AP CM YS JAGAN AND TS MINISTER KTR MET TOGETHER AT DAVOS WEF SUMMIT ANDHRA GOT MORE DEALS THAN TELANGANA MKS
CM Jagan | Min KTR : ఇక్కడ కుస్తీ.. దావోస్లో దోస్తీ.. పెట్టుబడుల్లో మాత్రం పోటాపోటీ.. ఎవరికి ఎంతంటే..
దావోస్ లో ఏపీ సీఎం జగన్, టీఎస్ మంత్రి కేటీఆర్
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ వేదికగా కలుసుకున్నారు. జగన్ సర్కారు పనితీరుపై కేటీఆర్ విమర్శల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, కేటీఆర్ బాలేదన్న ఏపీకి తెలంగాణ కంటే ఎక్కువ పెట్టుబడలు రావడం గర్హనీయం. వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు, మౌలిక సదుపాయాలు అస్సలు బాగా లేవని, ఎడాపెడా విద్యుత్ కోతలుంటాయని, అదే తెలంగాణలో మాత్రం నిత్యవెలుగులు, చక్కటిరోడ్లు కనిపిస్తాయంటూ ఆ మధ్య అదోరకం వ్యాఖ్యలు చేసి, జగన్ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన తర్వాత ఆల్మోస్ట్ ఏపీకి సారీ చెప్పారు టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం ఆయన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ లో ఉన్నారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దావోస్ లోనే ఉండటంతో ఇద్దరు నేతలు సరదాగా పలకరించుకున్నారు. జగన్ సర్కారు పనితీరుపై కేటీఆర్ విమర్శల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, కేటీఆర్ బాలేదన్న ఏపీకి తెలంగాణ కంటే ఎక్కువ పెట్టుబడలు రావడం గర్హనీయం. వివరాలివే..
ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ వేదికగా కలుసుకున్నారు. సూటూబూటు ధరించి దొరబాబుల్లా ఫొటోలకు పోజులిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీసీ, టీఆర్ఎస్ లు తరచూ కుస్తీపడుతుండగా, ఆ పార్టీల అధ్యక్షులు మాత్రం దావోస్ లో దోస్తీ చేస్తున్నారంటూ కామెంట్లు వస్తున్నాయి. ‘సోదరుడు జగన్ గారిని దావోస్ లో కలుసుకున్నా’అంటూ కేటీఆరే ఫొటోలు షేర్ చేశారు. ఇదిలా ఉంటే,
దావోస్ వేదికగా జగన్, కేటీఆర్ కలయిక
CM KCR : సీఎం కేసీఆర్ అనూహ్యం.. దేశవ్యాప్త పర్యటన మధ్యలోనే అర్దాంతరంగా హైదరాబాద్కు.. కారణమిదే..
రాజకీయంగా కుస్తీ పడినా, దావోస్ లో దోస్తీగా మెలిగినా పెట్టుబడుల సాధనలో మాత్రం తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. దావోస్ ఆర్థిక సదస్సు వేదికగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుంచి పెట్టుబడులు సాధించే విషయంలో ఏపీ సీఎం జగన్, టీఎస్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, తొలిరోజు మాత్రం ఏపీదే పైచేయి కావడం గమనార్హం.
దావోస్ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- అదానీ గ్రూప్ మధ్య ఏకంగా రూ.60వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా ఏపీలో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఇందులో ఒకటి 3,700 మెగావాట్లు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా రెండోది 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు. ఈ రెండు ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎంవోయూలో పేర్కొన్నారు. తద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దావోస్ పర్యటన తొలిరోజే గౌతం అదానీతో భేటీ అయిన సీఎం జగన్.. సదస్సు రెండో రోజే అదానీ గ్రూపుతో భారీ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. జగన్, గౌతం అదానీ సమక్షంలో ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున ఆశిష్ రాజ్వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఇక,
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు సైతం తొలిరోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం మొత్తంగా రూ.600 కోట్ల విలువైన పెట్టుబడులు సాధించింది. లూలు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీ తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పగా, స్పెయిన్కు చెందిన బహుళ జాతి కంపెనీ కీమో ఫార్మా కూడా రూ. 100 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించింది. సదస్సు ముగిసే నాటికి ఏపీ, తెలంగాణలు ఎన్ని పెట్టుబడులు సాధిస్తాయో చూడాలిమరి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.