Electric Scooter | మార్కెట్‌లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. వీటిల్లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. మనం ఇప్పడు 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల (EV) గురించి తెలుసుకోబోతున్నాం. వీటి రేంజ్ చాలా ఎక్కువ. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 200 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అంతేకాకుండా ఈ స్కూటర్లలో (Scooter) సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఆప్‌కీ ఈవీ అనే స్టార్టప్ ఒకటి పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. వీటిల్లో బిగ్ బాస్, ఆర్చర్, పవర్, బాస్ అనే నాలుగు మోడళ్లు ఉన్నాయి. మనం ఇప్పుడు వీటిల్లో ఆర్చర్, పవర్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం. ఈ రెండు స్కూటర్లు 200 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉన్నాయి. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
కేంద్రం అదిరే స్కీమ్.. రైతులు ఒక్కో ఏకరాకు రూ.లక్ష ఆదాయం పొందొచ్చు!
ముందుగా పవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. దీని రేంజ్ 200 కిలోమీటర్లు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. అలాగే 0 నుంచి 100 శాతం బ్యాటరీ ఫుల్ కావడానికి దాదాపు 6 గంటలు టైమ్ పడుతుంది. దీని ఎక్స్‌షోరూమ్ దర రూ. 99,999గా ఉంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సులభంగానే బుక్ చేసుకోవచ్చు.
150 కి.మి రేంజ్, బడ్జెట్ ధరలో లభించే 8 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర రూ.59 వేల నుంచి..
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1500 వాట్ హబ్ మోటార్‌ను అమర్చింది. బీఎల్‌డీసీ హై ఎఫెసియెన్సీ మోటార్ ఇది. హెవీ డ్యూటీ చార్జర్ ఇస్తారు. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ ఉంటుంది. అదే కంట్రోలర్‌పై అయితే ఏడాది పాటు వారంటీ వస్తుంది. డీఆర్ఎల్‌తో కూడిన ఎల్‌ఈడీ లైట్స్ ఉంటాయి. మోటార్‌పై రెండేళ్ల వారంటీ వస్తుంది. ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. యాంటీ థెప్ట్ బజర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. యూఎస్‌బీ చార్జర్ ఫెసిలిటీ ఉంది. రిమోట్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది.
ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐదు పవర్ మోడ్స్ ఉంటాయి. ఇకపోతే ఆర్చర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కూడా దాదాపు ఇవే ఫీచర్లు ఉంటాయి. అయితే డిజైన్ మాత్రం మారుతుంది. ధర కూడా దాదాపు ఒకే విధంగా ఉంది. అందువల్ల మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినా కూడా ఒకటే. మీకు నచ్చిన డిజైన్ స్కూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicle, Ev scooters, SCOOTER