హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI annual report: త్వరలో RBI యాన్యువల్ రిపోర్ట్.. వారికి 'వర్క్ ఫ్రమ్ ఎనీవేర్' పాలసీ?

RBI annual report: త్వరలో RBI యాన్యువల్ రిపోర్ట్.. వారికి 'వర్క్ ఫ్రమ్ ఎనీవేర్' పాలసీ?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్, పేమెంట్ సిస్టమ్‌ పనితీరులో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిబ్బందికి మరిన్ని సౌలభ్యాలు కల్పించాలని ఆర్బీఐ చూస్తోంది.

ఇంకా చదవండి ...

కరోనావైరస్ మహమ్మారి బ్యాంకింగ్ సిస్టమ్‌పై ఎంతో ప్రభావం చూపింది. కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ (Digital payments), ఆన్‌లైన్ బ్యాంకింగ్ (Online banking) కార్యకలాపాలు పెరిగాయి. అప్పటికే డిజిటల్ ఇండియా పాలసీలను అమలు చేసిన బ్యాంకులు, కోవిడ్ తర్వాత ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నాయి. అయితే కరోనా సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్, పేమెంట్ సిస్టమ్‌ పనితీరులో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సిబ్బందికి మరిన్ని సౌలభ్యాలు కల్పించాలని ఆర్బీఐ చూస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీపై గత కొన్ని నెలలుగా కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫీస్ వ్యవహారాల్లో కొన్ని కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో ప్రైవేట్ సంస్థలకు దూరంగా ఉండాలని ఆర్బీఐ చూస్తోంది. FY23 కోసం ప్రకటించిన ఎజెండాలో భాగంగా, మే 27న ఆర్బీఐ ఒక నివేదిక (RBI Report) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, RBI కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పని వాతావరణాన్ని (work environment) సృష్టించేందుకు ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’ (working from anywhere) అనే విధానాన్ని రూపొందిస్తోంది.

2020 ప్రారంభంలో కరోనావైరస్ మహమ్మారి భారతదేశంపై తీవ్రమైన ప్రభావం చూపిన తర్వాత.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్, పేమెంట్ సిస్టమ్‌తో పాటు వర్కింగ్ మోడ్ వంటి ఇతర విషయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వర్కింగ్ పాలసీపై సంస్థ దృష్టి పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.

* కోవిడ్ సమయంలో స్పెషల్ కేర్

కరోనా సమయంలో దాదాపు 250 మంది సిబ్బంది, సర్వీస్ ప్రొవైడర్ల కోసం స్పెషల్ క్వారంటైన్ ఫెసిలిటీని ఆర్బీఐ ఏర్పాటు చేసింది. దీంతో పాటు COVID-19 నిర్బంధ కేంద్రాలుగా పనిచేయడానికి కొన్ని నగరాల్లో హోటల్ గదుల కోసం అపోలో హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దశలో వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ (Work from Home policy)ని ఆర్బీఐ అమలు చేసింది. మార్చి 31 నాటికి RBIలోని 12,782 మంది సిబ్బందిలో 98 శాతం మందికి కోవిడ్ టీకాలు వేశారు. ఇలా ఉద్యోగుల సంక్షేమం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంది.

‘వర్కింగ్ ఫ్రమ్ ఎనీవేర్ (Work from Anywhere)’ అనే కొత్త పాలసీతో పాటు, సెంట్రల్ బ్యాంక్ వెల్నెస్ సంబంధిత విషయాలపై కూడా దృష్టి పెట్టింది. ఇందుకు ప్రత్యేకంగా "ఉద్యోగుల సహాయ కార్యక్రమం" (employee assistance programme)ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌పై RBI నియమించిన ఉప సంఘం FY22లో అస్సలు సమావేశం కాలేదు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కమిటీ రెండుసార్లు సమావేశమైంది.

First published:

Tags: Rbi, Reserve Bank of India, Work From Home

ఉత్తమ కథలు