• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • ANDHRA PRADESH SETS BIG INCENTIVES FOR INDUSTRY IN DRAFT POLICY BA

ఏపీలో పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం స్వీట్ న్యూస్...

ఏపీలో పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం స్వీట్ న్యూస్...

కియా కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ (File)

2020 - 25 సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ ముసాయిదా బిల్లులో భారీ తాయిలాలను సిద్ధం చేసింది.

  • Share this:
    భారీ తాయిలాలు... ఏపీలో పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం స్వీట్ న్యూస్...భారీ తాయిలాలు... ఏపీలో పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం స్వీట్ న్యూస్...
    ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ నజరానాలను ప్రకటించనుంది. 2020 - 25 సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ ముసాయిదా బిల్లులో భారీ తాయిలాలను సిద్ధం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఐదేళ్ల ఇండస్ట్రియల్ పాలసీ ఈ ఏడాదితో ముగుస్తుంది. దీంతో మరో ఐదేళ్ల పాటు కొత్త ఇండస్ట్రియల్ పాలసీని జగన్ ప్రభుత్వం ప్రకటించనుంది. ఐదేళ్ల కాలానికి మొత్తం రూ.4638 కోట్ల ఇన్సెంటివ్‌లు ప్రకటించనున్నట్టు తెలిసింది. 2015 - 20 సంవత్సరాల మధ్య కాలానికి ప్రభుత్వం రూ.2,431 కోట్లు ప్రతిపాదించింది. గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే కొత్తగా ప్రతిపాదించబోయే పాలసీలో సుమారు రూ.2207 కోట్ల ప్రోత్సాహకాలను అదనంగా అందించనుంది.

































    కేటగిరి 2015 - 20 మధ్య ఇన్సెంటివ్‌లు  2020- 25 (ప్రతిపాదిత ఇన్సెంటివ్‌లు)
    ఇంట్రెస్ట్ సబ్సిడీ రూ.314 కోట్లు  రూ.595 కోట్లు
    పెట్టుబడి సబ్సిడీ రూ.1026 కోట్లు రూ.2315 కోట్లు
    విద్యుత్ సబ్సిడీ రూ.356 కోట్లు రూ.520 కోట్లు
    సేల్స్ ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్ రూ.642 కోట్లు రూ.1059 కోట్లు
    ఇతర ఇన్సెంటివ్స్ రూ.94 కోట్లు  రూ.149 కోట్లు

    ఏ సంవత్సరానికి ఎంత ఇన్సెంటివ్స్ (అంచనా)

    • 2020 - 21 సంవత్సరానికి రూ.674 కోట్లు

    • 2021 - 22 సంవత్సరానికి రూ.779 కోట్లు

    • 2022 - 23 సంవత్సరానికి రూ.904 కోట్లు

    • 2023 - 24 సంవత్సరానికి రూ.1052 కోట్లు

    • 2024 - 25 సంవత్సరానికి రూ.1230 కోట్లు


    ఇంత భారీ స్థాయిలో పెట్టుబడుల రాయితీలు కల్పించడం వల్ల రాష్ట్రంలో సుమారు 2,48,482 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. భారీగా రాయితీలు కల్పించడం వల్ల రాష్ట్రంలో సుమారుగా రూ.38119 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేసింది. కోటి రూపాయలు పెట్టుబడి పెడితే సుమారు ఏడుగురికి కొత్తగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్టు ముసాయిదా బిల్లులో అంచనా వేసింది. పరిశ్రమలకు రాయితీలు కల్పించడం వల్ల రాష్ట్రానికి 2020  25 సంవత్సరాల్లో మొత్తం కలిపి సుమారు రూ.3896 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. అందులో రాష్ట్ర జీఎస్టీ రూ.858 కోట్లు (క్యాపిటల్ పెట్టుబడి వల్ల), మరో రూ.3039 కోట్లు (సేల్స్ ద్వారా లభించే రాష్ట్ర జీఎస్టీ) రావొచ్చని ముసాయిదాలో పొందుపరిచింది.

    జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులోనూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఏరో స్పేస్, డిఫెన్స్, ఫార్మా,కెమికల్స్, టెక్స్‌టైల్స్, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఆటో రంగం, ఆటో అనుబంధ రంగాలకు ప్రాధాన్యత క్రమంలో ప్రోత్సాహకాలు అందిస్తుంది. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 75శాతం ఉద్యోగాలు స్థానికులకే నిబంధనలు అమలు చేస్తున్న కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి రూ.3000 చొప్పున నగదు ప్రోత్సహకాలు ఇవ్వనుంది. తొలి రెండేళ్ల కాలానికి ఈ ప్రోత్సహకం ఒక్కసారి మాత్రమే ఇస్తారు.

    ఇటీవల కియామోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ పెద్ద దుమారం రేగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన ప్రోత్సాహకాలను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువ ప్రోత్సాహకాలతో కొత్త పారిశ్రామిక పాలసీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు