హోమ్ /వార్తలు /బిజినెస్ /

Araku Tour: విశాఖపట్నం నుంచి ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ

Araku Tour: విశాఖపట్నం నుంచి ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ

Araku Tour: విశాఖపట్నం నుంచి ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)

Araku Tour: విశాఖపట్నం నుంచి ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ (ప్రతీకాత్మక చిత్రం)

Araku Tour | విశాఖపట్నంవాసులకు, వైజాగ్ వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్.ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

శీతాకాలంలో అరకు అందాలు చూసేందుకు ప్లాన్ చేస్తున్నారా? అరకుతో పాటు వైజాగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. తక్కువ ధరకే ఒక రోజు అరకు టూర్ ప్యాకేజీ (Araku Tour Package) ఆపరేట్ చేస్తోంది. అరకు అందాలు చూడాలనుకునే పర్యాటకులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేయొచ్చు. అరకుతో పాటు విశాఖపట్నం లోకల్ సైట్ సీయింగ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. విశాఖపట్నంవాసులతో పాటు వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకునేవారు ఈ ప్యాకేజీలు వాడుకోవచ్చు. మరి ఏ ప్యాకేజీ బుక్ చేస్తే ఏఏ టూరిస్ట్ స్పాట్స్ చూడొచ్చో తెలుసుకోండి.

అరకు టూర్ ప్యాకేజీ వివరాలివే

ఏపీటీడీసీ అరకుకు ఒక రోజు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అరకు టూర్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు చూడొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.1,590, పిల్లలకు రూ.1,270. టూర్ ప్యాకేజీలో నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్, మినరల్ వాటర్, టీ, స్నాక్స్, ట్రైబల్ ధింసా డ్యాన్స్ కవర్ అవుతాయి.

Vande Bharat Train: మా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వందే భారత్ రైలు కావాలి... తెరపైకి కొత్త డిమాండ్

విశాఖపట్నం హెరిటేజ్ టూర్

విశాఖపట్నం లోకల్ సైట్ సీయింగ్ కోసం ఏపీటీడీసీ ఒక రోజు టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. వైజాగ్ లోకల్ టూర్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు కైలాసగిరి, సింహాచలం, తొట్లకొండ, ఫిషింగ్ హార్బర్‌లో బోటింగ్, రిషికొండ బీచ్, విశాఖ సబ్ మెరైన్ మ్యూజియం, జాతర శిల్పారామం లాంటి పర్యాటక ప్రాంతాలు చూడొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.910, పిల్లలకు రూ.730. టూర్ ప్యాకేజీలో ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, లంచ్ కవర్ అవుతాయి. నాన్ ఏసీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. నాన్ ఏసీ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.760, పిల్లలకు రూ.610.

Tirumala Darshanam: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్ సులువుగా పొందండి ఇలా

విశాఖపట్నం లీజర్ నైట్ టూర్

రాత్రివేళలో వైజాగ్ అందాలు చూడాలనుకునేవారి కోసం విశాఖపట్నం లీజర్ నైట్ టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది ఏపీటీడీసీ. ఈ టూర్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు ఫిషింగ్ హార్బర్, సబ్‌మెరైన్ మ్యూజియం, కైలాసగిరి, జాతర శిల్పారామం చూడొచ్చు. రుషికొండ బీచ్‌లోని హరిత రిసార్ట్‌లో డిన్నర్ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.448, పిల్లలకు రూ.340. టూర్ ప్యాకేజీలో సైట్ సీయింగ్, డిన్నర్ కవర్ అవుతాయి.

First published:

Tags: Araku, Visakhapatnam

ఉత్తమ కథలు