హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Dhan Sanchay Policy: ఎల్‌ఐసీ మరో కొత్త పాలసీ .. తక్కువ సేవింగ్స్ తో రూ 22 లక్షలు సొంతం .. లుక్కేయండి.

LIC Dhan Sanchay Policy: ఎల్‌ఐసీ మరో కొత్త పాలసీ .. తక్కువ సేవింగ్స్ తో రూ 22 లక్షలు సొంతం .. లుక్కేయండి.

 ఎల్‌ఐసీ మరో కొత్త పాలసీ .. తక్కువ సేవింగ్స్ తో రూ 22 లక్షలు సొంతం .. లుక్కేయండి.

ఎల్‌ఐసీ మరో కొత్త పాలసీ .. తక్కువ సేవింగ్స్ తో రూ 22 లక్షలు సొంతం .. లుక్కేయండి.

నిర్దిష్ట వ్యక్తుల కోసం ఎల్‌ఐసీ(LIC) నిర్దిష్ట ఇన్సూరెన్స్(insurances) ప్లాన్స్ రూపొందించింది. ప్రభుత్వ సహకారంతో దాదాపు అన్ని వయసుల, వర్గాల ప్రజల కోసం ఇన్సూరెన్స్‌ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ జాబితాలో LIC ధన్ సంచయ్ పాలసీ ఒకటి. దీని ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

కష్టపడి సంపాదించిన సొమ్మును నష్టభయం లేని ఫైనాన్షియల్‌(Financial) ప్రొడక్ట్‌లలో పెట్టుబడి పెట్టాలని అందరూ భావిస్తారు. రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయం అందుకోవాలని కోరుకుంటారు. సురక్షితమైన భవిష్యత్తును కోరుకునే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) చక్కటి పథకాలను అందిస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటామనే భయంతో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకునే భారతీయుల కోసం ఎల్‌ఐసీ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంది. బ్యాంక్(Bank), పోస్టాఫీస్‌ సేవింగ్స్ స్కీమ్‌లతో పాటు, ఎల్‌ఐసీ పాలసీలో పెట్టుబడి పెట్టడం అనేది ఎటువంటి రిస్క్ తీసుకోనవసరం లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ పొందడానికి డబ్బును ఆదా చేయడానికి ఒక మార్గం. ఈ కారణంగా నిర్దిష్ట వ్యక్తుల కోసం ఎల్‌ఐసీ నిర్దిష్ట ఇన్సూరెన్స్ ప్లాన్స్ రూపొందించింది. ప్రభుత్వ సహకారంతో దాదాపు అన్ని వయసుల, వర్గాల ప్రజల కోసం ఇన్సూరెన్స్‌ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ జాబితాలో LIC ధన్ సంచయ్ పాలసీ ఒకటి. దీని ప్రయోజనాలు తెలుసుకుందాం.

LIC ధన్ సంచయ్ పాలసీ అంటే ఏంటి?

ఎల్‌ఐసీ ధన్ సంచయ్ పాలసీ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, పర్సనల్, సేవింగ్స్(Savings), లైఫ్‌ ఇన్సూరెన్స్‌ప్లాన్. ఇది రక్షణ, పొదుపుల కలయికను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో ఈ ప్లాన్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది మెచూరిటీ తేదీ నుంచి చెల్లింపు వ్యవధిలో హామీ ఇచ్చిన ఆదాయ మొత్తాన్ని కూడా అందిస్తుంది.

ఎల్‌ఐసీ ధన్ సంచయ్ పాలసీ మెచూరిటీ తేదీ నుంచి పే-అవుట్ వ్యవధిలో హామీ ఇచ్చిన ఆదాయ ప్రయోజనాన్ని, హామీతో కూడిన టెర్మినల్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఎంచుకున్న సంవత్సరంలో చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం వార్షిక ప్రీమియం అవుతుంది. పన్నులు, రైడర్ ప్రీమియంలు, అదనపు పూచీకత్తు, మోడల్ ప్రీమియంల కోసం ప్రీమియంలు, లోడింగ్‌లు, వంటి వాటికి పాలసీదారుకు మినహాయింపు ఉంటుంది. పన్నులు, రైడర్ ప్రీమియంలు, అండర్ రైటింగ్ అదనపు ప్రీమియంలు ఏవైనా ఉంటే మినహాయించి పాలసీదారు ఎంచుకున్న ప్రీమియం మొత్తం సింగిల్ ప్రీమియం. రూ.1,000 మల్టిపుల్స్‌లో వార్షిక ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం ఎంచుకోవచ్చు.

ఇదీ చదవండి:  Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!మెచూరిటీ నాటికి రూ.22 లక్షలు పొందడం ఎలా?

ఎల్‌ఐసీ ధన్ సంచయ్ పాలసీ సాధారణ లేదా వార్షిక ప్రీమియం చెల్లింపులపై ఆధారపడి నాలుగు ప్రయోజనాలను అందిస్తుంది. వాటి వివరాలు..

రెగ్యులర్/పరిమిత ప్రీమియం చెల్లింపు విషయంలో:

ఆప్షన్‌ A: లెవల్‌ ఇన్‌కం బెనిఫిట్‌

ఆప్షన్‌ B: ఆదాయ ప్రయోజనాలను పెంచడం

సింగిల్ ప్రీమియం చెల్లింపు విషయంలో:

ఆప్షన్‌ సి: సింగిల్ ప్రీమియం లెవల్‌ ఇన్‌కం బెనిఫిట్‌

ఆప్షన్‌ డీ: లెవెల్ ఇన్‌కం బెనిఫిట్‌తో సింగిల్ ప్రీమియం ఎన్‌హ్యాన్స్‌డ్‌ కవర్

ఆప్షన్‌ A, B లలో.. ఎల్‌ఐసీ ధన్ సంచయ్ పాలసీ కింద పాలసీదారు మరణించినప్పుడు కనీస హామీ మొత్తం రూ.3.30 లక్షలు కాగా, ఆప్షన్ Cకి ఇది రూ.2.50 లక్షలు. లెవెల్ ఇన్‌కం బెనిఫిట్‌తో కూడిన సింగిల్ ప్రీమియం ఎన్‌హ్యాన్స్‌డ్‌ కవర్ అయిన ఆప్షన్ D కోసం, మరణంపై కనీస హామీ మొత్తం రూ.22 లక్షలు. పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభమైన తేదీ తర్వాత కానీ నిర్ణీత మెచూరిటీ తేదీకి ముందు లైఫ్ అష్యూర్డ్ మరణంపై చెల్లించాల్సిన డెత్ బెనిఫిట్, డెత్‌పై సమ్ అష్యూర్డ్ ఇస్తారని ఎల్‌ఐసీ తన పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొంది.

Published by:Mahesh
First published:

Tags: Financial banks, Financial Planning, Health Insurance, LIC

ఉత్తమ కథలు