Home /News /business /

APPLE ADDS THREE NEW FEATURES TO FACETIME CALLS MK GH

FaceTime: ఫేస్‌టైమ్ కాల్స్‌కు మూడు కొత్త ఫీచర్లను జోడించిన Apple.. ఎలా పనిచేస్తాయంటే

Apple iPhone

Apple iPhone

ఫేస్‌టైమ్‌ను విండోస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల నిర్వహించిన డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో దీన్ని యాపిల్ ప్రదర్శించింది.

ఐఓఎస్15 అప్‌డేట్‌తో కొత్తగా ఆవిష్కరించిన ఫేస్‌టైమ్‌ వీడియో మీటింగ్స్ ప్లాట్‌ఫాంకు యాపిల్ మార్పులు, చేర్పులు చేస్తోంది. ఫేస్‌టైమ్‌ను జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో మీటింగ్ ప్లాట్‌ఫాంలకు పోటీగా నిలబెట్టాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వివిధ రకాల ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూ, యూజర్ల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఫేస్‌టైమ్‌ను విండోస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల నిర్వహించిన డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో దీన్ని యాపిల్ ప్రదర్శించింది. ఆండ్రాయిడ్, విండోస్‌లకు విస్తరించడంతో పాటు, ఈ ప్లాట్‌ఫామ్‌కు కొన్ని కొత్త ఫీచర్లను జోడించినట్లు సంస్థ ప్రకటించింది. ఫేస్‌టైమ్‌లో మొత్తం మూడు విభాగాల్లో కొత్త ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

షేర్‌ ప్లే
ఫేస్‌టైమ్‌లో కంటెంట్‌ షేరింగ్‌ను సలుభతరం చేసేందుకు యాపిల్ షేర్‌ప్లే ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఫేస్‌టైమ్ కాల్ కొనసాగుతున్నప్పుడు కూడా యూజర్లు మ్యూజిక్, సినిమాలు, టీవీ షోలు.. వంటి వాటిని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. కాల్‌లో ఉన్నప్పుడు యూజర్లు అందరూ కలిసి ఈ కంటెంట్‌ను చూడవచ్చు. దీంతోపాటు వెబ్ పేజీలు, యాప్‌లను కాల్‌లో ఉన్న వారికి పంపవచ్చు. ఈ ఫీచర్‌ బిజినెస్ మీటింగ్స్‌కు ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కొత్త ఆడియో ఫీచర్లు
ఫేస్‌టైమ్‌కి కొత్త వాయిస్ ఐసోలేషన్ ఫీచర్‌ను సైతం యాపిల్ జోడిస్తోంది. ఈ ఫీచర్.. కాల్‌లో ఉన్నప్పుడు వినిపించే బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను తగ్గిస్తుంది. కాల్‌ రిసీవర్లకు ఎదురయ్యే ఇబ్బందులను ఈ ఫీచర్ తగ్గిస్తూ, మరింత క్లారిటీగా మీటింగ్ కొనసాగేలా చేస్తుంది. దీంతోపాటు కాల్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వడానికి స్పేషియల్ ఆడియో (Spatial audio) ఫీచర్ కూడా ఫేస్‌టైమ్‌లో అందుబాటులోకి రానుంది.

కొత్త వీడియో ఫీచర్లు
ఫేస్‌టైమ్ ప్లాట్‌ఫాం కొత్తగా గ్రిడ్ వ్యూ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కాల్‌లో ఉన్న యూజర్లందరి ప్రొఫైల్స్ ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. గ్రిడ్ వ్యూ ఫీచర్‌ ద్వారా ఒకేసారి ఆరుగురు వ్యక్తుల ముఖాలు చూడవచ్చు. దీంతోపాటు జూమ్ కంట్రోల్ ఫీచర్ ద్వారా అవసరమైనప్పుడు జూమ్ చేసుకోవచ్చు. ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్‌ విషయంలో యూజర్లకు మరింత నియంత్రణను ఇస్తుంది. ఫేస్ టైమ్‌లో కొత్తగా పోర్ట్రెయిట్ మోడ్‌ను కూడా యాపిల్ తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్స్ సమయంలో వినియోగదారులు బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేసుకోవచ్చు. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా యాపిల్‌ మరిన్ని కొత్త ఫీచర్లను ఫేస్‌టైమ్‌కు జోడించే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Apple

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు