Electric Vehicles: వాయిదాలపై ఎలక్ట్రికల్‌ వాహనాలు.. ఎలాంటి డౌన్ పేమెంట్ అవసరం లేదు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

Electric Vehicles: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ వాహనాలను ప్రభుత్వం అందించనుంది. వాయిదా పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ టూవీలర్లను ఇవ్వనుంది. డౌన్‌ పేమెంట్‌ లేకుండా ఈఎంఐ వాయిదాల వెసులుబాటు కల్పిస్తోంది. సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించనుంది.

  • Share this:
    ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. సబ్సిడీపై ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వనుంది వైఎస్‌ జగన్ సర్కార్. ఉద్యోగులకు అవసరమైతే సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా మొత్తాన్ని వాయిదా పద్దతిలో చెల్లింపులకు ఆస్కారం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సెల్ సంస్థలు రాయితీ ఇస్తాయని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి అందించదని పేర్కొంది. వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి నెల వారీగా వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి సంబంధించి సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. నెలకు రూ. 2500 వరకూ వాయిదా చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఆసక్తిగల సిబ్బంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సమాచారం పంపింది. రాష్ట్రంలో సుమారు 80 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనానికి రోజుకు సగటున అర లీటరు పెట్రోలు వాడినా, 40 లక్షల లీటర్లు అవసరం అవుతుంది. వీటివల్ల వెలువడుతున్న కాలుష్యం, కర్బన ఉద్గారాలను కొంతైనా తగ్గించడానికి విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నెడ్‌క్యాప్‌ భావిస్తోంది.

    రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉండగా.. తొలివిడతలో లక్ష మందికి వీటిని అందిస్తుంది. ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుందని నెడ్‌క్యాప్‌ ఎండీ తెలిపారు. బండి వేగాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు సబ్సిడీ వస్తుంది. నెడ్‌క్యాప్‌ అందించే వాహనాలు గంటకు 25-55 కి.మీల వేగంతో నడవనున్నాయి.

    AP CM Jagan Biopic, AP CM Jagan Biopic news, AP CM Jagan Biopic director, AP CM Jagan Biopic details, Scam 1992 Fame Pratik Gandhi to Star in YS Jagan Mohan Reddy Biopic,Pratik Gandhi, Pratik Gandhi news, Pratik Gandhi picsజగన్‌ జీవితంపై సినిమా, జగన్ బయోపిక్
    AP cm jagan Photo : Twitter


    కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. వెహికల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఆమోదించిన నమూనాలను పరిశీలించి రాష్ట్రంలో విక్రయానికి పలు సంస్థలకు కేంద్రం ఆమోదం తెలిపింది. రుణాన్ని 24 నెలల నుంచి 60 నెలల్లో తీర్చే విధంగా వివిధ సంస్థలతో చర్చిస్తున్నామని, వాహన ధర బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఏప్రిల్‌ నెలలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
    Published by:Veera Babu
    First published: