PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు

మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? పేరులో స్పెల్లింగ్ మిస్టేక్, డేట్ ఆఫ్ బర్త్, తండ్రిపేరులో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పాన్ కార్డు కరెక్షన్స్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: March 13, 2019, 9:31 PM IST
PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు
PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు
news18-telugu
Updated: March 13, 2019, 9:31 PM IST
పాన్ కార్డ్... ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇది. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిపేవారికి అతి ముఖ్యమైన ఐడీ కార్డు ఇది. అంతేకాదు... ఐడెంటిటీ ప్రూఫ్ కోసం కూడా పాన్ కార్డు ఉపయోగపడుతుంది. పాన్ కార్డుపై ఉంటే 10 ఆల్ఫాన్యూమరికల్ కోడ్ ప్రతీ ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే కొన్ని పొరపాట్ల వల్ల ఒకే పాన్ నెంబర్‌తో రెండు కార్డులు జారీ అయిన సందర్భాలున్నాయి. అంతేకాదు... పాన్ కార్డులో తప్పులు దొర్లుతుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ... తర్వాత ఎప్పుడైనా ఏదైనా దరఖాస్తు చేసినప్పుడు పాన్ కార్డులో ఉన్న తప్పుల వల్ల దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశముంది. మరి మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? పేరులో స్పెల్లింగ్ మిస్టేక్, డేట్ ఆఫ్ బర్త్, తండ్రిపేరులో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో పాన్ కార్డు కరెక్షన్స్ చేసుకోవచ్చు.

Read this: Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్

pan card correction process, pan card correction steps, pan card mistakes, corrections in pan card, pan card download, pan card application form, download e pan card, pan card reissue, how to change pan card name , new pan card apply, name change in pan card, pan card correction form new, పాన్ కార్డ్ తప్పులు, పాన్ కార్డ్ కరెక్షన్, పాన్ కార్డ్ ఫామ్, పాన్ కార్డ్ డౌన్‌లోడ్, పాన్ కార్డ్ దరఖాస్తు, డూప్లికేట్ పాన్ కార్డ్

ఆన్‌లైన్‌లో పాన్ కార్డులో తప్పులు సరిదిద్దుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి




1. ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ https://www.tin-nsdl.com/index.html ఓపెన్ చేయండి.
2. మొదటి పేజీలోనే కనిపించే Paperless PAN application ట్యాబ్ క్లిక్ చేయండి.
3. అప్లికేషన్ టైప్‌లో changes or correction in existing PAN సెలెక్ట్ చేయండి. కేటగిరీలో Individual క్లిక్ చేయండి.
Loading...
4. ఆ తర్వాత మీ పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి.
5. మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌కు టోకెన్ నెంబర్ వస్తుంది.
6. టెంపరరీ టోకెన్ నెంబర్‌తో లాగిన్ చేసి మీ పూర్తి వివరాలను సరిగ్గా ఎంటర్ చేయండి.
7. ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, పాత పాన్ కార్డ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
8. ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలి.
9. పేమెంట్ చేసిన తర్వాత ఇ-సైన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
10. ఇ-సైన్ పూర్తైన తర్వాత మీ పాన్ కరెక్షన్ దరఖాస్తు అప్‌లోడ్ అవుతుంది.

Read this: YouTube Music: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేసింది

pan card correction process, pan card correction steps, pan card mistakes, corrections in pan card, pan card download, pan card application form, download e pan card, pan card reissue, how to change pan card name , new pan card apply, name change in pan card, pan card correction form new, పాన్ కార్డ్ తప్పులు, పాన్ కార్డ్ కరెక్షన్, పాన్ కార్డ్ ఫామ్, పాన్ కార్డ్ డౌన్‌లోడ్, పాన్ కార్డ్ దరఖాస్తు, డూప్లికేట్ పాన్ కార్డ్
ప్రతీకాత్మక చిత్రం

ఆఫ్‌లైన్‌లో పాన్ కార్డులో తప్పులు సరిదిద్దుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి


1. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometaxindia.gov.in ఓపెన్ చేయండి.
2. మొదటి పేజీలో కనిపించే Individual/HUF ట్యాబ్ క్లిక్ చేసి Individual సెలెక్ట్ చేయాలి.
3. అందులో Request for Correction క్లిక్ చేస్తే పాన్ కరెక్షన్‌కు ఫామ్ ఓపెన్ అవుతుంది.
4. పాన్ కరెక్షన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి.
5. పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయొచ్చు. https://www.incometaxindia.gov.in/Documents/form-for-changes-in-pan.pdf
6. మీ ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ప్రస్తుత పాన్ కార్డు జిరాక్స్, ఫోటోలను జతచేసి దగ్గర్లో ఉన్న NSDL సెంటర్‌లో ఇవ్వాలి.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? దరఖాస్తుకు 3 రోజులే గడువు... ఇలా అప్లై చేయండి

Facebook: మీ ఫేస్‌బుక్ ఎక్కడెక్కడ లాగిన్ చేశారో తెలుసా? హ్యాక్ అయితే ఇలా చేయండి

Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త
First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...