Home /News /business /

ANOTHER INTERNATIONAL COMPANY FOR TELANGANA FISKER COMPANY STARTED AN ELECTRIC CAR MANUFACTURING UNIT IN HYDERABAD GH VB

Fisker EV: తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ.. హైదరాబాద్ లో ఆ యూనిట్ ను ప్రారంభించిన కంపెనీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన(EV) తయారీ సంస్థ ఫిస్కర్ (Fisker) భారతదేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. న్యూయర్క్ స్టాక్ ఎక్సేంజీ(NYSE)లో లిస్ట్ అయిన ఈ సంస్థ హైదరాబాద్ లో ఆఫీస్ ఏర్పాటు చేయడం విశేషం.

అమెరికాకు(America) చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన(EV) తయారీ సంస్థ ఫిస్కర్ (Fisker) భారతదేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. న్యూయర్క్ స్టాక్ ఎక్సేంజీ(NYSE)లో లిస్ట్ అయిన ఈ సంస్థ హైదరాబాద్(Hyderabad) లో ఆఫీస్ ఏర్పాటు చేయడం విశేషం. కాలిఫోర్నియాకు చెందిన ఫిస్కర్ ఈవీ (Fisker EV) ఇప్పటికే స్థానికంగా ప్రతిభావంతులైన యువకుల నియామకాన్ని ప్రారంభించింది. ఈ విభాగంలో భారతదేశంలో(India) 200 ఉద్యోగాలను సృష్టించాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది సంస్థ. సాఫ్ట్‌వేర్(Software), వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్(Development) సపోర్ట్ ప్రక్రియలపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించింది.

రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రపంచ సంస్థలను ఆకర్షించేందుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు(కేటీఆర్) నేతృత్వంలోని ప్రతినిధి బృందం గత నెలలో అమెరికాలో పర్యటించింది. అక్కడ ఫిస్కర్ ఎలక్ట్రిక్ తో జరిగిన ఒప్పంద ప్రకారం భారత ప్రధాన కార్యాలయాన్ని తెలంగాణలోని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Electric Car: సింగిల్ ఛార్జ్‌తో 1,000 కిలోమీటర్లు.. ఈ EV Car మాములుగా లేదుగా..


ఫిస్కర్ విజ్ఞాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట తెలంగాణలో ఏర్పాటైన ఈ కంపెనీ ఆపరేట్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్, వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్ సపోర్ట్ ఫంక్షన్‌లు, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్‌పై దృష్టి సారిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాలిఫోర్నియాలోని ఫిస్కర్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సదుపాయాలు హైదరాబాద్ కార్యాలయానికి అనుసంధానంగా పని చేస్తాయని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల వ్యూహాత్మక మార్కెట్ అవకాశాలు, గ్లోబల్ ఇంజినీరింగ్ సామర్థ్యాలకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది అని కంపెనీ ఛైర్మన్, సీఈఓ హెన్రిక్ ఫిస్కర్ అన్నారు. ఇప్పటికే భారతదేశంలో నియామకాలను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మా కొత్త బృందం పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని భావిస్తున్నాం. రాబోయే కొద్ది వారాల్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సహా.. పలు ఉత్పత్తుల కార్యకలాపాల్లో నిమగ్నమవుతామని వెల్లడించారు. తద్వారా భారత్ లో ఫిస్కర్ ఓషన్, ఫిస్కర్ పియర్ మోడళ్లను లాంచ్‌ వేగంగా లాంచ్ చేసేందుకు వీలవుతుందన్నారు.

Inflation: మార్చిలో 17 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో వీటి ధరలు పెరిగే అవకాశం..?


ఫిస్కర్ ఓషన్ ఎస్.యూ.వీ(fisker ocean) ఉత్పత్తిని ఈ ఏడాది నవంబర్ 17 నుంచి ఆస్ట్రియాలో ప్రారంభించనుంది. సాంకేతిక ప్రతిభ అన్వేషణ రేసులో భాగంగా హైదరాబాద్‌లో స్థాపించిన కార్యాలయం ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనంగా భావిస్తోంది. త్వరితగతిన ఆపరేషన్ చేపట్టి, వేగంగా ప్రారంభించేందుకు వీలు కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సంస్థ సీఈఓ వెల్లడించారు.

ప్రస్తుతం కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 450 మంది ఉద్యోగులతో కూడిన బృందం ఉంది. అమెరికా, యూరప్ సహా.. భారతదేశంలో కొత్త నియామకాలు చేపట్టనుంది. దీనితో 2022 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 800 మందికి పైగా పెంచేందుకు ప్రణాళికలు వేస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Cars, Electric Car, Electric Vehicles

తదుపరి వార్తలు