ANOTHER CHINESE APP TIKTOK SET TO RETURN IN INDIA AFTER BAN LIKE PUBG AKA BATTLEGROUNDS MOBILE INDIA CHECK NEW NAME MK GH
TikTok: భారత్‌లో మళ్లీ అందుబాటులోకి టిక్‌టాక్?.. ఆ పేటెంట్ దరఖాస్తులో ఏముంది?
TikTok (ప్రతీకాత్మకచిత్రం)
టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తమ వీడియో యాప్‌ను మళ్లీ భారత్‌లోకి వేరే పేరుతో విడుదల చేయాలని కసరత్తులు చేస్తోంది. అయితే పలికేందుకు మాత్రం ఆ పేరు టిక్‌టాక్ అనే అనాల్సి వస్తుంది. తమ కొత్త టిక్‌టాక్ (TickTock) యాప్‌కు ట్రేడ్‌మార్క్ ఇవ్వాలంటూ బైట్‌డ్యాన్స్ సంస్థ వాణిజ్య మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుందట.
ఎంతో పాపులరై.. ఆ తర్వాత భారత్‌లో నిషేధానికి గురైన చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాన్ అయిన సంవత్సరం తర్వాత మళ్లీ దేశంలోకి వచ్చేందుకు ఆ యాప్ ప్రయత్నిస్తోంది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తమ వీడియో యాప్‌ను మళ్లీ భారత్‌లోకి వేరే పేరుతో విడుదల చేయాలని కసరత్తులు చేస్తోంది. అయితే పలికేందుకు మాత్రం ఆ పేరు టిక్‌టాక్ అనే అనాల్సి వస్తుంది. తమ కొత్త టిక్‌టాక్ (TickTock) యాప్‌కు ట్రేడ్‌మార్క్ ఇవ్వాలంటూ బైట్‌డ్యాన్స్ సంస్థ వాణిజ్య మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుందట. అలాగే కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్ కోసం పేటెంట్స్ కోసం కూడా కోరిందని సమాచారం. ఈ విషయాన్ని టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెల్లడించగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టిక్‌టాక్ కోసం ఎదురుచూస్తున్న వారు ఖుషీ అవుతున్నారు.
మరోవైపు కోట్లాది మంది యూజర్లు ఉన్న చైనీస్ యాప్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం గత సంవత్సరం జూన్‌లో నిషేధించింది. యూజర్ల సమాచారాన్ని చైనా సర్వర్లకు అందిస్తూ దేశ సమగ్రత, భద్రతకు ముప్పుగా మారిందని బ్యాన్ చేసింది. దీంతోపాటు అనేక చైనాకు చెందిన యాప్‌లపై వేటు వేసింది. ఇక టిక్‌టాక్ బ్యాన్ కావడంతో దేశంలో రీల్స్, షాట్స్, స్పాట్లైట్ లాంటి షార్ట్ వీడియో యాప్‌లు ఎంతో ఫేమస్ అయిపోయాయి. వాటి యూజర్లు అమాంతం పెరిగారు.
అయితే బ్యాన్ అయిన చైనా యాప్‌లు మళ్లీ భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో పబ్జీ మళ్లీ ఇండియాలో అడుగుపెట్టింది. నిషేధానికి గురైన ఏడాది తర్వాత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో దేశంలో విడుదలైంది. చాలాకాలం తర్వాత వచ్చిన ఈ గేమ్‌కు విశేష ఆదరణ లభించింది. నెలరోజుల్లోనే కోట్ల డౌన్లోడ్లు అయ్యాయి. మరోవైపు బ్యాన్‌కు గురైన చైనా ఈకామర్స్ సంస్థ షెయిన్ కూడా భారత్‌లో మళ్లీ వచ్చేసింది. అయితే పూర్తిస్థాయి యాప్‌గా కాకుండా.. అమెజాన్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఇప్పుడు బైట్‌డ్యాన్స్ కూడా టిక్‌టాక్‌ను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్ హోస్టింగ్, ఇంటరాక్టివ్ అప్లికేషన్స్, హోస్టింగ్ మల్టీమీడియా అనే డిస్క్రిప్షన్‌తో తమ యాప్‌కు టిక్‌టాక్ (TickTock) అనుమతి ఇవ్వాలని బైట్‌డ్యాన్స్ జూలై 6న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీంతో టిక్‌టాక్ మళ్లీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారిలో ఆశలు మొదలయ్యాయి. మరోవైపు టిక్‌టాక్ వద్దంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.