాయి. ఆపిల్ సంస్థ లాభాల పంటపండించడంతో...ఆ సంస్థ 1 ట్రిల్లియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న తొలి అమెరికా కంపెనీగా గత ఏడాది రికార్డు సృష్టించడం తెలిసిందే. ఆ సంస్థ భారీ లాభాలు ఆర్జిస్తుండడంతో సీఈవో టిమ్ కుక్ వార్షిక జీతభత్యాల ప్యాకేజీ కూడా గణనీయంగా పెరిగింది. 12 మిల్లియన్ డాలర్ల బోనస్‌ను కలుపుకుని టిమ్ కుక్ ఆపిల్ సంస్థ నుంచి 2018లో మొత్తం 15.7 మిల్లియన్ డాలర్లు (రూ.111 కోట్లు) ప్యాకేజీగా పొందినట్లు డెడ్‌లైన్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.

ఇందులో 3 మిల్లియన్ డాలర్లు(రూ.21 కోట్లు) జీతంకాగా, మిగిలిన 12 మిల్లియన్ డాలర్లు(రూ.84.6 కోట్లు) ఇన్సెటివ్స్ రూపంలో అందుకున్నారు. మరో 6,82,000 డాలర్లు(రూ.4.81 కోట్లు)ను ప్రైవేటు సెక్యూరిటీ, ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్ తదితర ఇతరత్ర వసతుల కోసం ఆపిల్ సంస్థ ఆయనకు చెల్లించింది. ఈ మేరకు ఆపిల్ సంస్థ యుఎస్ సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు ఓ నివేదికను సమర్పించింది.

2017తో పోల్చితే టిమ్ కుక్‌కు బోనస్ రూపంలో కంపెనీ నుంచి వచ్చే ఆదాయం 16 శాతం పెరిగింది. మొత్తం జీతభత్యాల్లో 22 శాతం పెంపు నమోదయ్యింది.  ఆపిల్ సీఎఫ్‌వో లూసా మేస్ట్రి, చీవోవో జెఫ్ విల్లియమ్స్, రీటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏంజెలా అహ్‌రెడ్స్‌లు కూడా 2018లో 26.5 మిల్లియన్ డాలర్లను అదనపు బోనస్‌గా పొందారు. టిమ్ కుక్ వార్షిక జీతభత్యాల ప్యాకేజీ సగటు అమెరికన్ ఉద్యోగి వేతనం కంటే సుమారు 250 రెట్లు ఎక్కువ కావడం విశేషం.

First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు