news18-telugu
Updated: April 13, 2019, 9:43 PM IST
IRCTC Ticket Correction | ఐడీ కార్డులోని వివరాలు, రైలు టికెట్‌పై వివరాలు సరిపోలకపోతే ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు. మీ టికెట్ చెల్లకపోవచ్చు కూడా.
మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? రిజర్వేషన్ చేయించుకొని రైలులో ప్రయాణిస్తుంటారా? రైలు టికెట్లో ఎప్పుడైనా తప్పులు ఉంటే చూసి కంగారుపడ్డారా? రైలు టికెట్లో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. మీరు రైలు టికెట్ బుక్ చేసేప్పుడు మీ వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. మీ పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్టూడెంట్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి ఐడీ ప్రూఫ్స్ టీసీకి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఐడీ కార్డులోని వివరాలు, రైలు టికెట్‌పై వివరాలు సరిపోలకపోతే ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు. మీ టికెట్ చెల్లకపోవచ్చు కూడా. అయితే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏవైనా తప్పులు గుర్తిస్తే సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వేస్.
Read this:
SBI clerk Jobs: ఎస్బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...రైలు టికెట్లో తప్పులు సరిచేసుకోవడం ఎలా?
రైలు టికెట్లో తప్పులు సరిచేసుకోవడానికి రైల్వే రిజర్వేషన్ ఆఫీసుకి వెళ్లాలి.
‘Electronic Reservation Slip’ ప్రింట్ అవుట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ తీసుకెళ్లాలి.
రైలు బయల్దేరే సమయానికి 24 గంటలు ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది.
రైల్వే రిజర్వేషన్ ఆఫీసులో మీ రైలు టికెట్‌పై ఉన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు.బోర్డింగ్ స్టేషన్, ప్యాసింజర్ పేరు కూడా మార్చుకోవచ్చు.
ప్యాసింజర్ పేరు మార్చాలంటే రక్తసంబంధీకుల పేరుకే టికెట్ బదిలీ చేస్తారు.
రక్తసంబంధీకుల పేరుపై టికెట్ బదిలీ చేయాలంటే అందుకు కావాల్సిన ప్రూఫ్ చూపించాలి.
Photos: రూ.83,000 కోట్ల ఎయిర్పోర్ట్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
BEL Jobs: బీఈఎల్‌లో 150 అప్రెంటీస్ పోస్టులు
FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు
First published:
April 13, 2019, 8:34 PM IST