హోమ్ /వార్తలు /బిజినెస్ /

ITR: గడువులోగా ఐటీఆర్‌ ఫైల్ చేయలేదా? అయితే మీ ముందున్న ఆప్షన్‌ ఇదే..

ITR: గడువులోగా ఐటీఆర్‌ ఫైల్ చేయలేదా? అయితే మీ ముందున్న ఆప్షన్‌ ఇదే..

ITR: గడువులోగా ఐటీఆర్‌ ఫైల్ చేయలేదా? అయితే మీ ముందున్న ఆప్షన్‌ ఇదే..

ITR: గడువులోగా ఐటీఆర్‌ ఫైల్ చేయలేదా? అయితే మీ ముందున్న ఆప్షన్‌ ఇదే..

ITR: గడువు లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా లేదా ఫైల్‌ చేసిన రిటర్న్‌లో ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2022లో కేంద్రం తీసుకొచ్చిన ITR-U (అప్‌డేటెడ్‌ రిటర్న్‌) ఆప్షన్‌ ద్వారా మళ్లీ ట్యాక్స్ రిటర్న్ ఫైల్‌ చేయవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆదాయ పన్ను (Income Tax) చట్టం ప్రకారం, నిర్ణీత మొత్తంలో ఆదాయం ఆర్జించేవారు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) సమర్పించి, ట్యాక్స్ కట్టాలి. అయితే గడువు లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా లేదా ఫైల్‌ చేసిన రిటర్న్‌లో ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2022లో కేంద్రం తీసుకొచ్చిన ITR-U (అప్‌డేటెడ్‌ రిటర్న్‌) ఆప్షన్‌ ద్వారా మళ్లీ ట్యాక్స్ రిటర్న్ ఫైల్‌ చేయవచ్చు.

పన్ను చెల్లింపుదారులు ITR-U ద్వారా సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ ముగిసిన రెండు సంవత్సరాల వరకు తమ ITRలలో లోపాలు సరిచేయవచ్చు. ఈ సదుపాయం ఒరిజినల్‌, బిలేటెడ్‌, రివైజ్డ్‌ ITRని ఫైల్ చేసిన లేదా చేయని వారికి కూడా అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ITR ఫైల్ చేయకపోతే, లేదా అందులో ఏవైనా మిస్టేక్స్‌ గుర్తిస్తే 2024 మార్చి 31లోపు అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్‌ చేయవచ్చు.

* ఏ సందర్భాలలో ITR-U వినియోగించవచ్చు?

ఐటీఆర్‌లో ఏదైనా ఆదాయాన్ని పొందుపరచడంలో పొరపాటు జరిగినప్పుడు, తప్పుడు పన్ను రేటు పేర్కొన్నప్పుడు ITR-U ఫైల్‌ చేయవచ్చు. ముందు సంవత్సరంలో రిటర్న్‌ ఫైల్‌ చేయనప్పుడు, క్యారీ ఫార్వర్డ్ లాస్‌ రిడక్షన్‌కి అప్‌డేటెడ్‌ రిటర్న్‌ ఉపయోగపడుతుంది. అన్‌అబ్జార్బ్‌డ్‌ డిప్రెసియేషన్‌ రిడక్షన్‌, తప్పుగా ఇన్‌కం హెడ్స్‌ సెలక్ట్‌ చేసుకున్నప్పుడు, MAT/AMT u/s 115JB/JC పన్ను క్రెడిట్ తగ్గింపు సమయంలో కూడా ITR-U వినియోగించవచ్చు.

* రిటర్న్ ఫైల్ చేయడానికి వ్యవధి

అప్‌డేటెడ్‌ రిటర్న్(ITR-U)ను సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన 24 నెలలలోపు ఫైల్ చేయవచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరం కోసం అప్‌డేటెడ్‌ రిటర్న్ ఫైల్ చేయడానికి 2023 మార్చి 31 గడువుగా గుర్తించాలి.

* జరిమానా

ఆలస్యంగా ITR ఫైల్‌ చేసినప్పుడు పెనాల్టీలు తప్పవు. సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ ముగిసిన ఒక సంవత్సరంలోపు రిటర్న్‌ను దాఖలు చేస్తే, పేర్కొనని ఆదాయానికి సంబంధించి అదనంగా 25 శాతం పన్ను, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత, సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ నుంచి రెండేళ్లలోపు రిటర్న్‌ను దాఖలు చేస్తే పెనాల్టీ 50 శాతానికి పెరుగుతుంది.

ఇది కూడా చదవండి : కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై తాజా అప్ డేట్..

* ITR-U ఫైల్‌ చేయకూడదని సందర్భాలు ఇవే

నిల్ రిటర్న్/లాస్ రిటర్న్ ఫైల్ చేయడానికి అప్‌డేటెడ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయలేరు. రీఫండ్‌ అమౌంట్‌ క్లెయిమ్‌ చేయడానికి పెంచడానికి ఉపయోగపడదు. అంతకుముందు ఫైల్‌ చేసిన ఐటీఆర్‌లో కంటే తక్కువగా ట్యాక్స్‌ చెల్లించడానికి ఐటీఆర్‌-యూ ఫైల్‌ చేయలేరు. సెక్షన్ 133 A కింద I-T సర్వే , సెక్షన్ 132 కింద I-T సెర్చ్‌ వంటివి జరిగినప్పుడు ఈ ఆప్షన్‌ ఉండదు. వ్యక్తి మనీలాండరింగ్ నిరోధక చట్టం లేదా నల్లధనం (బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, అస్సెట్‌), ట్యాక్స్‌ యాక్ట్‌ లేదా బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం లేదా స్మగ్లర్లు, విదేశీ మారక ద్రవ్య మానిప్యులేటర్ల చట్టం కిందకు వచ్చేవారు అప్‌డేటెడ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయలేరు.

ఆర్థిక సంవత్సరానికి అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయడం పూర్తయిన తర్వాత, రివైజ్డ్‌ అప్‌డేటెడ్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడం సాధ్యం కాదు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.2,50,000 కంటే తక్కువగా ఉంటే, అదనపు పన్ను బాధ్యత NIL అయితే ఐటీఆర్‌-యూ అవసరం లేదు.

* ITR-U ఎలా దాఖలు చేయాలి?

ముందుగా పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేయాలి. ITR-U ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫారంలోని మొదటి సెక్షన్‌లో.. పాన్, ఆధార్ నంబర్, అసెస్‌మెంట్ ఇయర్, అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి కారణం వంటి సాధారణ సమాచారాన్ని పేర్కొనాలి. రెండో సెక్షన్‌లో అదనపు ఆదాయం వివరాలు, మూడో సెక్షన్‌లో పన్ను చెల్లింపుల వివరాలను అందించాలి.

First published:

Tags: Income tax, ITR, ITR Filing, Personal Finance